నందిని రాయ్

తెలుగు చలనచిత్ర నటి, మోడల్

నందిని రాయ్ (నీలం గౌహ్రానీ)[1][2] తెలుగు చలనచిత్ర నటి, మోడల్. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది.[3][4]

నందిని రాయ్
జననం
నీలం

(1990-09-18) 1990 సెప్టెంబరు 18 (వయసు 33)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసం మార్చు

నందిని 1990, సెప్టెంబరు 18న హైదరాబాదులోని సింధీ కుటుంబంలో జన్మించింది.[1][2] హైదరాబాదులోని సెయింట్ ఆల్బన్స్ హైస్కూల్ నుండి 2005లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నందిని, లండన్‌లో ఫైనాన్స్ లో ఎం.బి.ఏ. డిగ్రీని పూర్తి చేసింది.

మోడలింగ్ మార్చు

80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించిన నందిని, అనేక అందాల పోటీలలో గెలిచింది. 2008లో మిస్ హైదరాబాద్ 2008, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి బహుమతులు అందుకుంది.

సినీరంగ ప్రస్థానం మార్చు

ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ చిత్రంలో, మాయ, మోసగాళ్ళకు మోసగాడు అనే తెలుగు చిత్రాలలో నటించింది.[5] 2012లో లాగిన్ అనే బాలీవుడ్ చిత్రంలో కూడా కనిపించింది.[2] ఎ. సాజీద్ దర్శకత్వం వహించిన గుడ్‌బై డిసెంబర్ చిత్రంతో మలయాళంలోకి,[5] 2014లో ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో ఖుషి ఖుషియాగి చిత్రంతో కన్నడంలోకి,[6][7] 2018లో గ్రహణం చిత్రంతో తమిళంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం తెలుగులో సుడిగాడు 2 సినిమాలో నటిస్తుంది.[8]

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2011 ఫ్యామిలీ ప్యాక్ సుల్తానా హిందీ
2011 040 తెలుగు
2012 హార్మోన్స్ సౌమ్య నాయక్ తెలుగు
2012 లాగిన్ దివ్య హిందీ
2013 గుడ్‌బై డిసెంబర్ మలయాళం తొలిచిత్రం
2014 మాయ వైశాలి తెలుగు
2015 ఖుషి ఖుషియాగి ప్రియ కన్నడం తొలిచిత్రం
2015 మోసగాళ్లకు మోసగాడు జానకి తెలుగు
2018 గ్రహణం తమిళం నిర్మాణంలో ఉంది
2018 సిల్లీ ఫెలోస్ పుష్ప తెలుగు
2019 శివరంజని శివరంజని తెలుగు
2022 పంచతంత్ర కథలు తెలుగు

టీవీరంగం మార్చు

నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ పోటీదారులలో ఒకరైన నందిని,[3] 2018, ఆగస్టు 5న షో నుండి పంపించబడింది.[9]

సంవత్సరం సిరీస్ పాత్రపేరు ఛానల్ పేరు భాష మూలాలు
2018 బిగ్ బాస్ తెలుగు స్టార్ మా తెలుగు హాట్​స్టార్​
2019 హై ప్రీస్టెస్ రూబీ జీ5 తెలుగు ప్రసారం[10]
2020 షూట్ అవుట్ ఎట్ ఆలేర్ నఫీసా జీ 5 తెలుగు
2020 మెట్రో కథలు సుప్రియ ఆహా తెలుగు
2021 ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ మీనా ఆహా తెలుగు
2021 గాలివాన తెలుగు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 New ‘naughty’ girl in town, Retrieved 25 August 2019
  2. 2.0 2.1 2.2 Asha Prakash, TNN (27 February 2012). "Who inspired Nandini Rai's makeover? - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 1 జూలై 2012. Retrieved 25 August 2019.
  3. 3.0 3.1 "Who is Bigg Boss 2 Contestant Nandini Rai?".
  4. Pecheti, Prakash (21 May 2021). "Nandini Rai prefers intense roles". Telangana Today. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
  5. 5.0 5.1 Anasuya Menon (25 February 2012). "Hello Mollywood!". The Hindu. Retrieved 25 August 2019.
  6. "It's final, Ganesh's next is Kushi Kushiyalli - Times of India".
  7. "Nandini Rai comes between Ganesh and Amoolya - Times of India".
  8. "Nandini Rai to debut in Tamil - Times of India".
  9. "NewsDog - India News - NewsDog". www.newsdogapp.com. Archived from the original on 2018-09-09. Retrieved 2019-08-25.
  10. "Telugu web series 'High Priestess' explores psychic world".

ఇతర లంకెలు మార్చు