జాండ్రపేట

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా గ్రామం
  ?జాండ్రపేట
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 15°48′16″N 80°20′53″E / 15.804477°N 80.34811°E / 15.804477; 80.34811
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం చీరాల
జిల్లా (లు) ప్రకాశం
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
12,789 (2001 నాటికి)
• 6754
• 6143
• 66.72
• 76.02
• 57.41


జాండ్రపేట ప్రకాశం జిల్లా చీరాల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం వినాయకచవితి వేడుకకు ప్రసిద్ధి. జాండ్రపేట రైల్వే స్టేషను చెన్నై కోల్కతా రైలు మార్గంలో ఉంది. జాండ్రపేట చేనేతకు ప్రసిద్ధి.జాండ్రపేటలో దేవాంగ కులమునకు చెందిన వారు మిక్కిలిగా నివాసం వుంటారు.దేవాంగ అను వారు ఈ చేనేత పనిని నమ్ముకుని జీవించువారు, అనగా వీరి చేతి వృత్తి చేనేత.జాండ్రపేట మిగిలిన అన్ని పన్నెండు పేటలలో కుడా గొప్పదిగా చెప్పబడుచున్నది.ఆ పన్నెండు పేటలు వరుసగా,పటం

ఊరి ప్రముఖులు మార్చు

  • ఈ గ్రామానికి చెందిన సజ్జా కోటేశ్వరరావు M.B.B.S., M.S., M.C.H., చదివారు. హైదరాబాద్లో స్టార్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వీరి తల్లిదండ్రులు కౌసల్య, వీరయ్య నేతకార్మికులు. వీరు 1917 లో స్థాపించబడిన అమెరికన్ అసోసియేషన్ ఫర్ థొరాటిక్ సర్జరీలో సభ్యులు. మన దేశం నుండి దీనిలో సభ్యతం పొందిన నలుగురిలో వీరొక్కరే ఆంధ్రప్రదేశ్ నుండి సభ్యులు. ఇంతవరకూ పదివేలవరకూ గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేశారు.
  • చీరాల- ఒంగోలు ప్రధాన రహదారిపై ఉన్న ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం చూస్తే ఉద్యానవనం లాగా ఉంటుంది. దీని చుట్టూ పచ్చదనం కుప్ప పోసినట్లు మొక్కలు పెంచారు. ఆవరణ అంతా గడ్డి పెంచారు. అంతే కాదు. ఈ పంచాయతీ కార్యాలయంలో అన్ని రకాల ధ్రువీకరణపత్రాలూ కంప్యూటర్ ద్వారానే అందజేయుచున్నారు. ప్రాంగణంలోనే గ్రంథాలయం ఉంది. అందుకే పనులకోసం వచ్చేవారికేగాక ప్రజలందరికీ ఈ కార్యాలయం దగ్గరయినది.జిల్లా స్థాయిలో నాలుగు సార్లు ఈ గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎన్నికైంది.

ఊరి ప్రధాన ప్రదేశాలు మార్చు

1.పందిళ్ళపల్లి, 2.రామన్నపేట,3.రావూరిపేట, 4.వేటపాలెం, 5.ఆనుమల్లిపేట, 6.రామానగర్,7.దేశాయిపేట,8.దంతంపేట, 9.ఆమోదగిరి పట్నం,10.నీలకంఠ వురం, 11.జాండ్రపేట, 12. హస్తినాపురం.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు