నారాయణదేశాయ్

భారతీయ రచయిత మరియు ఉద్యమకారుడు

నారాయణదేశాయ్ ( 1924 డిసెంబరు 24 – 2015 మార్చి 15) స్వాతంత్ర్య సమరయోధుడు, గుజరాత్ విద్యా పీఠ్ మాజీ ఛాన్సలర్, గాంధేయవాది, రచయిత. నారాయణదేశాయ్ మహాత్మాగాంధీకి సంబంధించిన రోజువారి పనులను దగ్గరుండి చూసేవారు. మహ్మాతాగాంధీతో ఉన్న సాన్నిహిత్యంతో, అతను సైద్ధాంతిక భావాలతో వినోభాబావే ప్రారంభించిన భూధాన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

2007 జనవరిలో వెడ్చి వద్ద చిత్రం

ప్రారంభ జీవితం మార్చు

అతను మహాత్మాగాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్ దేశాయ్ యొక్క కుమారుడు.[1] అతను గుజరాత్ లోని "బల్సర్"లో డిసెంబరు 24 1924 న జన్మించారు.[2] అతను అహ్మదాబాదులోన్ సబర్మతి వద్ద గాల్ సబర్మతి ఆశ్రమం, వార్థా వద్ద సేవాగ్రాం లలో చేరినందువల్ల పాఠశాల విద్యకు దూరమయ్యాదు కానీ ఆశ్రమంలో ఉన్న తన తండ్రి, యితర వ్యక్తుల మూలంగా విద్యార్జన చేసాడు. అతను ఖాదీ నేత, దారం తీయుతలో శిక్షణ పొందాడు.[3]

ప్రారంభ సంవత్సరాలు మార్చు

అతను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులైన దపతులు నబకృష్ణ చౌదరి, మాలతీదేవి చౌదరి కుమార్తె అయిన ఉత్తర చౌదరిని వివాహమాడారు. వారు వెడ్చి అనే ప్రాంతంలో ఈ దంపతులు ఉన్నారు. ఈ గ్రామం గుజరాత్ లోణి సూరత్ కు 60 కి.మీ దూరంలో ఉంది. అతను నై తలీం స్కూల్ లో ఉపాధ్యాయునిగా పనిచేసారు. అతను వినోబాభావే నిర్వహించిన భూదానోద్యమంలో పాల్గొన్నారు. అతను గుజరాత్ లోన్ని ప్రాంతాలను కాలినడకతో సందర్శించాడు. ఆయా ప్రాంతాలలో గల ధనవంతుల వద్ద నుండి భూమిని సేకరించి భూమిలెని నిరుపెదలకు పంచేవాడు. అతను భూదానోత్సవం యొక్క పత్రిక "భూమిపుత్ర" (మట్టి యొక్క కుమారుడు) ప్రారంభించారు.దానికి 1959 వరకు సంపాదకునిగా ఉన్నారు.[2]

గాంధేయవాదిగా మార్చు

అతను వినోభాబావే స్థాపించిన, ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు జయప్రకాష్ నారాయణ (జె.పిగా సుప్రసిద్ధుడు) చే నడుపబడుతున్న అహిల్ భారతీయ శాంతి సేన మండలి (ఇండియన్ పీస్ బ్రిగేడ్) లో చేరారు. శాంతి సేనకు ప్రధాన కార్యదర్శిగా [4] అతను దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్యలను, స్వచ్ఛందసేవకులను నియమించి శిక్షణనిచ్చారు.

అతను "పీస్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్| యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అతను "వార్ రెసిస్టర్స్ ఇంటర్నేషనల్"కు చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. అతను పాకిస్టాని శాంతి దళంలో ఉండి యునెస్కో అంతర్జాతీయ బహుమతి పొందారు.

అతను భారతదేశంలో ఎమర్జెన్సీ కాలంలో దానికి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. సెన్సార్ షిప్ నియమాలకు వ్యతిరేకంగా ఒక మ్యాగజైన్ ను నడిపారు. అతను జయప్రకాష్ నారాయణ్కు అతి సన్నిహితుడిగా కొత్తగా యేర్పడ్డ జనతా పార్టీకి సహకరిస్తూ ముఖ్య భూమిక పోషించారు.

జె.పి మరణానంతరం అతను వడ్చి గ్రామానికి తిరిగి వచ్చి సంపుర్ణ క్రాంతి విద్యాలయను ప్రారంభించారు. ఆ విద్యాలయంలో అహింస, గాంధేయవాదంపై శిక్షణనిచ్చేవారు. అతను తండ్రి మహదేవ్ దేశాయ్ ఆశయంకోసం గుజరాతి భాషలో గాంధీ గారి జీవిత చరిత్రను నాలుగు సంపుటాలలో వ్రాసారు. ఆగస్టు 15 1942లో అతను తండ్రి జైలులో ఆకస్మిక మరణం మూలంగా అతను తండ్రి కలను బ్రతికున్నప్పుడు సాకారం చేయలేకపోయాడు.

అతను 2004 నుండి ప్రపంచ వ్యాప్తంగా 'గాంధీ-కథ ' ను చదివి వినిపించారు. అతను వ్రాసిన గాంధీ జీవిత చరిత్ర నాలుగు వాల్యూంలు 2000 పెజీలతో ఉంటుంది. ఆ పుస్తకం పూర్తయిన తరువాత దాని అధిక ఖరీదు కారణంగా కొంతమంది మాత్రమే కొనగలరని భావించాడు. అందువల్ల గాంధీ సందేశాన్ని అందించుటకు ఒక నవల వ్రాయాలని నిర్ణయించాడు. వెంటనే "గాంధీ కథ"ను ప్రారంభించారు. రామాయణం, మహాభాగవతం మాదిరిగా గాంధీ కథను ప్రారంభించారు. రోజుకు మూడు గంటల చొప్పున ఏడు దినాలలో గాంధీజీ యొక్క మొత్తం చరిత్రను లిఖించారు.గాంధీ కథ సమయంలో అతను అనేక పాటలను కంపోజ్ చెసి పాడారు. ఆ కథ శ్రోతలపై ప్రభావం చూపింది. ఆ కథలో గాంధీజీ రాజకీయ కార్యక్రమాలు, నాయకత్వం మర్యు నైపుణ్యాలను తెలియజేసాఅరు.

ఈ కథ భారతదేశం, విదేశాలలో ప్రాచుర్యం పొందింది. అతను గుజరాత్ విద్యాపీఠ్కు 2007 జూలై 23 నుండి ఛాన్సలర్ గా పనిచేసి 2014 నవంబరు న రాజీనామా చేసారు.[2]

మరణం మార్చు

అతను 2014 డిసెంబరు 10 న కోమాలోనికి వెళ్ళిపోయారు. ఆ తరువాత కోలుకుని చరఖాతో నూలు వడికారు. అతను నిత్యకృత్యాలు చేసుకోవడానికి కష్టపడ్డారు. అందువలన ద్రవరూప ఆహారాన్ని తీసుకున్నారు. అతను 2015 మార్చి 15 న మరణించారు.[2]

అవార్దులు మార్చు

  • గుజరాత్ రచయితల సాహిత్య అకాడమీ అవార్డును 1993 లో పొందారు.
  • 1999 లో జమ్నాలాల్ బజాజ్ అవార్డు.[5]
  • యునెస్కో మదన్‌జీ సింగ్ ప్రైజ్ - 1998.[6]
  • 2001 లో రంజిత్రం సువర్ణ చంద్రక్, గుజరాతీ సాహిత్యంలో అత్యున్నత అవార్డు.
  • 2004 లో 18 వ మూర్తి దేవి అవార్డు.

మూలాలు మార్చు

  1. Pandiri, Ananda M. A Comprehensive, Annotated Bibliography on Mahatma Gandhi. Westport, CT: Greenwood Press, 1995. 35.
  2. 2.0 2.1 2.2 2.3 PTI (15 March 2015). "Noted Gandhian Narayan Desai passes away". The Economic Times. Retrieved 15 March 2015.
  3. "Narayan Desai passes away". DeshGujarat. Retrieved 15 March 2015.
  4. Hardiman, David. Gandhi in His Times and Ours: The Global Legacy of His Ideas. New York: Columbia UP, 2003. 192.
  5. "Jamnalal Bajaj Awards Archive". Jamnalal Bajaj Foundation.
  6. "UNESCO-Madanjeet Singh Prize for the Promotion of Tolerance and Non-Violence (2009)" (PDF). UNESCO. 2009.