జంతర్ మంతర్ (ఢిల్లీ)

ఖగోళశాల
(జంతర్ మంతర్, ఢిల్లీ నుండి దారిమార్పు చెందింది)

జంతర్ మంతర్ ఢిల్లీలోని ఒక ఖగోళ వేధశాల.

ఢిల్లీలోని జంతర్ మంతర్.

చరిత్ర మార్చు

13 రకాలైన ఖగోళ పరికారాలు ఉన్న మరో జంతర్‌ మంతర్‌ దేశరాజధాని ఢిల్లీలో ఉంది. ఈ వేదశాలను కూడా జైపూర్‌ మహారాజు మహారాజా జైసింగ్‌-2 నిర్మించాడు. ఇది జైపూర్‌లో ఉన్న జంతర్‌ మంతర్‌ వేదశాల నిర్మాణానికి నాలుగేళ్ళ ముందే ఈ జంతర్‌ మంతర్‌ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. క్యాలెండర్‌, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వివిధ రకాల గణాంకాల కోసం మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా సూచనల మహారాజా జైసింగ్‌ ఈ జంతర్‌ మంతర్‌ను నిర్మించాడు. ఖగోళ గణాంకాలు ప్రధాన అవసరంగా ఈ అబ్జర్వేటరీని నిర్మించారు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల గతులను ఈ అబ్జర్వేటరీ ద్వారా లెక్కగట్టవచ్చు. ఈ వేదశాలలో సామ్రాట్‌, రామ్‌, జైప్రకాష్‌, మిశ్ర యంత్రాలు ముఖ్యమైనవి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు