చిక్కడు దొరకడు (1967 సినిమా)

1967 సినిమా

ఎన్.టి.ఆర్. కథానాయకుణిగా నిర్మాణం జరిగిన సినిమాలలో మంచి విజయం పొందిన సినిమా. సినిమా కథతో పాటు మంచి హాస్యం ఉండి చివరి వరకూ వినోదంగా సాగుతుంది. చిక్కడు దొరకడు, తెలుగు చలన చిత్రం 1967 డిసెంబర్ 21 విడుదల. నందమూరి తారక రామారావు, జయలలిత, కాంతారావు, కృష్ణకుమారి, నటించిన ఈ చిత్రానికి, చిత్రానువాదం, దర్శకత్వం, బి. విఠలాచార్య. సంగీతం టీ. వి. రాజు అందించారు.

చిక్కడు దొరకడు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
కథ వీటూరి
చిత్రానువాదం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
నందమూరి తారక రామారావు,
జయలలిత,
కృష్ణ కుమారి,
సత్యనారాయణ
సంగీతం టి.వి.రాజు
(విజయా కృష్ణమూర్తి (సహాయకులు)
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
నృత్యాలు చిన్ని-సంపత్
గీతరచన సి.నారాయణరెడ్డి, వీటూరి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

ఒకానొక రాజు తన బావమరది వలన తన ఇరువురు పిల్లలను పోగొట్టుకొని జైలుపాలవుతాడు, రెండు ప్రదేశాలలో పెరిగిన పిల్లలు పెరిగి ఒకరు దొంగగా, మరొకరు ధనవంతుని బిడ్డగా పెరుగుతారు. వాళ్ళిద్దరూ కలసి తమ తలిదండ్రుల గురుంచి తెలుసుకొని రాజ్యాన్ని రక్షించుకుంటారు.



నటీనటులు మార్చు

ఇతర విశేషాలు మార్చు

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
దోరనిమ్మ పండులాగ ఊరించే దొరసాని సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏదీ? ఏదీ? అందమైన నీ మోమే అదిగాకింకేదీ సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
ఓరబ్బీ వినరయ్యో ఓలమ్మీ వినరమ్మో ఈలోకం గుట్టురట్టు సి.నారాయణరెడ్డి విజయా కృష్ణమూర్తి పి.సుశీల
  1. అందాలన్ని నీవే ఆనందలన్ని నీవే - సుశీల, బి. వసంత, ఘంటసాల. రచన: సి. నారాయణ రెడ్డి.
  2. ఇంతలో ఏమో జరిగింది వింతగా తనువే కరిగింది - సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  3. ఇదిగో నేనున్నాను ఎదురుగ నీవున్నావు ఎదలో - సుశీల, రచన:సి నారాయణ
  4. ఓలబ్బి ఇనరయ్యో ఓలమ్మి ఇనరమ్మో ఈ లొకం గుట్టు - సుశీల , రచన: సి నారాయణ
  5. ఔరా వీరాధి వీరా ఔరౌరా వీరాధివీరా - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ . రచన; సి. నారాయణ రెడ్డి.
  6. కన్నెపిల్ల అనగానే అందరికి అలుసే కన్నుగీటి అయ్యో అయ్యో - సుశీల, రచన: వీటూరి వెంకట సత్య సూర్య నారాయణ మూర్తి.

వనరులు మార్చు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.