దస్నాపూర్ (అదిలాబాదు)

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాదు మండలం లోని జనగణన పట్టణం

దస్నాపూర్,తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, ఆదిలాబాద్ నగరంలో ఒక ప్రాంతం, ఇది ఒక జనగణన పట్టణం, మావల మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[1] పిన్ కోడ్: 504001. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఆదిలాబాద్ పట్టణ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన మావల మండలం లోకి చేర్చారు.[2]

దస్నాపూర్
—  రెవిన్యూ గ్రామం  —
దస్నాపూర్ is located in తెలంగాణ
దస్నాపూర్
దస్నాపూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 19°39′23″N 78°31′39″E / 19.656316°N 78.527362°E / 19.656316; 78.527362
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్
మండలం మావల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 22,216
 - పురుషుల సంఖ్య 11,314
 - స్త్రీల సంఖ్య 10,902
పిన్ కోడ్ 504001
ఎస్.టి.డి కోడ్

గణాంక వివరాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం దస్నాపూర్ మొత్తం జనాభా 22216. వారిలో పురుషులు 11314, స్త్రీలు 10902. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 2404 మంది ఉన్నారు.ఇక్కడ స్థానిక భాష తెలుగు. వారిలో అక్షరాస్యులు 15914 మంది ఉన్నారు.[3]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం 19,962 జనాభా ఉంది. వీరిలో పురుషులు 49%, మహిళలు 51% ఉన్నారు. దస్నాపూర్ సగటు అక్షరాస్యతా రేటు 58%, జాతీయ సగటు 59.5% కంటే తక్కువ. పురుషుల అక్షరాస్యత 68%, స్త్రీ అక్షరాస్యత 48%. దస్నాపూర్ జనాభాలో 14% ఆరు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నారు.

సమీప ప్రాంతాలు మార్చు

టీచర్స్ కాలనీ, సంజయ్ నగర్ కాలనీ, చైతన్యపురి, ఖోజా కాలనీ, రిక్షా కాలనీ.

సమీప నగరాలు మార్చు

ఆదిలాబాద్, పందరకోడా, ఘటన్జీ, నిర్మల్ సమీపంలోని నగరాలు ఆదిలాబాద్.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. http://censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=642610