దక్షిణ ఢిల్లీ జిల్లా

ఢిల్లీ లోని జిల్లా

కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో దక్షిణఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా తూర్పు సరిహద్దులో యమునా నది, ఉత్తర సరిహద్దులో కొత్త ఢిల్లీ, ఆగ్నేయ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఫరీదాబాద్ జిల్లా, నైరుతీ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన గుర్‌గావ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో నైరుతి ఢిల్లీ ఉన్నాయి.

దక్షిణ ఢిల్లీ జిల్లా
ఢిల్లీ జిల్లాలు
దక్షిణ ఢిల్లీ జిల్లా is located in ఢిల్లీ
దక్షిణ ఢిల్లీ జిల్లా
దక్షిణ ఢిల్లీ జిల్లా
భారతదేశ పటంలో ఢిల్లీ
Coordinates: 28°33′18″N 77°11′31″E / 28.5549°N 77.1919°E / 28.5549; 77.1919
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
ప్రధానకార్యాలయంసాకేత్
Government
 • Bodyజిఎన్‌సిటి, ఢిల్లీ
 • లోక్‌సభ సభ్యుడురమేష్ బండారీ
Area
 • Total250 km2 (100 sq mi)
Elevation
241 మీ (791 అ.)
Population
 (2011)
 • Total27,31,929
 • Density11,000/km2 (28,000/sq mi)
భాషలు
 • అధికారహిందీ, ఆంగ్లం, పంజాబీ, ఉర్దూ
Time zoneUTC+5:30
దగ్గరి నగరంఫరీదాబాద్ , గుర్‌గావ్
లోక్‌సభ నియోజకవర్గంసౌత్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
స్థానిక స్వపరిపాలనసౌత్ ఢిల్లీ నగరపాలక సంస్థ

గణాంకాలు మార్చు

2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,258,367. జిల్లా వైశాల్యం 250 చ.కి.మీ. జనసాంధ్రత 9,034, జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది :సాకేత్, హౌజ్ ఖాస్, మెహ్రౌ.[1] డివిజన్ మ్యాప్ 11 విభాగాలుగా విభజించబడినప్పటికీ సాధారణంగా పౌరులు మాత్రం 5 విభాగాలుగా వ్యవహరిస్తున్నారు. తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, మధ్య ఢిల్లీ అంటారు.

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,733,752, [2]
ఇది దాదాపు. జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 1444వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 10935 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.59%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 859:1000, [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 87.03%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ప్రాముఖ్యం మార్చు

ఢిల్లీ నగరంలో దక్షిణ ఢిల్లీ విశాలమైనది అంతేకాక పలు ముఖ్య ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో విస్తారమైన చారిత్రక గుర్తింపు పొందింది. ఢిల్లీలోని 11 అతి ముఖ్యమైన చారిత్రాత్మక ప్రదేశాలలో 4 ( రాజ్ పితోరా, మెహ్రాయులి, సిరి ఫోర్ట్ (హజ్ ఖాస్ చేర్చి), తుగ్లకాబాద్ ) ప్రదేశాలు దక్షిణ ఢిల్లీలో ఉన్నాయి.

మద్యయుగం నుండి ఈ జిల్లా ముఖ్యత్వం కలిగి ఉంది. అయినా ప్రస్తుతం ఇది జనసమ్మర్ధం, నిర్లక్ష్యానికి గురైంది. వీటిలో ఖలుసరై, జై సరై, బెర్‌సరై, లాడోసరై, కత్వారియా సరై, యూసఫ్ సరై, హౌజ్‌ఖాస్ గ్రామం, మునిర్కా, కొత్ల ముదరక్‌పూర్ కాంప్లెక్స్, బెగుంపూర్, మొహమ్మద్‌పూర్, ఖిర్కి మసీదు, గోవింద్పురి, అధ్చిని, చత్తర్‌పూర్ గ్రామం, బదర్‌పూర్ (ఢిల్లీ), అయ్యా నగర్, మాండి గ్రామం, దెరా గ్రామం మొదలైనవి ఉన్నాయి.

చరిత్రాత్మక ప్రాముఖ్యతే కాక ఈ ప్రాంతానికి ఆర్థిక, విద్యా కేంద్రంగా ఉంది. నెహ్రూస్ ప్లేస్ అదియాలోని అతి పెద్ద కంప్యూటర్ మార్కెట్, ఐ.టి మార్కెట్‌గా గుర్తింపు కలిగి ఉంది. ది ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ది ఆల్ ఇండియా ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైంసెస్, ప్రీమియర్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్స్ దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఉన్నాయి. ది ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ఢిల్లీ దక్షిణ ఢిల్లీ కుతుబ్ ఇంస్టిట్యూషనల్ ప్రాంతంలో ఉన్నారు.

2009 గణాంకాలను అనుసరించి అడ్మినిస్ట్రేటివ్ ఢిల్లీలో 20% పచ్చదనం కలిగి ఉంటుంది. ఇందులో పలు గ్రీన్ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యంలు, బయోడైవర్శిటీ పార్కులు, గ్రీన్ పార్కులు ఉన్నాయి. డీర్ పార్క్, రోజ్ గార్డెన్ హౌజ్ ఖాస్‌లో ఉన్నాయి. అంతేకాక ఆరవిల్లీ పాదపర్వతాలలో వన్యప్రాణి అభయారణ్యం, ఢిల్లీ దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతం పచ్చదనం, కాంక్రీట్ కలిగిన మిశ్రిత ప్రాంతంగా గుర్తించబడుతుంది. నగరంలో మెహ్రుయిలి-గుర్‌గావ్ రోడ్, మెహ్రాయులి-బాదర్‌పూర్ రోడ్డు, శ్రీ అరబిందో మార్గ్, ఆగస్టు క్రాంతి మార్గ్, ప్రెస్ ఎంక్లేవ్ రోడ్, మొదలైన పలు ముఖ్యమైన రహదార్లు ఉన్నాయి. ఆర్టియల్ రోడ్డు (ఢిల్లీ), ఔటర్ రింగ్ రోడ్డు (ఢిల్లీ), జాతీయ రహదారి 2 జిల్లాను దాటి వెళతాయి.

జీవనశైలి మార్చు

దక్షిణ ఢిల్లీలో అత్యధికంగా సంపన్నులు నివసిస్తున్నారు. కొత్త ఢిల్లీ, మధ్య ఢిల్లీ మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. సంపన్నులు అత్యధికంగా నివసిస్తున్న ప్రదేశాలలో గ్రేటర్ కైలాష్, చిత్తరంజన్ పార్క్, అలకానంద, హౌజ్ ఖాస్, గ్రీన్ పార్క్, ఢిల్లీ ( గ్రీన్ పార్క్), డిఫెన్స్ కాలనీ, కల్కాజీ, న్యూ ఫ్రెండ్స్ కాలోనీ, జసొలా విహార్, గుల్మొహర్ పార్క్, గుల్మొహర్ భాగం, వసంత్ కుంజ్, ఢిల్లీల లుటియన్ యొక్క జోన్ బయట అత్యధిక భూమి ధరలు ఉంది. దక్షిణ ఢిల్లీలోని అర్బన్ గ్రామాలు, వంటి హౌజ్ ఖాస్, ( విలేజ్), ఫాపూర్, లాడో సారై, డిజైనర్ బొటిక్యూస్, రెస్టారెంట్లు, ఆర్ట్ గ్యాలరీలు, డిజైన్ స్టడీస్‌కు కేంద్రంగా ఉంది. [5][6] దక్షిణ ఢిల్లీలోసరోజిని నగర్, లజ్పత్ నగర్, సౌత్ ఎక్స్‌టెంషన్, కొత్త ముబారక్‌పూర్, గ్రేటర్ కైలాష్ మొదలైన ప్రబల మార్కెట్లు ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలో అంసల్ ప్లాజా, అంబియంస్, సాకేత్ డిస్ట్రిక్ సెంటర్, సెలెక్ట్ సిటీవాక్ మొదలైన మాల్స్ ఉన్నాయి.

ఇవి కూడా చూడండి మార్చు

సరిహద్దులు మార్చు

మూలాలు మార్చు

  1. Organisational Structure Archived 2013-07-25 at the Wayback Machine Official website.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nevada 2,700,551
  5. "Art edges out history in Delhi's ancient Lado Sarai village". The Times Of India. Apr 11, 2013. Archived from the original on 2013-06-24. Retrieved 16 June 2013.
  6. "Delhi's soho". Hindustan Times. June 15, 201. Archived from the original on 24 జూన్ 2013. Retrieved 16 June 2013.

వెలుపలి లింకులు మార్చు

వెలుపలి లింకులు మార్చు