చెమ్మీన్ 1965లో విడుదలైన మలయాళ సినిమా. ఈ సినిమా జాతీయ చలనచిత్ర పురస్కారాలలో దక్షిణ భారతదేశం నుండి తొలిసారి ఉత్తమ చలనచిత్రంగా ఎన్నికైనది.[1] ఈ సినిమా తకళి శివశంకర పిళ్ళై వ్రాసిన చెమ్మీన్ (ఎర్రచేప) నవల ఆధారంగా తీయబడింది. రాము కారియత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సముద్రం, కెరటాలు, ఇసుకతిన్నెలు, కొబ్బరితోపులు, పాటలు పాడే పల్లెవారు, కల్లాకపట మెరుగని కన్నెపిల్లల చిరునవ్వులు సుందరంగా చిత్రీకరించబడింది. సముద్రతీరంలోని పల్లెప్రజల కథ ఇది. తనకంటూ స్వంతంగా ఒక పడవ కొనుక్కోవాలని తాపత్రపడే ఒక ఇంటి పెద్ద, జీవితంలో వసంతకాలం లాంటి యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ, ఆమె ముస్లిం ప్రియుడు, భార్యను ఎంతో గాఢంగా ప్రేమించే భర్త ఈ చిత్రంలోని ముఖ్యపాత్రలు. చేపల వేటకని సముద్రంలో వెళ్లిన భర్తకు భార్య ద్రోహం తలపెడితే ఆ భర్త తిరిగి రాడని ఆ పల్లెటూరి వాళ్ల నమ్మకం. కాని చివరకు జరిగింది అదే.

చెమ్మీన్

చెమ్మీన్ సినిమా పోస్టర్
దర్శకత్వం Ramu Kariat
నిర్మాత Babu Ismail Sait (Chemmeen Babu)
స్క్రీన్ ప్లే S. L. Puram Sadanandan
ఆధారం Chemmeen 
by Thakazhi Sivasankara Pillai
తారాగణం Sheela
Madhu
Kottarakkara Sreedharan Nair
Sathyan
సంగీతం Salil Chowdhury
సినిమెటోగ్రఫీ మార్కస్ బార్ట్లే, యు.రాజగోపాల్
కూర్పు Hrishikesh Mukherjee,
Hariprasad.M
స్టుడియో Kanmani Films
విడుదలైన తేదీలు 1965 ఆగస్టు 19 (1965-08-19)
దేశము India
భాష మలయాళం

ఈ సినిమా 13వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికయ్యింది. ఈ పురస్కారం క్రింద నిర్మాతకు స్వర్ణపతకం, 20,000 రూపాయల నగదు దర్శకునికి 5000 రూపాయల నగదు బహూకరించారు.

మూలాలు మార్చు

  1. అరందై, నారాయణన్ (1 March 1971). "మలయాళ చిత్రకథలు - ఒక పరిశీలన". విజయచిత్ర. 5 (9): 18.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=చెమ్మీన్&oldid=3831840" నుండి వెలికితీశారు