దువ్వూరి వేంకటరమణ శాస్త్రి

సంస్కృతాంధ్ర పండితుడు, వ్యాకరణవేత్త, ఉపాధ్యాయుడు, రచయిత

దువ్వూరి వేంకటరమణ శాస్త్రి సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, కళాప్రపూర్ణ గ్రహీత.[1]

దువ్వూరి వేంకటరమణ శాస్త్రి
దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర
జననందువ్వూరి వేంకటరమణ శాస్త్రి
విలంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి
మరణం1976, మార్చి 6
కాకినాడ
మరణ కారణంహృద్రోగం
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర పండితుడు

వీరిది తూర్పు గోదావరి జిల్లా లో మసకపల్లి గ్రామం. వీరి ఇంటి పేరు దువ్వూరి . దువ్వూరు అనేది గ్రామ నామం. ఈ ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వులు మొట్టమొదట ఈ గ్రామవాసులై ఉండి, క్రమేణా గోదావరీ ప్రాంతం చేరారు. ఊరు శబ్దం ఔపవిభక్తికం గనుక 'ఇ' కారం వచ్చి,దువ్వూరి వారయ్యారు. ఈ యింటి పేరుతో గోదావరి మండలంలో వందలకొలది కుటుంబాలు ఉన్నాయి.

వీరు విలంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రుడు వద్ద జరిగినది. వీరిరువురూ చదువు ముగిసిన తర్వాత ఎక్కువగా "కట్టు శ్లోకాలు" అనే చిత్రమైన సారస్వత క్రీడా వినోద ప్రక్రియ ఆడేవారు. ఇది నేటి అంత్యాక్షరి లాంటిది. అయితే పాటలతో కాకుండా శ్లోకాలతో ఆడాలి.

ఈయన వివాహం పదిహేనేళ్ళ వయసులో కోనసీమ లో అమలాపురం తాలూకా ఇందుపల్లి గ్రామంలో జరిగింది. ఈయన మామగారు వంక జగనాధశాస్త్రి.

ఈయన 1914 సంవత్సరంలో విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్థిగా చేరాడు. ఆ కాలంలో గుదిమెళ్ళ వరదాచార్యులు గారు కాలేజీ అధ్యక్షులుగా, కిళాంబి రామానుజాచార్యులు వైస్ ప్రిన్సిపాల్, సంస్కృత భాషా బోధకులు, వజ్ఝల సీతారామస్వామి శాస్త్రులు తెలుగు బోధకులు. ఈయన 1918లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. వడ్లమాని విశ్వనాథశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్ఝల సత్యనారాయణశాస్త్రి, గుళ్లపల్లి వేంకటేశ్వరశాస్త్రి నలుగురు వీరి సహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు.

మరణం మార్చు

వీరు 1976వ సంవత్సరం మార్చి 6వ తేదీన కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ 78వ యేట మరణించారు[2].

మూలాలు మార్చు

  1. కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర, అభినవ ప్రచురణలు, తిరుపతి, 2009.
  2. ఆంధ్రప్రభ దినపత్రికలోని వార్త[permanent dead link]