31°46′25″N 35°14′08″E / 31.77361°N 35.23556°E / 31.77361; 35.23556

ruins of city of david

దావీదు పట్టణం (City of David - עיר דוד) పాలస్తీనా అరబ్బు గ్రామం. ఇది జెరూసలెంలో ఉంది. ఇది యెరూషలేము పాత నగరపు దక్షిణ-తూర్పు భాగంలో ఉంది. అరబిక్‌లో దీన్ని వదీ హిల్వే అంటారు. ఇదొక పురాతత్త్వ స్థలం కూడా. కంచు, ఇనుప యుగాలకు చెందిన జెరూసలేం పట్టణం ఇదేనని భావిస్తున్నారు,

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం నేపథ్యంలో దావీదు పురం చాలా వివాదాస్పదమైంది. 1967 లో జరిగిన ఆరు రోజుల యుద్ధం తరువాత ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇది ఉంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇక్కడి ఇజ్రాయెల్ స్థావరాలను చట్టవిరుద్ధంగా అంతర్జాతీయ సమాజం పరిగణిస్తుంది. ఇజ్రాయెల్ దీనిని ఒప్పుకోకుండా వివాదం చేసింది.

పురావస్తుపరంగా ఇది మధ్య కాంస్య యుగానికి చెందిన కనానైట్ మౌలిక సదుపాయాలకూ, ఇనుప యుగ కాలంలో యూదా రాజులు నిర్మించిన కొత్త నిర్మాణాలకూ ప్రసిద్ధి చెందింది.

ఇజ్రాయెల్ జాతీయ ఉద్యానవనంగా ఏర్పాటైన దీని నిర్వహణను 1997 లో ఇర్ డేవిడ్ ఫౌండేషన్ స్వాధీనం చేసుకుంది. [1]

పేరు మార్చు

ఈ ప్రాంతాన్ని సిల్వాన్ గ్రామంలో భాగమైన వదీ హిల్వే అరబ్ ఆవాసంగా పిలుస్తారు. జెరూసలేం పాత నగరపు దక్షిణ నగర గోడల వరకు విస్తరించి ఉంది. నగర గోడలకు, వదీ హిల్వేకూ మధ్య ఉన్న భూభాగాన్ని కొన్నిసార్లు "ఒఫెల్" పేరుతో పిలుస్తారు. పురాతన ఓఫెల్ స్థలం కచ్చితంగా ఎక్కడ అనేది వివాదాస్పదం గానే ఉంది.

"దావీదు పురం" అనే పేరు బైబిల్ కథనంలో ఉద్భవించింది. ఇందులో రాజు డేవిడ్ ను ఇజ్రాయెలీ నాయకుడిగా వర్ణించింది. అతను జెబస్ నగరాన్ని జయించి దానికి తనపేరు పెట్టాడు. తరువాత, యూదు-రోమన్ చరిత్రకారుడు జోసెఫస్ ఈ పదాన్ని మళ్ళీ ప్రస్తావించాడు. ఈ ప్రత్యేక ప్రాంతానికి దావీదు పురం అనే పేరును తొలుత 1920 లో ప్రస్తావించారు. తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న తరువాత, 1970 ల నుండి అధికారికంగా ఉపయోగిస్తున్నారు. కానీ దానికి బైబిల్ తోనూ, రాజకీయ అర్థాలతోనూ ఉన్న సంబంధాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కొందరు ప్రశ్నిస్తున్నారు.[2]

ఆధునిక చరిత్ర మార్చు

 
1864-73[permanent dead link] మధ్య నిర్మించిన ఇల్లిస్ రిలీఫ్‌లో దావీదు పురం / వదీ హిల్వే (పై నుండి ఎడమ నుండి మధ్య వరకు) చూపబడింది. సిల్వాన్ ఇళ్లకు ఎదురుగా ఉన్న కొండపై కొన్ని చిన్న భవనాలు చూడవచ్చు.
 
డేవిడ్[permanent dead link] నగరాన్ని ఇజ్రాయెల్ "ఇన్నర్ సెటిల్మెంట్స్"గా చూపించే UN మ్యాప్. ఒక్కో ఎర్ర శిలువ ఒక్కో సెటిల్మెంటు.

సిల్వాన్ గ్రామాన్ని మినహాయించి, జెరూసలేం గోడలకు ఆనుకుని వెలుపల ఉన్న ప్రాంతం ఆధునిక చరిత్రలో చాలా వరకు అభివృద్ధి చెందలేదు. గోడల వెలుపల ఆధునిక కాలపు ఆవాసం 19 వ శతాబ్దం చివరిలో ప్రారంభమైంది. ఇల్లెస్ రిలీఫ్‌లో సిల్వాన్ ఇళ్లకు ఎదురుగా ఉన్న కొండపై 1864-73 మధ్య నిర్మించిన కొన్ని చిన్న భవనాలు కనిపిస్తాయి. 1873–1874లో ప్రముఖ యూదు మయూచాస్ కుటుంబ సభ్యుడు కొండ దిగువన ఉన్న ఇంటికి తరలి వెళ్లాడు. [3] 20 వ శతాబ్దం ప్రారంభంలో బారన్ డి రోత్స్‌చైల్డ్, అదే ప్రాంతంలో పురావస్తు తవ్వకం కోసం కొంత భూమిని సొంతం చేసుకున్నాడు. [4] మేయుచాస్ కుటుంబం 1930 లలో విడిచి వెళ్ళి పోయింది. ఈ కాలంలో ఇతర యూదు కుటుంబాలేవీ ఈ ప్రాంతంలో స్థిరపడినట్లు తెలియదు. [4]

1948 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తరువాత, ఈ ప్రాంతం మొత్తం గ్రీన్ లైన్ కు తూర్పు వైపున జోర్డాన్ నియంత్రణలో ఉన్న భాగంలో ఉండేది.

1967 తరువాత, ఇజ్రాయెల్ ఆవాసం మార్చు

అరబ్బు కుటుంబాలు శిఖరంపై నివసించడం, 1967 తరువాత అక్కడ ఇళ్ళు నిర్మించడం కొనసాగించాయి.

1968 నుండి 1977 వరకు ఇజ్రాయెల్ ఎక్స్ప్లోరేషన్ సొసైటీ బెంజమిన్ మజార్, ఐలాట్ మజార్ నేతృత్వంలో దావీదు పట్టణానికి ఉత్తరాన ఉన్న ఓఫెల్ వద్ద మొదటి తవ్వకాలను ప్రారంభించింది. [5]

2014 అక్టోబరు లో, ది జెవిష్ హోమ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, ఆ సమయంలో ఇజ్రాయెల్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మంత్రీ అయిన యురి ఏరియల్, తాను ఈ ప్రాంతంలో నివసించాలని భావిస్తున్నానని ప్రకటించి ఒక వివాదానికి కారణమయ్యాడు. [6]

ఎల్అద్ ఫౌండేషన్, ఈ ప్రాంతంలో గతంలో ఉండే గివాటి పార్కింగ్ స్థలంలో, "కెడెం కాంపౌండ్" వద్ద16,000 చ.మీ. నిర్మాణాన్ని తలపెట్టింది. దానికి 2014 ఏప్రిల్ లో ఆమోదం లభించింది. [7] 2016 అక్టోబరులో యునెస్కో ఈ ప్రాజెక్టును ఖండించింది. [8]

పురావస్తు పరిశోధనలపై రాజకీయ వివాదం మార్చు

దావీదు పట్టణ పురావస్తు, నివాస ప్రాంతాలను నియంత్రించే హక్కు గురించి ఇజ్రాయెల్, పాలస్తీనాలు తీవ్రంగా పోటీ పడ్డారు. [9] ఈ ప్రాంతాన్ని చాలావరకు పురావస్తు ఉద్యానవనంగా మార్చడానికి ప్రతిపాదన ఉంది, ప్రస్తుతం అరబ్బులు నివసించే కిడ్రోన్ లోయలో కొంత భాగాన్ని కింగ్స్ గార్డెన్ అని పిలిచే ఒక పార్కుగా మార్చాలని ప్రతిపాదన ఉంది. [10]

సైట్ వద్ద ఇజ్రాయెల్ పురావస్తు పరిశోధనలపై విమర్శలు వచ్చాయి. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రఫీ గ్రీన్బెర్గ్ ఈ ప్రదేశంలో పురావస్తు కార్యకలాపాలు "రాజకీయ, కార్పొరేట్ ప్రేరణలకు పూర్తిగా లోబడి ఉన్నాయి. అయితే, "తటస్థులు" దాన్ని పెద్దగా గుర్తించలేదు. అంచేత ఇక్కడ సాధించిన ఫలితాలు సందేహాస్పదంగా ఉండవచు. చరిత్రను నిర్భీతిగా వక్రీకరించే అవకాశం ఉంది". [11]

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు మార్చు

  1. Wendy Pullan; Maximilian Sternberg; Lefkos Kyriacou; Craig Larkin; Michael Dumper (20 November 2013). "David's City in Palestinian Silwan". The Struggle for Jerusalem's Holy Places. Routledge. pp. 76–77. ISBN 978-1-317-97556-4. However, right into the early twentieth century only the Virgin's Fount (Ain Umm el-Daraj) and the Waters of Siloam (Ain Silwan) had any known historic or religious significance and the area had virtually no specific meaning for Judaism or local Jewish religious practice. In 1920, a French archaeologist first suggested renaming Wadi Hilweh 'La Cité de David', explicitly privileging this specific, speculative biblical tie as the narrative leitmotif of the successive excavations, which have revealed extremely varied findings, both in type and chronological attributions. It was only in the 1970s, when a major Israeli excavation project was conducted there, that 'David's City' became the official Israeli designation, initially having no particular religious connotation; today, the term itself is increasingly questioned in the archaeological academic community. Since El'Ad took over the management of the park in 1997, 'David's City' has essentially become a religious-nationalist battle cry that has transformed the area from an ordinary Palestinian neighbourhood with a few excavation pits, largely unknown to the Israeli public, into a religious settlement and major national biblical monument with hundreds of thousands of visitors a year and an official education site for Israeli school children and soldiers.
  2. Wendy Pullan; Maximilian Sternberg; Lefkos Kyriacou; Craig Larkin; Michael Dumper (20 November 2013). "David's City in Palestinian Silwan". The Struggle for Jerusalem's Holy Places. Routledge. pp. 76–77. ISBN 978-1-317-97556-4. However, right into the early twentieth century only the Virgin's Fount (Ain Umm el-Daraj) and the Waters of Siloam (Ain Silwan) had any known historic or religious significance and the area had virtually no specific meaning for Judaism or local Jewish religious practice. In 1920, a French archaeologist first suggested renaming Wadi Hilweh 'La Cité de David', explicitly privileging this specific, speculative biblical tie as the narrative leitmotif of the successive excavations, which have revealed extremely varied findings, both in type and chronological attributions. It was only in the 1970s, when a major Israeli excavation project was conducted there, that 'David's City' became the official Israeli designation, initially having no particular religious connotation; today, the term itself is increasingly questioned in the archaeological academic community. Since El'Ad took over the management of the park in 1997, 'David's City' has essentially become a religious-nationalist battle cry that has transformed the area from an ordinary Palestinian neighbourhood with a few excavation pits, largely unknown to the Israeli public, into a religious settlement and major national biblical monument with hundreds of thousands of visitors a year and an official education site for Israeli school children and soldiers.
  3. Yemin Moshe: The Story of a Jerusalem Neighborhood, Eliezer David Jaffe, Praeger, 1988, p. 51
  4. 4.0 4.1 Meron Rapoport, 2009, Ir Amin: "At the beginning of the 20th century, Baron de Rothschild acquired land on the eastern slopes of the Wadi Hilweh hill with the intention of dedicating it to archaeological excavations... As far as we know, during this period, only a single Jewish family lived in Wadi Hilweh itself, in a house known today as the "Meyuhas house," and left during the 1930s."
  5. Excavations on the South of the Temple Mount. The Ophel of Biblical Jerusalem, Qedem. Monographs of the Institute of Archaeology, The Hebrew University of Jerusalem, No. 29, 1989 ISSN 0333-5844
  6. Housing Minister Uri Ariel May Move to City of David, 25 October 2014.
  7. Sixty-ninth session of the United Nations General Assembly, Israeli settlements in the Occupied Palestinian Territory, including East Jerusalem, and the occupied Syrian Golan: Report by the Secretary-General Archived 2018-11-04 at the Wayback Machine, A/69/348, 25 August 2014: "On 3 April 2014, despite several objections presented by Palestinian residents of the Silwan neighbourhood, a Palestinian community with a population of 45,000, located around the southern Old City wall in East Jerusalem, the Jerusalem District Planning and Building Committee approved a project known as the Kedem Compound. The Kedem Compound includes a museum, a visitors centre, and a parking lot covering around 16,000 square metres. The plan was presented by Israel's Nature and Parks Authority and the Ir David Foundation, also known as Elad, which works to strengthen the Jewish connection to Jerusalem, notably the Silwan area. The Kedem Compound would constitute a gateway to the City of David National Park, a touristic archaeological site controlled by the same organization. Furthermore, Elad presented plans, covering an estimated area of 1,200 square metres for the construction of another tourist compound above a site known as the spring house in Silwan, an ancient structure built above the main spring. Palestinians in the area have been prevented from accessing one of their main sources of water, since Elad has blocked the entrance to the spring by walls and fences. According to the Ir Amim archaeological organization, the plan was submitted for objections in February 2014. According to Emek Shaveh, an organization of archaeologists, an examination of the placement of the excavations and the planned tourist centres (the Kedem Compound, the City of David Visitors Centre, and the Spring House tourist centre) shows that a contiguous line of Israeli settler presence along the entire northern boundary of the Silwan area is being created."
  8. 200 EX/PX/DR.25.2 Rev. PARIS, 12 October 2016: "The Executive Board... Deplores the Israeli decision to approve... the construction of the so-called “Kedem Center”, a visitor centre near the southern wall of the Al-Aqṣa Mosque/Al-Ḥaram Al-Sharif... and urges Israel, the occupying Power, to renounce the above-mentioned projects and to stop the construction works in conformity with its obligations under the relevant UNESCO conventions, resolutions and decisions"
  9. Soueif, Ahdaf (2010-05-26). "The dig dividing Jerusalem | World news | The Guardian". The Guardian.
  10. [1] Abe Selig, Gan Hamelech residents wary of Barkat's redevelopment plan, Feb. 16, 2010, Jerusalem Post. Accessed August 1, 2016
  11. Greenberg 2014, p. 29: "Contrast these rather upbeat examples of ethical praxis in public archaeology with the situation in the Wadi Hilweh neighborhood in Silwan, built on the ancient mound of Jerusalem, just south of the Harare esh-Sharif (Temple Mount). Here, the material remains of the past have become completely absorbed in the discourse of political power, as both the Israeli national project of unifying Jerusalem and the settler project of breaking Palestinian Jerusalem apart have joined to disenfranchise the people living above and among the antiquities. The archaeology practiced here is completely subsumed to political and corporate motivations that are, however, largely unacknowledged by its "neutral" practitioners, leading to questionable field practice and overtly skewed interpretations of the past. Instead of going into detail about the issues of excavation and interpretation, which I have discussed at length elsewhere (Greenberg 2008, 2009), I would like to consider if there is any way out of the predicament that is, if there is a way to conduct archaeology ethically in Silwan."}}