జన్మభూమి ఎక్స్‌ప్రెస్

జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) భారతీయ రైల్వేలులో ఇంటర్ సిటీ రైలు సేవలందిస్తూ, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇది మొదటి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం, విజయవాడ జంక్షన్ మధ్య పరిచయం చేశారు. ఇది తరువాత తెనాలి వరకు పొడిగించబడింది. ఆతరువాత నాగార్జున సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ - తెనాలి - సికింద్రాబాద్) రైలు రద్దు చేయబడింది. అందువలన విశాఖపట్నం - సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (వయా తెనాలి) అని వ్యక్తం చేసారు. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రయాణిస్తుంది, ఒక ఎక్స్‌ప్రెస్ రైలు సేవలందిస్తుంది. రైలు 59 కి.మీ./గం. సగటు వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాదు నుండి విజయవాడ వరకు ఒక భారతీయ లోకోమోటివ్ డబ్ల్యుడిఎం ఇంజను ఉపయోగిస్తుంది. అయితే ఆ తదుపరి విశాఖపట్నం వరకు అప్పుడు ఒక డబ్ల్యుడిపి4 లేదా ఒక డబ్ల్యుడిఎం3ఎ ఇంజను మార్పుతో ప్రయాణిస్తుంది. ఇది భారతీయ రైల్వేలు వర్గీకరణ జాబితాలో ఒక సూపర్‌ఫాస్ట్ రైలుగా వర్గీకరించబడింది.

జన్మభూమి ఎక్స్‌ప్రెస్
మౌలా-అలీ వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్టు
స్థానికతఆంధ్రప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుఈస్టు కోస్టు రైల్వే
మార్గం
మొదలుసికింద్రాబాదు
ఆగే స్టేషనులు17
గమ్యంవిశాఖపట్నం
ప్రయాణ దూరం699 km (434 mi)
సగటు ప్రయాణ సమయం12 గంటలు 30 నిమిషాలు
రైలు నడిచే విధంప్రతీరోజూ
రైలు సంఖ్య(లు)12806 / 12805
సదుపాయాలు
శ్రేణులు2nd Seating, AC Chair Car, General Class
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుNo
ఆహార సదుపాయాలుOn-board Catering
సాంకేతికత
వేగం55 km/h (34 mph) average
మార్గపటం
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మార్గ పటము

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో 24 కోచ్‌లు ఉన్నాయి. వీటిలో 10 సాధారణం కోచ్‌లు, మిగిలినవి రిజర్వుడు రెండవ తరగతి, 3 ఎసి కుర్చీ కారు ఉన్నాయి.

రైలు సమయ పట్టిక మార్చు

క్ర.సంఖ్య స్టేషన్ పేరు (కోడ్) చేరు సమయం బయలుదేరు

సమయం

అపే వ్యవధి ప్రయాణించిన దూరం రోజు మార్గం
1 సికింద్రాబాద్ జంక్షన్ (SC) ప్రారంభం 07:10 0 0 కి.మీ 1 1
2 రామన్నపేట  (RMNP) 08:19 08:20 1 నిమిషం 76 కి.మీ 1 1
3 నల్గొండ (NLDA) 08:53 08:54 1 నిమిషం 110 కి.మీ 1 1
4 మిర్యాలగూడ (MRGA) 09:20 09:21 1 నిమిషం 148 కి.మీ 1 1
5 నడికోడ్ (NDKD) 10:00 10:01 1 నిమిషం 186 కి.మీ 1 1
6 పిడుగురాళ్ల  (PGRL) 10:20 10:21 1 నిమిషం 208 కి.మీ 1 1
7 సత్తెనపల్లె (SAP) 10:50 10:51 1 నిమిషం 239 కి.మీ 1 1
8 గుంటూరు జంక్షన్ (GNT) 11:50 11:55 5 నిమిషాలు 282 కి.మీ 1 1
9 తెనాలి జంక్షన్ (TEL) 12:30 13:00 30 నిమిషాలు 307 కి.మీ 1 1
10 విజయవాడ జంక్షన్ (BZA) 13:30 13:40 10 నిమిషాలు 339 కి.మీ 1 1
11 ఏలూరు (EE) 14:27 14:28 1 నిమిషం 398 కి.మీ 1 1
12 తాడేపల్లిగూడెం (TDD) 14:59 15:00 1 నిమిషం 446 కి.మీు 1 1
13 రాజమండ్రి (RJY) 15:53 15:55 2 నిమిషాలు 488 కి.మీ 1 1
14 సామర్లకోట జంక్షన్ (slo) 16:33 16:34 1 నిమిషం 538 కి.మీ 1 1
15 అన్నవరం (ANV) 16:59 17:00 1 నిమిషం 575 కి.మీ 1 1
16 తుని (TUN) 17:14 17:15 1 నిమిషం 592 కి.మీ 1 1
17 అనకాపల్లి (AKP) 18:19 18:20 1 నిమిషం 655 కి.మీ 1 1
18 దువ్వాడ (DVD) 18:59 19:00 1 నిమిషం 671 కి.మీ 1 1
19 విశాఖపట్నం (VSKP) 19:40 గమ్యస్థానం 0 689 కి.మీ 1 1

కోచ్ల కూర్పు మార్చు

12805 సంఖ్యతో విశాఖపట్నం నుండి సికింద్రాబాదు పోవు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ యొక్క కోచ్‌ల కూర్పు ఈ క్రింది విధంగా ఉంటుంది. ఈ రైలుకు 24 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -

విశాఖపట్నం నుండి సికింద్రాబాదు, సికింద్రాబాదు నుండి విశాఖపట్నం నడిచే ఈ రైలులో కోచ్ ల అమరిక ఈ విధంగా ఉంటుంది. డి-.ఎల్.ఆర్ (2), జనరల్ (3), పి.సి (1), రిజర్వేషన్ బోగీలు (18) ఉంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR సాధారణ సాధారణ సాధారణ సాధారణ సాధారణ డి-11 డి-10 డి-9 డి-8 డి-7 డి-6 డి-5 డి-4 డి-3 డి-2 డి-1 సి-3 సి-2 సి-1 సాధారణ సాధారణ సాధారణ SLR  
 
Landscape view at Guntur from Janmabhoomi Express

గణాంకాలు మార్చు

ఈ రైలు ఒక రోజు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌గా ఉంది. దీనిలో రిజర్వు చేసే సెకండ్ సీటింగ్, కుర్చీ కారు ఏకైక సౌకర్యం ఉంది. ఈ రైలు కోసం ఏ పాంట్రీ కారు లేదు. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, విజయవాడ (అవసరమైతే ఇంజన్లు మారతాయి, అతిపెద్ద విరామం: 15 నిమిషాలు), ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ ద్వారా వెళుతుంది. సికింద్రాబాద్ వద్ద ప్రారంభ సమయం 7.10 గంటలకు బయలుదేరి విశాఖపట్నం రాక 7.40 గంటలకు చేరి రైలు తెనాలి వద్ద వ్యతిరేక దిశలో వస్తుంది.

ఇతర మార్గములు మార్చు

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఒక ప్రముఖ రైలుగా పరిగణించ వచ్చును కానీ చాలా రద్దీగా (బిజీగా) ఉంటుంది. ప్రత్యామ్నాయాలు గోదావరి ఎక్స్‌ప్రెస్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం వద్ద ఆగుతుంది. కానీ సాధారణంగా కోణార్క్ యొక్క సాధారణ మార్గాన్ని అనుసరిస్తుంది ఇది ముంబై నుండి భువనేశ్వర్ వరకు దీని ప్రయాణం ఉంది) ఉన్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ మారుగా విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వంటిది ఒక ఎంపిక కూడా ఉంది. దురంతో వేగంగా ఉంది కానీ పూర్తి వసతి లేదు; గరీబ్ రథ్ నిదానంగా ఉంటుంది కానీ పూర్తి వసతి ఉంది.

సంఘటనలు మార్చు

  • 2013 అక్టోబరు 2 : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ వెనకున్న భోగీలో ఈ సంఘటన జరిగింది. దీంతో బెల్లంకొండ-సత్తెనపల్లి మధ్య జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను నిలిపేశారు.[1]
  • 2014 మే 9 : విశాఖపట్నం నుంచి హైదరాబాదు బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆ ఎక్స్ ప్రెస్ రైలు దువ్వాడ సమీపంలో రాగానే బోగీలను వదిలి ఇంజిన్ ముందుకు సాగింది. ఆ విషయాన్ని వెంటనే గమనించి ఇంజిన్ డ్రైవర్ అప్రమత్తమైయ్యాడు.[2]
  • 2015 జూలై 26 : జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో బాలలను అక్రమంగా తరలిస్తున్నట్లు బాలల హక్కు సంఘానికి సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైలు రాగానే 74 మంది బాలలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 14-18 సంవత్సరాల లోపు ఉన్నవారే.[3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో మంటలు[permanent dead link]
  2. బోగీలను వదిలేసిన 'జన్మభూమి' [permanent dead link]
  3. "ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది." Archived from the original on 2015-11-30. Retrieved 2016-05-27.

ఇతర లింకులు మార్చు