ది మమ్మీ (చలన చిత్రం)

1999 ఆంగ్ల చిత్రం

ది మమ్మీ 1999 ఆంగ్లం: The mummy అనే చిత్రాన్ని స్టీఫెన్ సొమర్స్ దర్శకత్వం వహించాడు. బ్రాండెన్ ఫ్రేసర్, రాచెల్ వీజ్ కథానాయకా నాయికలుగా నటించారు. దీనిని 1932లో అదే పేరుతో వచ్చిన మమ్మీ చిత్రాన్ని పునర్నిమించారు. ఈ చిత్రంలో పునర్జన్మ పొందే మమ్మీగా ఆర్నాల్డ్ వోస్లూ నటించాడు. అదే పాత్రను 1932లో బోరిస్ కార్లోఫ్ నటించారు. ఈ చిత్రాన్ని మొదట్లొ తక్కువ వ్యయంతో నిర్మిద్దామనుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

ది మమ్మీ
Theatrical release poster
దర్శకత్వంStephen Sommers
స్క్రీన్ ప్లేStephen Sommers
కథStephen Sommers
Lloyd Fonvielle
Kevin Jarre
నిర్మాతSean Daniel
James Jacks
తారాగణంBrendan Fraser
Rachel Weisz
John Hannah
Arnold Vosloo
Jonathan Hyde
Kevin J. O'Connor
ఛాయాగ్రహణంAdrian Biddle
కూర్పుBob Ducsay
సంగీతంJerry Goldsmith
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుUniversal Pictures
విడుదల తేదీ
1999 మే 7 (1999-05-07)
సినిమా నిడివి
125 minutes
దేశంUnited States
భాషEnglish[1]
బడ్జెట్$80 million
బాక్సాఫీసు$415.9 million

ఈ చిత్రనిర్మాణం మొరాకోలో మొదలైంది. మొత్తం 17వారాల పాటు కొనసాగింది. సినిమా సాంకేతిక బృందం, నటీనటులు సహారా ప్రదేశంలో నిర్మాణ సమయంలో ఎన్నో అవాంతరాలను (ఇసుక తుఫాను, పాములు, నిర్జలీకరణ (dehydration) )ఎదుర్కొన్నారు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ (మమ్మీని కంప్యూటర్ ద్వారా సృష్టించడం)" ను లూకాస్ లైట్ అండ్ మాజిక్" సంస్థ రూపొందించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని జెర్రీ గోల్డ్ స్మిత్ అందిచారు.

ఈ చిత్రం మే7 1999న విడుదలైంది. ఒక్క వారం రోజులలోనే అమెరికాలోని 3210 థియేటర్లలో $43 మిలియన్ డాలర్లు సాథించింది. ప్రపంచవ్యాప్తంగా $416 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా "ది మమ్మీ రిటర్న్ స్" "ది మమ్మీ ది టూంబ్ ఆఫ్ డ్రాగన్ ఎంపరర్" చిత్రాలు వచ్చాయి అవి కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళు సాధించాయి.

కథ మార్చు

క్రీస్తు పూర్వం 1291 లో ప్రాచీన ఈజిప్టు నగరమైన థేబ్స్ నగర రాజు ఫారో సేటీ 1. అతని భార్య అనెక్సునా మున్ ఫెరో గురువైన ఇంహోటెప్ తో అక్రమ సంబందం కల్గి వుంటుంది. ఒక సారి ఫారో సేటీకి వీరిద్దరూ పట్టుబడగా ఫారోని ఘోరంగా హత్య చేస్తారు. ఫారో అంగరక్షకులు వచ్చేసరికి ఇంహొటెప్ అతని మనుషులతో వెళ్ళిపోతాడు. అనెక్సునా మున్ ఇంహోటెప్ తనను తిరిగి బ్రతికిస్తాడని ఆత్మహత్య చేసుకుంటుంది. అనెక్సునా మున్ ను సమాధి చేసిన తర్వాత ఇంహోటెప్ మనుషులు ఆమె శవాన్ని తీసుకుని మృతుల నగరమైన హమునాప్ట్రాకు తీసుకు వెళతారు. ఇంహోటెప్ అనెక్సునామున్ కు పునర్జీవితం ప్రసాదించేందుకు పూజలు నిర్వహించి ఆమె ఆత్మను ఆమె శరీరంలోకి ప్రవేశింపజేసే సమయంలో ఫారో అంగరక్షకులు వచ్చి ఇంహోటేప్ను బందిస్తారు. ఆమె ఆత్మ పాతాళ లొకానికి వెళ్ళిపోతుంది. ఇంహోటెప్ మనుషుల్ని చిత్రహింసలకు గురి చేసి సమాధి చేస్తారు. ఇంహోటెప్కు మాత్రం అతి భయంకరమైన "హోం డై" శిక్ష నాలుకను కత్తిరించి బొద్దె పురుగులు వేసి జీవసమాధి చేస్తారు. అతని శవపేటికను ఈజిప్టుల దేవతయైన అనుబిస్ విగ్రహం క్రింద భవిష్యత్తులో ఎవరూ తెరవకుండా బందిస్తారు.

మూలాలు మార్చు

  1. "Release". British Film Institute. London: BFI Film & Television Database. Archived from the original on 2014-01-03. Retrieved May 8, 2013.