ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఒక చిన్న, సారవంతమైన ద్వీపం దివిసీమ.

భౌగోళిక స్థితి మార్చు

 
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఆలయం వద్ద వినాయకుని రాతి విగ్రహం

దివిసీమ పులిగడ్డ (అవనిగడ్డ) వద్ద డెల్టా ప్రాంతంలో ఏర్పడింది, ఇక్కడ కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండుగా చీలిపోయింది. ఒక పాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలవగా, మరో పాయ నాగాయలంక మండలంలోని గుల్లలమోద సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇటీవల ఒక కొత్త వంతెనను పులిగడ్డ వద్ద నిర్మించారు. ఇది రేపల్లె, పులిగడ్డను కలుపుతుంది. దివిసీమలో కూచిపూడి, మొవ్వ, సంగమేశ్వరం, నాగాయలంక, కోడూరు, హంసలదీవి, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం, ఘంటసాల గుర్తించదగ్గ ప్రదేశాలు. ఈ ప్రదేశ వైశాల్యం 1204 చ.కి.మీ. ఇది అధిక వర్షపాతం గల చిట్టడవి ప్రాంతం.[1]

చరిత్ర మార్చు

 
దివిసీమలో ఉన్న ప్రముఖ ఆలయాలు

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ, కోనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్ఠించారు.వాటిలో గణించదగినవి 32 ఆలయాలు.

ఆలయాలు మార్చు

దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకుళం, హంసలదీవి.

అవనిగడ్డ మార్చు

ఈ గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయానికి నిలయం. ఈ ఆలయ శిల్పాకళా వైభవానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని నమ్మకం.ఒకప్పుడు కృష్ణానదీ గర్భంలో లక్ష్మీపతిలంకా అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రదేశానికి వరదతాకిడి ఎక్కువుగా ఉండడంతో 2వ కులోత్తుంగ చోళగొంక దేవుడు ఆలయ గోపురాలను ప్రస్తుతమున్న చోటుకు తరలించాడు. ఈ ఆలయంలో ప్రతియేటా వైశాఖ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి.

ప్రముఖులు మార్చు

ఉప్పెన మార్చు

ఈ ప్రాంతం 1977 నవంబరు 19నలో ఒక పెద్ద తుఫానుకు గురై మానవ జీవితాలతో సహా అపూర్వ నష్టాన్ని చవిచూసి ప్రపంచవ్యాప్త వార్తలకెక్కింది. ఈ సహజసిద్ధమైన విపత్తు ఫలితంగా 10,000 మంది ప్రజలు మరణించి ఉంటారని, అలాగే 10,00,000 జంతువులు మరణించి ఉంటాయని అంచనా వేశారు. బాధితులు త్వరగా కోలుకొనేందుకు చాలావరకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కృషి చేశాయి.[2]

మూలాలు మార్చు

  1. యద్దనపూడి, బాబూరావు. దివిసీమ పూర్వ చరిత్ర. pp. iii.
  2. Diviseema Social Service Society

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దివిసీమ&oldid=3359765" నుండి వెలికితీశారు