1960, డిసెంబర్ 29న జన్మించిన డేవిడ్ బూన్ (David Boon) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980, 1990 దశకంలో ఆస్ట్రేలియా తరఫున 107 టెస్టులలో, 181 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో టాస్మేనియా తరఫున ఆడుతూ 1978-79లో జిల్లెట్ కప్‌లో టాస్మేనియా ఆశ్చర్యకరమైన విజయానికి దోహదపడ్డాడు.[1]

డేవిడ్ బూన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేవిడ్ క్లారెన్స్ బూన్
పుట్టిన తేదీ (1960-12-29) 1960 డిసెంబరు 29 (వయసు 63)
లాన్సెస్టన్, టాస్మానియా, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్ మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 325)1984 నవంబరు 23 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1996 జనవరి 29 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 80)1984 ఫిబ్రవరి 12 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1995 మార్చి 15 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1978–1999టాస్మానియా టైగర్స్
1997–1999Durham
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ అంతర్జాతీయ వన్డేలు దేశీవాళీ క్రికెట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 107 181 350 313
చేసిన పరుగులు 7,422 5,964 23,413 10,236
బ్యాటింగు సగటు 43.65 37.04 44.00 37.49
100లు/50లు 21/32 5/37 68/114 9/68
అత్యుత్తమ స్కోరు 200 122 227 172
వేసిన బంతులు 36 82 1,153 280
వికెట్లు 0 0 14 4
బౌలింగు సగటు 49.71 66.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగు 2/18 2/44
క్యాచ్‌లు/స్టంపింగులు 99/– 45/– 283/– 82/–
మూలం: క్రిక్ ఇన్ఫో, 2009 డిసెంబరు 9

టెస్ట్ క్రికెట్ గణాంకాలు మార్చు

డేవిడ్ బూన్ 107 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 43.65 సగటుతో 7422 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు, 32 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు సరిగ్గా 200 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు మార్చు

బూన్ 181 వన్డేలు ఆడి 37.04 సగటుతో 5946 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 122 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్ మార్చు

డేవిడ్ బూన్ ఆస్ట్రేలియా విజయం సాధించిన 1987 ప్రపంచ కప్‌లో తొలిసారిగా పాల్గొన్నాడు. భారత ఉపఖండంలో జరిగిన ఆ టోర్నమెంటులో 55.87 సగటుతో 447 పరుగులు సాధించాడు. లాహోర్లో జరిగిన సెమీఫైనల్‌లో పాకిస్తాన్ పై 65 పరుగులు సాధించాడు. కోల్‌కతలో జరిగిన ఫైనల్‌లో 75 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.[2] 1987 ప్రపంచకప్‌ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు డేవిడ్‌ బూన్‌. ఆస్ట్రేలియా విజయంలో డేవిడ్ బూన్దే కీలకపాత్ర. పాకిస్థాన్‌తో సెమీస్‌లో 65 పరుగులు చేసిన బూన్‌ ఫైనల్లో 75 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీలో అతను 8 మ్యాచ్‌ల్లో 447 పరుగులు చేశాడు

మూలాలు మార్చు

  1. Cricinfo: David Boon player profile.
  2. Wisden, 1988 edition: World Cup final Australia v England, match report.