జీవా (తమిళ నటుడు)

(జీవా (నటుడు) నుండి దారిమార్పు చెందింది)

జీవా,  (జననం: 1984 జనవరి 4) ఇతను ప్రముఖ భారతీయ నటుడు. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. అతని అసలు పేరు అమర్ చౌదరి. అతని తండ్రి ఆర్.బి.చౌదరి సినీ నిర్మాత. 1996లో అతని తండ్రి  నిర్మించిన సినిమాల్లోనే బాలనటునిగా తన కెరీర్ ప్రారంభించాడు.

జీవా
జీవా
జననం
అమర్ చౌదరి

4 జనవరి 1984
వృత్తినటుడు
జీవిత భాగస్వామిసుప్రియ
తల్లిదండ్రులు
బంధువులుజితన్ రమేష్ (సోదరుడు)

జీవా 2003లో ఆసాయ్ ఆసాయి అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తరువాత అతను నటించిన రామ్ (2005) సినిమాకుగాను సిప్రస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు.[1] డిష్యుం (2006), ఇ (2006), కట్ట్రధు తమిజ్ (2007) వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.[2]

సినిమా జీవితం మార్చు

తొలినాళ్ళ కెరీర్: 2003–2009 మార్చు

జీవా తన తండ్రి నిర్మించిన సినిమాల్లో రెండు చిన్న పాత్రల్లో బాలనటునిగా నటించాడు.2003లో ఆసాయ్ ఆసాయి అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు.[3] ఆ తరువాత తితికుదే (2003), అమీర్ దర్శకత్వం వహించిన రామ్ (2005) వంటి సినిమాల్లో నటించాడు.[4][5] రామ్ సినిమా గోవాలో జరిగిన సిప్రస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడటమే కాక, ఉత్తమ నటుడు పురస్కారం అందుకోవడం విశేషం.

ఆ తరువాత జీవా డిష్యుం (2006) సినిమాలో నటించాడు.[4][6] అతను అదే ఏడాది మలయాళ సినీ రంగంలో కీర్తి చక్ర సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమానే తమిళ్ లో అరన్ పేరుతో డబ్ చేశాడు.[7] ఆ తరువాత ఇ సినిమాలో నటించాడ.2007లో కత్తరదు తమిజ్ సినిమాలో నటించాడు .[8][9] ఈ సినిమాలో ప్రభాకర్ పాత్రలో అతని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. 2007లో ఈ చిత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది.[10][8][9][11] ఈ సినిమా కోసం గెడ్డం పెంచుకుని, వేషం మార్చుకున్నాడు.

దాంతో అతనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ఇతనిని మానసికంగా చాలా కుంగదీసాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు .[12][13] ఈ పాత్రలో తను చాలా లీనమైపోయానని వివరించాడు.[13][14] ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది.[15]

2009 మార్చు

2009లో ఎం.రాజేష్ దర్శకత్వంలో శివ మనసుల శక్తి సినిమాలో నటించాడు. 2010లో కచేరీ అరంబం సింగం పులి చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు. 2011లో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో కో సినిమాలో నటించాడు ఈ సినిమాలోని అతని నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.[16][17] ఆ తరువాత అతను చేసిన రోవితరం, వందనం వెండరాన్ సినిమాలు విజయం సాధించాయి. కానీ విమర్శనాత్మకంగా మిశ్రమ ఫలితాలు లభించాయి.[18][19][20]

2012లో ఎస్.శంకర్ దర్శకత్వంలో నంబన్ అనే కామెడీ సినిమాలో నటించాడు. ఈ సినిమా అతి పెద్ద హిట్ అవడమే కాక, విమర్శనాత్మకంగా మంచి విజయం సాధించింది. జీవా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.[21] మిస్స్కిన్ దర్శకత్వంలో  ముగమూడి, గౌతమ్ మీనన్దర్శకత్వంలో నీతానే ఎన్ పొన్ వసంతం సినిమాల్లో నటించాడు.[22] ఆ తరువాత డేవిడ్, ఎంద్రెండ్రుం పున్నగై సినిమాల్లో కనిపించాడు. 2014లో అతను నటించిన యాన్ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తరువాత నటించిన పొక్కిరీ రాజా సినిమా తన 25వ చిత్రం. ఈ సినిమా విజయవంతం కాకపోవడమే కాక, విమర్శనాత్మకంగా కూడా పెద్ద అపజయంగా నిలిచింది. ప్రస్తుతం[ఎప్పుడు?] నయనతారతో కలసి తిరునాల్ సినిమాలో నటిస్తున్నాడు

ఇతర రంగాల్లో మార్చు

స్టార్ విజయ్ టీవీలోని జోడి నెంబర్ వన్ డాన్స్ కాంపిటేషన్ మూడో సీజన్ లో సంగీతా, ఐశ్వర్య రజనీకాంత్ లతో కలసి జీవా న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2011లో తన అన్న జితిన్ రమేష్ తో కలసి స్పైరల్ డ్రీమ్స్ అనే నిర్మాణ సంస్థ మొదలుపెడతామని ప్రకటించాడు. తన తండ్రిలాగా కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే నిర్మాణ సంస్థ పెట్టబోతున్నట్టు వివరించాడు.[23]

వ్యక్తిగత జీవితం మార్చు

సినీ నిర్మాత ఆర్.బి.చౌదరి, మహ్జాబీన్ లకు 1984 జనవరి 4, న తమిళనాడులోని చెన్నైలో జీవా జన్మించాడు.అతని అసలు పేరు అమర్. నలుగురు అన్నదమ్ముల్లో జీవా ఆఖరివాడు. వారి స్వంత బ్యానర్ సూపర్ గుడ్ ఫిలింస్ కు అతని పెద్ద అన్నయ్య బి.సురేష్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. రెండో అన్నయ్య జీవన్ స్టీల్ ఇండస్ట్రీలో వ్యాపారవేత్తగా ఉండగా, మూడో అన్నయ్య జితిన్ రమేష్ తమిళ సినీరంగంలో ఉన్నాడు.

2007 నవంబరు 21 న అతని ఢిల్లీకి చెందిన చిన్ననాటి స్నేహితురాలు సుప్రియను జీవా వివాహం చేసుకున్నాడు .[24] సుప్రియా ఎంబిఎ చదివి, ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. 1994లో టి నగర్ లో స్కూలులో చదువుకునేటప్పుడు వారిద్దరికీ మొదటి పరిచయం అయింది.[25] 2010లో ఈ జంటకు స్పర్శ్ అనే కొడుకు పుట్టాడు.[26]1998 నుంచి 2002 వరకు ఆర్. శేఖర్ వద్ద మంసురియా కుంగ్ ఫూ నేర్చుకున్నాడు.[27]

సినిమాలు మార్చు

చిత్రం సంవత్సరం పాత్ర దర్శకుడు నోట్స్ Ref
ఆసాయ్ ఆసాయి 2003 వినోద్ రవి మరియా [28]
తితికుదే 2003 చిన్ను (వేణు) బృందా సారథి [29]
రామ్ 2005 రామ కృష్ణ అమీర్ సుల్తాన్ [30]
డిష్యుమ్ 2006 భాస్కర్ శశి [31]
కీర్తి చక్ర 2006 హవిల్దర్ జైకుమార్ మేజర్ రవి మలయాళం సినిమా;
తమిళ్ లో అరన్
[32]
2006 ఈశ్వరన్ (ఇ) ఎస్.పి.జననాధన్ [33]
పోరి 2007 హరి సుబ్రమణియం శివ [34]
కత్తరదు తమిజ్ 2007 ప్రభాకర్ రామ్ [35]
రామేశ్వరమ్ 2007 జీవన్ ఎస్.సెల్వం [36]
తెనవట్టు 2008 కొట్టైసామి వి.వి.కాతిర్ [37]
శివ మనసుల శక్తి 2009 శివ ఎం.రాజేశ్ [38]
కచేరి అరంబమ్ 2010 పారి తిరైవన్నన్ [39]
బాస్ ఎంగిర భాస్కరన్ 2010 శివ రాజేశ్ అతిథి పాత్ర [40]
సింగం పులి 2011 అశోక్ కుమార్, శివ సాయి రమణి [41]
కో 2011 అశ్విన్ కుమార్ కె.వి.ఆనంద్ [42]
రోతిరమ్ 2011 శివ గోకుల్ [43]
వందాన్ వెండ్రాన్ 2011 అర్జున్ ఆర్.కణ్ణన్ [44]
నంబన్ 2012 సెవర్కోడి సెంథిల్ ఎస్.శంకర్ [45]
ముగమూడి 2012 ఆనంద్ (బ్రూస్లీ) మిస్స్కిన్ [46]
నీథానే ఎన్ పొంవసంతం 2012 వరుణ్ కృష్ణన్ గౌతమ్ మీనన్ [47]
ఎటో వెళ్ళిపోయింది మనసు 2012 రైలులో సహపాసింజర్ గౌతమ్ మీనన్ అతిథి పాత్ర (తెలుగు) [48]
డేవిడ్ 2013 డేవిడ్ బెజోయ్ నంబియార్ [49]
ఎంద్రెంద్రుం పున్నగై 2013 గౌతమ్ శ్రీధర్ ఐ.అహ్మద్ [50]
జిల్లా 2014 స్వంతపాత్ర ఆర్.టి.నీసన్ పాటు ఒన్ను పాటలో అతిథిపాత్ర [51]
యాన్ 2014 చంద్రశేఖర్ రవి.కె.చంద్రన్ [52]
సైజ్ జీరో 2015 స్వంతపాత్ర ప్రకాశ్ కోవెలమూడి అతిథిపాత్ర (తెలుగు) [53]
పొక్కిరి రాజా 2016 సంజీవి రామ్ ప్రకాశ్ రాయప్ప [54]
తిరునాళ్ 2016 బ్లేడ్ గణేశ్ రాంనాథ్ [55]
సంగిలి బుంగిలి కదవ తోరే 2016 ఇకె రాధ నిర్మాణానంతర పనుల్లో ఉంది [56]
కవలై వెండమ్ \ ఎంతవరకు ఈ ప్రేమ (తెలుగులో) 2016 డీకే [57]
కీ 2017 కాలేశ్ నిర్మాణంలో ఉంది
నెంజుముండు నెర్మైయుండు 2017 అరుణ్ కుమార్ కేవలం పేరు ప్రకటించారు

మూలాలు మార్చు

  1. "1st Cyprus International Film Festival −2006".
  2. "'I am being realistic in films'".
  3. "Interview with Jeeva" Archived 2010-02-22 at Archive.today. chennaionline.
  4. 4.0 4.1 "Jeeva: I risked my life for Dishyum".
  5. "Movie Review:Raam" Archived 2012-10-21 at the Wayback Machine.
  6. "Dishoom Tamil Movie Review".
  7. "Mohanlal disowns Aran".
  8. 8.0 8.1 "Kattradhu Tamil – A Kurinji flower in Indian cinema".
  9. 9.0 9.1 "Katrathu Thamizh review".
  10. "rediff.com: Jeeva, the best Tamil actor of 2007!"
  11. "rediff.com: The top Tamil heroes of 2007".
  12. "`A path breaking film`: Jeeva" Archived 2016-01-17 at the Wayback Machine.
  13. 13.0 13.1 "'I had to undergo therapy to come out of the character'".
  14. "'The whole film was too emotional for me'".
  15. "Friday fury on Nov:30!" Archived 2016-07-01 at the Wayback Machine
  16. "Review: Ko is a spicy ride – Rediff.com Movies".
  17. "Movie Review:Ko-Review" Archived 2012-10-21 at the Wayback Machine.
  18. "Vandhaan Vendraan Review – Tamil Movie Review by Rohit Ramachandran" Archived 2016-03-04 at the Wayback Machine.
  19. "Movie Review:Vandhan Vendraan" Archived 2012-10-22 at the Wayback Machine.
  20. "Vandhaan Vendraan Review".
  21. "A whole new look".
  22. "Jiiva's Mugamoodi starts from tomorrow" Archived 2013-05-24 at the Wayback Machine.
  23. Jeeva's Spiral Dreams – Tamil Movie News.
  24. Events – Jeeva – Supriya Wedding Reception.
  25. "Jeeva engages with Supriya" Archived 2014-01-06 at the Wayback Machine. www.filmibeat.com. 
  26. Jiiva-Supriya blessed with a baby boy Archived 2012-07-13 at Archive.today.
  27. "Jiiva: Mugamoodi is my first real action film".
  28. "The Hindu : Aasai Aasaiyai..."
  29. "The Hindu : A triangular love tale".
  30. "The Hindu : Waiting for a win".
  31. "With accent on a brave breed". The Hindu.
  32. "rediff.com: Meet Jeeva, Mohanlal's buddy in Keerthichakra".
  33. "Watch E for Jeeva".
  34. "On a commercial spree -- Pori". The Hindu.
  35. "Call this different?". The Hindu.
  36. "Rameswaram Movie Review". .behindwoods.com.
  37. "Thenavattu Review - Behindwoods.com - Actor Jeeva Actress Poonam Bajwa Direction V V Kathir Production ELK Productions Antony Music Srikanth Deva images tamil picture gallery images".
  38. "Amusing… and tepid too -- Siva Manasula Sakti". The Hindu.
  39. "Commercial cocktail -- Kacheri Aarambam". The Hindu.
  40. nikhil raghavan. "Jiiva all the way". The Hindu.
  41. "Review: Singam Puli works, most of the time". Rediff. 4 March 2011.
  42. RAGHAVAN S. "Almost picture perfect". The Hindu.
  43. Malathi Rangarajan. "Rowthiram - Action saga, but…". The Hindu.
  44. SUPRIYA KALIDOSS. "He conquers…". The Hindu.
  45. MALATHI RANGARAJAN. "Nanban: Celebrating friendship". The Hindu.
  46. Malathi Rangarajan. "Mugamoodi: Unmasked!". The Hindu.
  47. Karthik Subramanian. "Neethaane En Ponvasantham: An ode to Ilaiyaraaja". The Hindu.
  48. "'do Not Watch Nep With Too Much Expectations', Says Gautham - Neethane En Ponvasantham - Gautham Menon - Jiiva - Ilayaraja - Nani - Samantha - Tamil Movie News - Behindwoods.com".
  49. Subha j rao. "David: When the twain meet". The Hindu.
  50. Sudhish Kamath. "Endrendrum Punnagai: Needed more smiles, less drama". The Hindu.
  51. "Jiivas cameo in Jilla".
  52. Srinivasa Ramanujam. "Yearning for Yaan". The Hindu.
  53. "Jiiva does a cameo in Inji Iduppazhagi". The Times of India.
  54. Kaushik L M. "Jiiva Hansika starrer Pokkiri Raja nears the finish line". Behindwoods.
  55. "Jiiva Nayanthara Thirunaal movie to be released on January 14 2016 pongal day - Tamil Movie News".
  56. "Kamal Haasan's assistant, Ike to direct Jiiva!". Sify.com. Archived from the original on 2015-12-10. Retrieved 2016-05-14.
  57. Avinash Pandian. "Jiiva and team Kavalai Vendam crank a fun-filled photo shoot for the film". Behindwoods.