Collections : 4 Crore share

దొంగ మొగుడు
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతఎస్. పి. వెంకన్న బాబు
తారాగణంచిరంజీవి,
రాధిక శరత్‌కుమార్,
భానుప్రియ,
సుత్తివేలు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1987 జనవరి 9 (1987-01-09)[1]
భాషతెలుగు

దొంగ మొగుడు 1987 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, మాధవి, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎస్. పి. వెంకన్నబాబు మహేశ్వరి మూవీస్ పతాకంపై నిర్మించాడు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నల్లంచు తెల్లచీర అనే నవల ఆధారంగా రూపొందించబడింది. చిరంజీవి ద్విపాత్రాఅభినయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది.[2]

కథ మార్చు

రవితేజ ఒక వస్త్ర వ్యాపార సంస్థ ఉన్న పారిశ్రామికవేత్త. అతను వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తి. కానీ అతని వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి ఉండదు. అతని భార్య (మాధవి), ఆమె తల్లి అతన్ని మానసికంగా హింసిస్తూంటారు. అతను తన అందమైన పర్సనల్ అసిస్టెంటు ప్రియంవదకు దగ్గరౌతాడు. ఇంతలో, అతని ప్రత్యర్థులు వ్యాపారంలో అతని విజయాలను తట్టుకోలేక, అతనిని మరో వ్యాపార ఒప్పందం పొందకుండా ఆపడానికి ప్రణాళిక వేస్తారు. ఈ సందర్భంలో అతను, చిన్నచితకా దొంగతనాలు చేసే నాగరాజు తారసపడతాడు. రవితేజను నాగరాజు రక్షిస్తాడు. వారిద్దరూ తమతమ స్థానాలను మార్పిడి చేసుకోవాలని రవితేజ ప్లాను వేస్తాడు. తద్వారా తన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చని అతడి ఉద్దేశం. నాగరాజు అంగీకరించి, మాధవికి, ఆమె తల్లికి, రవితేజ శత్రువులకూ ఒక పాఠం నేర్పుతాడు. రవితేజ ఈ దొంగ జీవనశైలిలో తాను గడపాల్సిన వింత పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను చిన్న చిన్న దొంగతనాలు చేసే గీతను కలుస్తాడు. చివరికి, వారిద్దరూ తమ నిజమైన గుర్తింపులను వెల్లడిస్తారు. సినిమా సంతోషకరంగా ముగుస్తుంది.

తారాగణం మార్చు

పాటలు మార్చు

పాటలను కొసరాజు రాఘవయ్య, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించగా, కె. చక్రవర్తి స్వరపరిచాడు.

# పాట గాయనీ గాయకులు
1 "అద్దమరేయి మద్దెలా" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2 "ఈ చెంపకు" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
3 "ఇడ్లీ పాపా" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
4 "కోకమ్మా చెప్పమ్మా" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
5 "నల్లంచు తెల్లచీర" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
6 "నీ కోకకెంత" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

మూలాలు మార్చు

  1. "Chiranjeevi Movie Special Story: 'దొంగ మొగుడు' @ 35: బాక్సాఫీస్ మొగుడు! – HiMedia" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-02-18. Retrieved 2022-02-18.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-02-09. Retrieved 2020-08-04.