చింతల్ బస్తీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక ప్రాంతం.

చింతల్ బస్తీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక ప్రాంతం.[1] ఇది మసాబ్ ట్యాంక్, ఎసి గార్డ్స్, ప్రేమ్ నగర్ ప్రాంతాలకు సమీపంలో ఉంది.[2]

చింతల్ బస్తీ
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 004
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంజూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు మార్చు

ఇక్కడికి సమీపంలో ఆనంద్ నగర్ కాలనీ, వీర్ నగర్, పి అండ్ టి ఆఫీసర్స్ కాలనీ, సెంట్రల్ సెక్రటేరియట్, అంబేద్కర్ నగర్, వీరరెడ్డి కాలనీ, షామ్ నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.[3]

ప్రార్థన స్థలాలు మార్చు

ఇక్కడ గజ్జాలమ్మ దేవాలయం, దుర్గా దేవాలయం, షాదాన్ మసీదు, కుతుబ్ షాహి మసీదు మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చింతల్ బస్తీ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలోని ఖైరతాబాదు, లక్డికాపూల్ ప్రాంతాల్లో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.

విద్యాసంస్థలు మార్చు

షాదన్ విమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ, రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, గ్రీన్వుడ్ కిండర్ గార్టెన్ సెంటర్, తారాపోరేవల్లా యొక్క మాంటిస్సోరి హౌస్ ఆఫ్ చిల్డ్రన్, విద్యా వినయాలయ పాఠశాల, సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్ మొదలైన విద్యాసంస్థలు ఉన్నాయి.

ఇతర వివరాలు మార్చు

చింతల్ బస్తీలోని వీర్ నగర్ లో విజయ్ మేరీ హాస్పిటల్ ఉంది.[5]

మూలాలు మార్చు

  1. "Chintal Basti Main Road, Prem Nagar, Banjara Hills Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  2. "Sector I". Hyderabad City Police. Archived from the original on 28 September 2013. Retrieved 2021-01-26.
  3. "Chintal Basti Main Road, Chintal Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  5. "Location / Site". Vijay Marie Hospital. Archived from the original on 17 March 2013. Retrieved 2021-01-26.