డెస్మండ్ హేన్స్

1956, ఫిబ్రవరి 15న బార్బడస్లో జన్మించిన డెస్మండ్ హేన్స్ (Desmond Leo Haynes) వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అతడు 1991లో విజ్డెన్ క్రికెటర్ గా ఎన్నికయ్యడు.

డెస్మండ్ హేన్స్
డెస్మండ్ హేన్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డెస్మండ్ లియో హేన్స్
పుట్టిన తేదీ (1956-02-15) 1956 ఫిబ్రవరి 15 (వయసు 68)
సెయింట్ జేమ్స్, బార్బడాస్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm leg break
Right-arm medium
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 163)1978 మార్చి 3 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1994 ఏప్రిల్ 13 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 25)1978 ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1994 మార్చి 5 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1976–1995Barbados
1983Scotland
1989–1994Middlesex
1994–1997Western Province
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 116 238 376 419
చేసిన పరుగులు 7,487 8,648 26,030 15,651
బ్యాటింగు సగటు 42.29 41.27 45.90 42.07
100లు/50లు 18/39 17/57 61/138 28/110
అత్యుత్తమ స్కోరు 184 152* 255* 152*
వేసిన బంతులు 18 30 536 780
వికెట్లు 1 0 8 9
బౌలింగు సగటు 8.00 34.87 65.77
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/2 1/2 1/9
క్యాచ్‌లు/స్టంపింగులు 65/– 59/– 202/1 117/–
మూలం: Cricinfo, 2010 ఫిబ్రవరి 4

1980వ దశాబ్దంలో వెస్టీండీస్ తరఫున ఆడిన బ్యాట్స్‌మెన్‌లలో హేన్స్ ప్రముఖుడు. వెస్టండీస్ కు చెందిన మరో ఒపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన గార్డన్ గ్రెనిడ్గ్తో కల్సి టెస్ట్ క్రికెట్‌లో 16 సెంచరీ భాగస్వామ్యాలు నిర్మించాడు. ఇందులో 4 పాట్నర్‌షిప్ డబుల్ సెంచరీలు. హేన్స్ 116 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి టెస్ట్ క్రికెట్‌లో 42.29 సగటుతో 7487 పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 184 పరుగులు. దీనిని 1984లో ఇంగ్లాండుపై సాధించాడు. 1978లో భారత పర్యటనలో హ్యాండిల్ ది బాల్ ప్రకారం ఔటై ఈ విధంగా ఔటైన అతికొద్ది బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిల్చాడు.

వన్డే క్రికెట్‌లో కూడా హేన్స్ అనేక రికార్డులు సృష్టించిననూ కాలక్రమేణా ఆ రికార్డులు తదుపరి బ్యాత్స్‌మెన్‌లచే తిరగరాయబడ్డాయి. ఒక దశలో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు హేన్స్ పేరిటే ఉన్నాయి. అతడు 1979, 1983, 1987, 1992 ప్రపంచ కప్ క్రికెట్‌లలో 25 మ్యాచ్‌లు ఆడి 854 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, 3 అర్థ శతకాలు ఉన్నాయి.

1997లో క్రికెట్ నుంచి నిష్క్రమించిన పిదప హేన్స్ బార్బడస్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్టింగ్ చైర్మెన్‌గా, కార్ల్‌టన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా, వెస్ట్‌ఇండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. సెనేటర్ గాను, జాతీయ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మెన్ గాను విధులు నిర్వహించాడు. అతని ఆత్మకథ లియాన్ ఆఫ్ బార్బడస్ (Lion of Barbados)