చేదు కలబంద అనేది ఏక కాండం కలిగిన కలబంద రకాల్లో ఒకటి. దీన్ని శాస్త్రీయ నామం ఆలో ఫెరాక్స్ (Aloe Ferox), ఆంగ్ల నామం బిట్టర్ ఆలో (Bitter Aloe), ఆఫ్రికన్ ఆలో (African Aloe), టేప్ ఆలో (Tap Aloe), కేప్ ఆలో (Cape Aloe) వంటి పేర్లతో పిలుస్తారు. కలబంద రకాల్లోనే అత్యంత చేదైన జెల్ ని కలిగియిండే ఈ రకపు కలబందను చేదు కలబంద అని పిలువడం కద్దు. దక్షిణ ఆఫ్రికాలో వెస్ట్రన్ కేప్, ఈస్ట్రన్ కేప్, ఫ్రీ స్టేట్, లెసోతో వంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ రకం కనిపిస్తుంది.

చేదు కలబంద
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
A. ferox
Binomial name
Aloe ferox

ఆకారం మార్చు

చేదు కలబంద సాధారణంగా 10 నుండి 15 అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. ఆకులు చాలా దలసరిగా, పొడవుగా కలిగియుండి, ఎరుపు లేక ఆరెంజ రంగు పూల గుత్తులు అనేక కొమ్మలతో ఉంటుంది. ఆకులకు ఇరువైపులా , పైభాగం, క్రిందభాగం ఎర్రటి ముళ్ళతో నిండియుంటుంది. పెరిగే ప్రదేశాన్ని బట్టి ఆకుల ఆకారంలో స్వల్ప మార్పులుండవచ్చు. తేనెటీగలను, తుమ్మెదలను ఆకర్షించే చేదు కలబంద పుష్పాలు మే నుండి సెప్టెంబరు నెల వరకూ పూస్తాయి. పువ్వులు వాడిపోయిన తర్వాత కాయలు వస్తాయి. పక్వానికొచ్చిన కాయలు పగిలిపోగానే అందులోంచి విత్తనాలు క్రింద పడి వర్షాకాలంలో మొలకెత్తుతాయి.

ఆకు వివరణ మార్చు

చేదు కలబంద ఆకుకి రెండు విధాలైన ద్రవాలుంటాయి, చేదు రుచి ఉండే పసుపు రంగు ద్రవం (Yellowish bitter sap), తెలుపు రంగు ద్రవం (White Gel). పసుపు రంగు ద్రవం ఆకుపచ్చని పొర క్రింద ఉంటుంది. ఆకుని కోసినప్పుడు ఇది బయటకొస్తుంది. దీన్నిఉడకబెట్టినప్పుడు గట్టిపడి ముక్కలవుతుంది. ఇవి ఉదర సమస్యలకు ఉపయోగ పడతాయి. ఇక చేదుగా లేని తెల్లటి ద్రవం హెల్త్ డ్రింకులు తయారుచేయానికి, స్కిన్ కేర్ ఉత్పత్తులు తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.

సాగు మార్చు

చేదు కలబంద సాధారణంగా తోటల్లో పెంచరు. అడవుల్లోనే వాటినుండి ఆకులను సేకరిస్తారు. ఒక్కొక్క మొక్కనుండి 4 నుండి 8 ముదురు ఆకులను కోసి సేకరిస్తారు. అవి పెరిగే ప్రదేశంలోనే ఒక మీటరు వెడల్పు గల గుంటను తవ్వి, దాని పై ప్లాస్టిక్ షీట్ వేస్తారు. సుమారు 200 నుండి 300 ఆకులను (కోసిన భాగం గుంటవైపు ఉండేటట్లు) గుంట చుట్టూరా పేరుస్తారు. కొన్ని గంటల తర్వాత ఆకుల్లో ఉన్న పసుపు పచ్చని ద్రవం అంతా గుంటలోకి చేరుకుంటుంది. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఈ ద్రవాన్ని దాదాపు సగం ఇగిరిపోయే వరకూ ఉడకబెట్టి గట్టి ముద్దలా చేస్తారు. తర్వాత ఆ ముద్దను చల్లార్చి ముక్కలు ముక్కలుగా చేసి ప్యాక్ చేస్తారు. మిగిలిన ఆకులను యంత్రాలతో ప్రాసెస్ చేసి కాస్మొటెక్స్, డ్రింకులు తయారుచేస్తారు.

ఔషధ గుణాలు మార్చు

 
Aloe ferox on the R61 route between Cofimvaba and Ngcobo.

ఆలో వెరా కి ప్రత్యామ్నయంగా చేదు కలబంద అని చెప్పవచ్చు [1]. దీన్ని దక్షిణ ఆఫ్రికా సంప్రదాయ వైద్యంలో వాడతారు. చేదు కలబంద ఉత్పత్తులు అల్సర్స్, కేన్సర్, మూత్ర సమస్యలు, వేగినైటిస్, కామెర్లు, బి.పి, ఫిస్టులా, రక్తహీనత, గొంతు సమస్యలు, టాన్సిల్, చుండ్రు, జుట్టు రాలుట, ప్రోస్ట్రేట్, బ్రాంకైటిస్, మలబద్దకం, చర్మ వ్యాధులు వంటి సమస్యలకు ఉపయోగపడతాయి.

పొలికలు మార్చు

  • ఆలో వెరా తో పోలిస్తే చేదు కలబందలో రెండు రెట్లు అమినో యాసిడ్ల శాతం ఉన్నాయి.
  • ఆలో వెరా తో పోలిస్తే చేదు కలబంద జెల్ చిక్కగా ఉంటుంది.
  • చేదు కలబంద జెల్ ప్రాసెస్ చేసిన తర్వాత కూడా రంగు కోల్పోకుండా ఉంటుంది. అందువలన చేదు కలబంద జెల్ లో ప్రిజర్వేటివ్స్ కలపాల్సిన అవసరం లేదు. ఆలో వెరా జెల్ అయితే రంగు కోల్పోతుంది.

మార్కెట్ మార్చు

చేదు కలబంద ఉత్పత్తులు దక్షిణ ఆఫ్రికా, ఐరోపా దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీనికి ప్రధాన కారణం సాధారణ కలబందతో పోలిస్తే చేదు కలబందలో యాంత్రోక్వినైంస్ తక్కువగా ఉండటం, ఆసియా మార్కెట్ అంతటా ఆలో వెరా మార్కెట్ డామినేట్ చేయడం.

మూలాలు మార్చు

  1. Ayurvedic interpretation of medicinal uses of Aloe ferox on the basis of Comparative study of Aloe ferox with Kumari (Aloe vera) - Dr. Mrs. Sharduli Rajiv Terwadkar, Prof.Dr.P.H.Kulkarni

లంకెలు మార్చు