క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన థేలీస్ (Thales) ను గ్రీకు తత్వశాస్త్ర పితామహుడిగా చెబుతారు. థేలీస్ క్రీ.పూ. 624 లో ఆసియా మైనర్ కోస్తాలోని (ప్రస్తుత టర్కీ) మైలీటస్ నగరంలో జన్మించి, క్రీ.పూ.546 లో చనిపోయినట్లు చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.పూ. 585 మే 28న సంభవించిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని థేలీస్ ముందుగానే లెక్కగట్టి జోస్యం చెప్పినట్లుగా తెలుస్తుంది.


థేలీస్
పేరు: Thales of Miletos (Θαλής ο Μιλήσιος)
జననం: ca. 624–625 BC
మరణం: ca. 547–546 BC
సిద్ధాంతం / సంప్రదాయం: Ionian Philosophy, Milesian school, Naturalism
ముఖ్య వ్యాపకాలు: Ethics, Metaphysics, గణితం, Astronomy
ప్రముఖ తత్వం: Water is the physis, Thales' theorem
ప్రభావితమైనవారు: పైథాగరస్, అనగ్జిమాండర్, అనగ్జిమెనెస్

థేల్స్ సిద్ధాంతం మార్చు

ప్రపంచానికి మూల పదార్థం నీరు. నీటినుండే ఈ సమస్త ప్రపంచం ఉద్భవించింది. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. కాబట్టి అయస్కాంతం సజీవ పదార్థం. నీరు ఆవిరి అవుతుంది, కాబట్టి నీరు సజీవ పదార్థం. ఆ విధంగా మొత్తం ప్రకృతి సజీవం. దానికి ఆత్మ ఉంది. ప్రకృతి అంతా దేవతామయం. '

ఇవి కూడా చూడండి మార్చు

ఎపిక్యూరియనిజం - ఎపిక్యురస్ ప్రతిపాదించిన సిద్ధాంతం

"https://te.wikipedia.org/w/index.php?title=థేలీస్&oldid=3005789" నుండి వెలికితీశారు