టీవీ9 - తెలుగు

(టీవీ9 నుండి దారిమార్పు చెందింది)

టీవి9 - తెలుగు భారతదేశంలోని ప్రముఖ న్యూస్ టెలివిజన్ సంస్థయైన (TV9) నెట్వర్క్ లో భాగం. అసోషియెటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కంపెనీ(ఏబిసిల్) 2004 జనవరిలో టి.వి.9 ని ప్రారంభించింది. 2018 ఆగస్టులో తొలి పెట్టుబడిదారుడైన శ్రీనిరాజు నుండి అలందా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఏబీసీఎల్ లో మెజారిటీ వాటా 90.45%ను కొనుగోలు చేసింది.[1] అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ TV9 తెలుగుతో పాటు ఇతర భారతీయభాషలలో టెలివిజన్ ఛానళ్లను నిర్వహిస్తుంది. గతంలో న్యూస్9 బెంగళూరు(ఆంగ్ల) ఛానల్ ను కూడా నిర్వహించేది.[2]

టీవీ9 - తెలుగు
దేశంభారతదేశం
ప్రసారపరిధిప్రపంచవ్యాప్తం '(ప్రధానంగా భారతదేశం)'
నెట్వర్క్టీవీ9
కేంద్రకార్యాలయంహైదరాబాదు
ప్రసారాంశాలు
భాష(లు)తెలుగు
యాజమాన్యం
యజమానిఅసోషియెటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కంపెనీ(ఏబిసిల్)
ప్రధాన వ్యక్తులుమేనేజింగ్ ఎడిటర్ : రజినీకాంత్ వెల్లలచెరువు
సోదరి ఛానళ్లుTV9 Bangla
TV9 Kannada
TV9 Gujarat
TV9 Marathi
TV9 Bharatvarsh
News9
లభ్యత
ఉపగ్రహం
Tata SkyChannel 1459
Airtel digital TVChannel 905
d2hchannel 722
Sun Directchannel 176
InDigitalchannel 749
Siti Networkschannel 53

ఈ ఛానల్ కు ఫౌండర్, ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న రవి ప్రకాష్ నేతృత్వం వహించాడు. 2018 లో సంస్థ యాజమాన్యం లో మార్పులు తర్వాత రవిప్రకాశ్ పై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన ఒక రోజు తర్వాత శుక్రవారం అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు రవిప్రకాశ్ ను వెంటనే పదవి నుంచి తొలగించింది.[3] రవిప్రకాష్ నిష్క్రమణ కు కొన్ని నెలల తరువాత, TV9 బృందం కొత్త CEO ను నియమించింది జీ మీడియా లిమిటెడ్ సీఈవోగా గతంలో పనిచేసిన బరున్ దాస్ టీవీ9లో బాధ్యతలు స్వీకరించారు. టీవీ 9 నెట్‌వర్క్ 64 కోట్ల వీక్లీ ఇంప్రెషన్స్‌తో భారతదేశంలో టెలివిజన్ న్యూస్ నెట్‌వర్క్ లో మొదటి స్థానము లో ఉన్నది[4] ప్రస్తుతం బోర్డు డైరెక్టర్లగా జె జగపతి రావు , ఎస్ సాంబశివరావు , ఎ శ్రీనివాస రావు , పి కౌశిక్ రావు , క్లిఫోర్డ్ పెరీరా , సింగా రావు గొట్టిపతి వున్నారు.

టీవీ9 వార్తల ప్రసారాలలో తాజా వార్తలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, పొలిటికల్ అనాలిసిస్, బిగ్ న్యూస్, బిగ్ డిబేట్, సామాజికాంశాలు, స్వీయ అనుభవాలు, ఆఫ్ బీట్ స్టోరీస్, వినోదం వార్తలు, డైలీ అప్‌డేట్స్, సినిమా గాసిప్స్, మూవీ రివ్యూస్ వుంటాయి

అవార్డులు మార్చు

2018 ENBA అవార్డులు మార్చు

ఉత్తమ వార్తలు కవరేజ్ జాతీయ - దక్షిణ ప్రాంతం-కన్నడ/మలయాళం/తెలుగు అమర్ నాథ్ యాత్ర నీడలో తుపాకీ


2017 మార్చు

RISE NGO

వెలిప్రేమ డాక్యుమెంటరీ

2016

యునిసెఫ్ అవార్డులు

పోషకాహార లోపంతో మృతి చెందిన గిరిజన చిన్నారులపై -రవికుమార్

2016

ఏపీ రాష్ట్ర నంది అవార్డులు

'గౌతమిపుత్ర శాతకర్ణి' కి ఉత్తమ టీవీ అవార్డు 2016, ఉత్తమ టీవీ డాక్యుమెంటరీ అవార్డు 2016

ఎన్.టి. అవార్డులు

11 అవార్డులు - టీవీ న్యూస్ యాంకర్ - బద్రి, వినోద వార్తల కార్యక్రమం - వినోదం - వినోదం- న్యూస్ డిబేట్ షో - న్యూస్ వాచ్, బిజినెస్ న్యూస్ యాంకర్ -స్వెట్చా, ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రామ్ - స్కూల్ ఫీజుపై స్టింగ్ ఆపరేషన్, కరెంట్ అఫైర్స్ స్పెషల్- మిషన్ భగీరథ, డైలీ న్యూస్ బులెటిన్ - 10PM న్యూస్, సెట్ డిజైన్ - ఎలక్షన్ 2014, న్యూస్ ఛానల్ ద్వారా గ్రాఫిక్స్ యొక్క ఉత్తమ వినియోగం - TV9 హోలోగ్రామ్, షో ప్యాకేజింగ్-TV9 హాట్ వీల్స్, TV న్యూస్ రిపోర్టర్ - అశోక్ కుమార్,

2015 ఏపీ రాష్ట్ర నంది అవార్డులు

2015 కు గాను బెస్ట్ టీవీ న్యూస్ రీడర్ అవార్డు ను ఆ ఛానల్ కు చెందిన దీప్తి వాజ్ పేయి దక్కించుకున్నారు

2013 జర్నలిజం లో రామ్ నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ అవార్డు

ఆయిల్ ఫీల్డ్స్ పై పర్యావరణ నివేదన - రిపోర్టర్ వెంకటపతిరాజు

2013 జివిఆర్ ఆరాధన, ప్రగతి మీడియా లింక్ అవార్డు

బెస్ట్ వాయిస్ ఓవర్ - కల్యాణి

2013 ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారములు

• ఎక్సలెన్స్ అవార్డు - డాక్టర్ మన్నం చంద్ర మౌళి

• సమీఖ్య భారతి గౌరవ్ సత్కర్ అవార్డు - TV9 రిపోర్టర్

2013 శ్రుతిలయ ఉగాది పురస్కరలు

ఉత్తమ పాత్రికేయుడు - డా.మన్నం చంద్ర మౌళి

2013 గ్రీన్ లీఫ్ అవార్డు

ఉత్తమ టీవీ కార్యక్రమం - చేతనా

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. IANS (2019-05-10). "TV9's new management sacks Ravi Prakash as CEO". Business Standard India. Retrieved 2020-08-31.
  2. "TV9". tv9.com. Archived from the original on 2020-08-11. Retrieved 2020-08-31.
  3. May 11, TNN / Updated:; 2019; Ist, 07:56. "TV9 CEO Ravi Prakash removed day after cheating charge jolt | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  4. "TV9 News Network is No. 1 in terms of viewership in India: Barun Das - Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.