దుప్పి ఎలుక (ఆంగ్లం Indian Gerbil లేదా లాటిన్ Tatera indica) మ్యురిడే కుటుంబానికి చెందిన ఎలుక. ఇవి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, చైనా, ఇరాన్, ఇరాక్, కువైట్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, సిరియా దేశాలలో విస్తరించాయి.[1] ఇవి టటేరా (Tatera) ప్రజాతికి చెందిన ఏకైక జాతికి చెందిన జీవులు.

దుప్పి ఎలుక
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Subtribe:
Genus:
Tatera

Lataste, 1882
Species:
T. indica
Binomial name
Tatera indica
(Hardwicke, 1807)

వివరణ మార్చు

దీని తల, శరీరం పొడవు 117-20 సెం.మీ ఉంటుంది. దీని తలతో సహా శరీర ఉపరితలం అంతా లేత గోధుమ రంగులో ఉంటుంది. దీని దిగువ భాగం తెలుగు రంగులో ఉంతుంది. దీని తోక పూర్తిగా వెండ్రుకలతోకూడి ఉంటుంది. తోక దట్టమైన నలుపు రంగుతో కూడిన గోధుమ వర్ణములో ఇరువైపులా బూడిద రంగులో ఉండి, చివరికి నలుపు రంగులో ఉంటుంది. దీని శరీరంపై వెండ్రుకలు మృదువుగా ఉంటాయి. తోకపై ఉన్న వెండ్రుకలు పెద్దవి. కళ్ళు పెద్దవి.[2]

పునరుత్పత్తి మార్చు

ఈ జాతి యొక్క లింగాలు రెండూ వేరుగా నివసిస్తాయి. మగ, ఆడ జీవుల మధ్య సంబంధం ఇంకా తెలియరాలేదు.[3]

ఆహారం మార్చు

ఇవి సర్వ భక్షకాలు. ధాన్యాలు, విత్తనాలు, మొక్కలు, వేర్లు, కీటకాలు, సరీసృపాలు, చిన్న పక్షులు, క్షీరదాలను కూడా ఇవి తింటాయి.[2]

మూలాలు మార్చు

  1. https://portals.iucn.org/library/sites/library/files/documents/RL-549.3-003-v.2.pdf
  2. 2.0 2.1 Yapa, A.; Ratnavira, G. (2013). Mammals of Sri Lanka. Colombo: Field Ornithology Group of Sri Lanka. p. 1012. ISBN 978-955-8576-32-8.
  3. Stephanie Mott. "ADW: Tatera indica: INFORMATION". Animal Diversity Web. Retrieved 30 May 2015.

ఇతర వనరులు మార్చు