తూర్పు కాపు / గాజుల కాపు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం.[1]

తుర్పు కాపు
వర్గీకరణఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా
మతాలుహిందూమతం
వాస్తవ రాష్ట్రంఆంధ్రప్రదేశ్,ఒడిశా,తెలంగాణ
జనాభా గల రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్,తెలంగాణ
జనాభా16 లక్షలు
Subdivisionsగాజుల కాపు
Reservation (Education)బి.సి-డి
Reservation (Employment)బి.సి-డి

చరిత్ర మార్చు

కాపు అనగా రైతు (Farmer) అని నిఘంటువులో అర్థం. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు ప్రాంతంలో నివసించే వ్యవసాయదారులు తూర్పుకాపులు. వీరు గతంలో సైన్యంలో పని చేయటం వలన కాపు అంటే రక్షకుడు (Protector) అని అర్థం కూడా ఉంది.నాయుడు అనేది తుర్పు కాపుల బిరుదు. చారిత్రకంగా గాజులు అమ్మేవారు గాజులకాపులు గా పిలవబడ్డారు.

విస్తరణ మార్చు

ఉత్తరాంధ్రలో అత్యధిక సంఖ్యాకులు తూర్పు కాపులే. వీరు చిన్న, సన్నకారు వ్యవసాయదారులు కావడం వలన కరువులు ఏర్పడిన సందర్భంలో ఉత్తరాంధ్ర ను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు గణనీయంగా వలసపోయారు. తూర్పుకాపులు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, తెలంగాణలో హైదరాబాద్, ఒడిస్సాలో గంజాం, గజపతి, రాయగడ జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.ప్రభుత్వ లెక్కల ప్రకారం తుర్పు కాపు జనాభా 16 లక్షలు మాత్రమే[2]

రిజర్వేషన్లు మార్చు

తూర్పు కాపు / గాజుల కాపు ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం.గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని తూర్పుకాపులకు మాత్రమే బిసి కుల సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తూర్పుకాపులను బిసిల జాబితాల్లో చేర్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఓబిసీ రిజర్వేషన్లు ఉత్తరాంధ్రలో తూర్పుకాపులకు మాత్రమే అర్హత కల్పించారు. ఇతర జిల్లాలలో ఉండే తూర్పుకాపులకు ఓబిసి అర్హతను 2014 నుండి తొలగించారు. రాష్ట్రంలో ఏ ఇతర ఓబీసీ కులానికి ఇలాంటి అన్యాయం జరగలేదు.[3]తూర్పుకాపులు తమ సామాజిక వెనుకబాటుతనం దృష్ట్యా బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి చేర్చమని ఉద్యమం చేస్తున్నారు.[4]

ప్రముఖులు మార్చు

సినీ నటులు మార్చు

క్రైస్తవ మత ప్రచారకులు మార్చు

కె.ఏ.పాల్ (కిలారి ఆనంద్ పాల్)

వ్యాపారవేత్త మార్చు

లోలుగు మదన్

రాజకీయాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Caste in Andhra". www.vepachedu.org. Retrieved 2020-09-25.
  2. Rao, K. Srinivasa (2022-12-28). "Turpu Kapu association demands BC-A status for community". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-30.
  3. "Turpu Kapus demand to be merged in OBC". thehansindia (in Indian English). 2019-12-04. ISSN 0971-751X. Retrieved 2021-06-16.
  4. "Turpu Kapus seek BC-A status". The Hindu (in Indian English). 2016-10-16. ISSN 0971-751X. Retrieved 2020-09-25.