నామిని సుబ్రహ్మణ్యం నాయుడు

రచయిత

నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సుప్రసిద్ధ రచయిత. 1980లలోను 1990లలోను ఈయన కథలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైనాయి. సాధారణమైన రాయలసీమ వాడుక భాషలో,[1] పిల్లల తేలికగా పాఠాలు అర్థం చేసుకోవడం కోసం కూడా కొన్ని పుస్తకాలు రచించాడు.[2] తన జీవితానుభవాలనే కతలుగా రచించి పాఠకుల మన్ననలు పొందాడు. విలక్షణమైన ఆయన రచనాశైలిని, చమత్కారాన్ని బాపూ, స్వర్గీయ పీ.వీ.నరసింహారావు మొదలైన ప్రముఖులెందరో ప్రశంసించారు.

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు
జననం (1948-10-16) 1948 అక్టోబరు 16 (వయసు 75)
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత
క్రియాశీల సంవత్సరాలు1983 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సాహిత్యము
జీవిత భాగస్వామిప్రభావతి
పిల్లలుకుమార్తె దీప్తి, కొడుకు టామ్ సాయర్

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

నామిని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం, మిట్టూరులో జన్మించాడు. వాళ్ళది వ్యవసాయ ప్రధానమైన కుటుంబం. ఆయన ఎనిమిదేళ్ళ వయసునుంచే వ్యవసాయపనుల్లో పాల్గొనేవాడు. ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ చేసే దాకా సెలవుల్లో పశువులు మేపడానికి వెళ్ళేవాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేశాడు.

ఉద్యోగం మార్చు

చదువైపోగానే ఈనాడు తిరుపతి ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా చేరాడు. అక్కడే ఒకటిన్నర సంవత్సరం పనిచేశాడు. తరువాత దాసరి నారాయణరావు ఉదయం లో చేరి హైదరాబాద్ కు వచ్చేశాడు. అలా ఉదయంలో ఉండగా పచ్చనాకు సాక్షిగా అనే వ్యాసాల సంకలనం ప్రారంభించాడు. 1985 లో ఆంధ్రజ్యోతి హైదరాబాద్ సంచిక ప్రారంభించినపుడు ఏబీకే ప్రసాద్ ఆయన్ను అందులోకి రమ్మని ఆహ్వానించాడు. త్వరలోనే తిరుపతి సంచిక ప్రారంభిస్తాననీ మళ్ళీ అక్కడికి పంపిస్తాననీ మాట ఇచ్చారు. అట్లయితే రేణిగుంటలోనే ఉండి ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను చూసుకోవచ్చు కదా అని అక్కడ చేరాడు.[3] ఎనిమిది నెలల తరువాత తిరుపతి జ్యోతి సంచిక ప్రారంభమైంది.[4] హైదరాబాదు నుంచి తిరిగి వచ్చి మిట్టూరులో కాపురం పెట్టాడు. సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు, మునికన్నడి సేద్యం రాశాడు. వీటన్నింటిలోనూ పల్లె బతుకుల్ని ఉన్నదున్నట్టుగా చిత్రీకరించాడు.

రచనా ప్రస్థానం మార్చు

ఆయన ఎమ్మెస్సీ మొదటి సంవత్సరంలో ఉండగా మొదటి కథ రాశాడు. ఆయన ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుండగా జరిగిన ఒక సంఘటన. ఒక ముసలాయన పశుమాంసం తీసుకుని బస్సులో ప్రయాణిస్తుండగా, అందుకు కోపించిన మరో ప్రయాణికుడు ఆ ముసలాయన్ను కొడతాడు. మిగతా ప్రయాణికులు అతన్ని వారించి ఆ ముసలాయన్ను విషయమేంటని అడుగుతారు. తన కూతురు గర్భవతియని, ఆమెకు పాలు బాగా పడుతాయని తీసుకెళుతున్నానని చెబుతాడు. ఆ సంఘటనే ప్రేరణగా ఆయనకు కథ రాయాలపించింది. దాన్ని ఆంధ్రప్రభకు పంపిస్తే వెనక్కి తిరిగొచ్చింది.

ప్రభావం మార్చు

ఆయన మీద ఏ రచయిత ప్రభావం లేదని చెప్పుకొస్తాడు. ఆయన పొలంలో పనిచేసేటపుడు, పశువుల్ని మేతకు తోళుకెళుతున్నపుడు, చుట్టూరా ఉన్న రైతులు, వారి భార్యలు మాట్లాడుకునే మాటల ప్రభావమే ఎక్కువ. పల్లెతోనూ, పైరుతోనూ, మట్టి తోనూ, రైతులతోనూ, ఆయనకున్న అనుబంధమే ఆయన చేత అలా రాయించిందని చెప్పుకొస్తాడు.

కుటుంబం మార్చు

వాళ్ళ కుటుంబంలో ఆయన మూడో సంతానం. ఆయనకు ఒక అన్న, అక్క ఉన్నారు. ఆయన భార్య పేరు ప్రభావతి. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె దీప్తి, కొడుకు పేరు టామ్ సాయర్. ఆయనకిష్టమైన రచయితయైన మార్క్ ట్వైన్ నవలలోని కథానాయకుడి పేరది.

రచనలు మార్చు

మూలాలు మార్చు

  1. A. D, Rangarajan (16 February 2015). "More online free content in Telugu Wikipedia soon". The Hindu. The Hindu. Retrieved 22 June 2018.
  2. "Fear of maths must be dispelled, say experts". thehindu.com. The Hindu. 5 December 2000. Retrieved 22 June 2018.
  3. Sameer (31 March 2000). "Storm in literary circles over 'Ravana Jyosyam'". rediff.com. Retrieved 22 June 2018.
  4. "పాఠకులారా... మిమ్మల్ని క్షమించలేను". ఆంధ్రజ్యోతి.

బయటి లింకులు మార్చు