నడిపల్లి దివాకర్ రావు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.

నడిపల్లి దివాకర్ రావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యుడు.[1][2] 1999, 2004లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో లక్సెట్టిపేట అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యునిగా. 2014, 2018లలో తెలంగాణ శాసననభకు జరిగిన ఎన్నికల్లో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యునిగా గెలుపొందాడు.[3]

నడిపల్లి దివాకర్ రావు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
2014–2018, 2018– ప్రస్తుతం
ముందు గడ్డం అరవింద్ రెడ్డి
నియోజకవర్గం మంచిర్యాల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
1999–2004, 2004–2009
ముందు గోనె హన్మంత రావు
తరువాత గడ్డం అరవింద్ రెడ్డి
నియోజకవర్గం లక్షెట్టిపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1953, ఆగస్టు 16
మంచిర్యాల, మంచిర్యాల జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు లక్ష్మణ్ రావు, రమాదేవి
జీవిత భాగస్వామి రాజకుమారి
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం మంచిర్యాల

జీవిత విశేషాలు మార్చు

దివాకర్ రావు 1953, ఆగస్టు 16న లక్ష్మణ్ రావు, రమాదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాలలో జన్మించాడు. 1978లో మంచిర్యాల లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి పొలిటికల్ సైన్స్‌లో బి.ఏ. పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

దివాకర్ రావుకు రాజకుమారితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజకీయ విశేషాలు మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టతీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1981లో మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం సాధించిన దివాకర్ రావు 1983–1992 వరకు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1987లో ఆసిఫాబాద్ డివిజన్‌లోనే అత్యధిక మెజారిటీతో మంచిర్యాల మండల సింగల్ విండో చైర్మన్‌గా గెలుపొందాడు. ఆ తరువాత 1989 నుండి 1999 వరకు పదేండ్లపాటు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 1999, 2004లో రెండుసార్లు (11వ, 12వ ఆంధ్రప్రదేశ్ శాసనసభలు) లక్సెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం అరవింద్ రెడ్డిపై 59,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈయన నాలుగు సార్లు మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా గెలిచాడు.[4][5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోకిరాల ప్రేమ్ సాగర్ రావుపై 4,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7]

హోదాలు మార్చు

  • 27. 2015 మార్చి – 6. 2018 సెప్టెంబరు: పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్, తెలంగాణ లెజిస్లేచర్

ఇతర వివరాలు మార్చు

దివాకర్ రావు సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌ మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు మార్చు

  1. "Mancherial Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2021-10-19. Retrieved 2021-10-20.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-01. Retrieved 2019-05-01.
  3. Telangana Legislature (2018). "Member's Profile – Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  4. https://s/telanganatoday.com/diwakar-rao-becomes-mla-for-4th-time-sets-record/amp[permanent dead link]
  5. "Diwakar Rao Nadipelli(TRS):Constituency- MANCHERIAL(ADILABAD) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-10-20.
  6. "Diwakar Rao Nadipelli MLA of Mancherial Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-10-20.
  7. Namasthe Telangana (25 March 2021). "సాగునీటి రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త : ఎమ్మెల్యే దివాక‌ర్ రావు". Namasthe Telangana. Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.