నికోబార్ దీవులు

హిందూ మహాసముద్రంలో ద్వీప సమూహం

నికోబార్ దీవులు దక్షిణాసియాలో ఆర్చిపిలాగో కోవకు చెందిన దీవులు. భారతీయ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవీ ఒకటి. హిందూ మహాసముద్రంలోని తూర్పు ద్వీపావళిలో ఇవి ఒక భాగం. ఇవి సుమత్రా దీవులకు 150 కి.మీ దూరంలో ఉన్నాయి. నికోబార్ దీవులు థాయ్‌లాండ్ నుండి వేరుపడి ఉన్నాయి. బంగాళాఖాతానికి తూర్పు దిశలో ఉన్నాయి. భారత ఉపఖండానికి 1,300 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో ఉన్నాయి. యునెస్కో నికోబార్ దీవులను వరల్డ్స్ బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించింది.

Nicobar Islands
Location of the Nicobar Islands in the Indian Ocean.
భూగోళశాస్త్రం
ప్రదేశంBay of Bengal
అక్షాంశ,రేఖాంశాలు7°05′N 93°48′E / 7.083°N 93.800°E / 7.083; 93.800
ద్వీపసమూహంAndaman and Nicobar Islands
మొత్తం ద్వీపాలు22
ముఖ్యమైన ద్వీపాలుCar Nicobar, Great Nicobar, Little Nicobar
విస్తీర్ణం1,841 km2 (711 sq mi)
అత్యధిక ఎత్తు642 m (2,106 ft)
ఎత్తైన పర్వతంMount Thullier
నిర్వహణ
Union territoryAndaman and Nicobar Islands
Capital cityPort Blair (on South Andaman Island)
అతిపెద్ద ప్రాంతముMalacca, Car Nicobar (pop. 1,637)
జనాభా వివరాలు
జనాభా36,842 (2011)
జన సాంద్రత20 /km2 (50 /sq mi)
జాతి సమూహాలుNicobarese
Shompen
Mainland Indians
అదనపు సమాచారం
సమయం జోన్
 • Summer (DST)
అధికార జాలస్థలిhttps://andaman.nic.in/

చరిత్ర మార్చు

 
ఇండియన్ ఓషన్‌లోని తూర్పు ద్వీపావళిలో నికోబార్ దీవులు లొకేటర్ మ్యాప్
 
నికోబార్ దీవులు పటం

చారిత్రక కాలానికి ముందు మార్చు

నికోబార్ ద్వీపాలలో వేల సంవత్సరాల నుండి మానవులు నివసిస్తున్నారని విశ్వసిస్తున్నారు. ఈ ద్వీపాలలో 6 స్థానిక భాషలు వాడుకలో ఉన్నాయి. అవి ఆస్ట్రోసియాటిక్‌ కుటుంబానికి చెందిన " మాన్-ఖేమర్ " వర్గానికి చెందినవి. వీటిలో ఆగ్నేయాసియాకు చెందిన మాన్, ఖేమర్, వియత్నామీ భాషలుకూడా ఉన్నాయి. అలాగే భారతీయ భాషలలో ఒకటైన ముందా భాష కూడా ఒకటి. గ్రేట్ నికోబార్ దక్షిణ తీరాలలో " షాంపెన్ " అనే స్థానిక ప్రజలు నివసిస్తున్నారు. వీరు ఆగ్నేయాసియాకు చెందిన మెసోలిథిక్ జాతికి చెందిన వారై ఉండవచ్చని భావిస్తున్నారు.

స్థానికత మార్చు

నికోబార్ ద్వీపాల గిరించిన ఆధారాలలో పురాతనమైనవి శ్రీలంక, పాలికి చెందిన బౌద్ధమత చారిత్రక గ్రంథాలలో ప్రస్తావించబడింది. దీపవంశ (కీ.శ 3-4 శతాబ్దం ), " ది మహావంశ " (కీ.శ 4-5 శతాబ్దం ) శ్రీలంక సామ్రాజ్య స్థాపకుని సంతానమైన విజయ ఈ ద్వీపాల మీద కాలుమోపాడు. విజయ ఈ ద్వీపాలను " నగ్గదీప" అని వర్ణించాడు.[1] ఆధునిక నామం అయిన " నక్కవరం " చోళ సామ్రాజ్యానికి చెందిన వారి నుండి లభించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఆధారాలు సా.శ. 1050లో తంజావూరు శిలాశాసనాలలో లభించాయి.[2][3][4] మార్కో పోలో (12 -13 శతాబ్దం) లో ఈ ద్వీపాలను "నెకువరన్ " అని పేర్కొన్నాడు.

కాలనీ సమయం మార్చు

ఐరోపా కాలనీ చారిత్రక ఆధారాల ద్వారా ఈ ద్వీపాల గురించి 1754-56 నుండి లభిస్తుంది. 1754 - 1756 లలో యురేపియన్లు ట్రాంక్యుబార్ (డానిష్ ఇండియా) ఈ జిల్లాను " ఫెడరిక్‌సొర్నె " అని పేర్కొంటూ పాలనా బాధ్యతలు నిర్వహించాడు. ట్రాంక్యుబార్ సహాయంతో మోరోవన్ చర్చికి చెందిన మిషనరీలు నాన్‌కౌరీ ద్వీపంలో ఒప్పందం ఏర్పరుచుకుని స్థిరపడ్డారు. అంటు వ్యాధుల కారణంగా వారంతా అధిక సంఖ్యలో మరణించారు. 1784 - 1807 వరకు మలేరియా భీతితో ఈ ద్వీపాలను వెలుపలి ప్రపంచం వారు బహిష్కరించారు. 1830 -1834 నాటికి ఈ ద్వీపాలలో పరిస్థితులు కొంత చక్కబడ్డాయి. 1778 -1783 మద్యకాలంలో విలియం-బోల్ట్స్ ఇక్కడ ఆస్ట్రియన్ కాలనీ స్థాపనకు ప్రయత్నించాడు. [5] 1868 అక్టోబరు 16న ఈ ద్వీపాలలో డెన్మార్క్ బ్రిటిష్ వారికి ఈద్వీపం మీద హక్కులు విక్రయించడంతో ఈ ద్వీపం మీద డెన్మార్క్ వారి ఆధిక్యం సమసిపోయింది. [5] బ్రిటిష్ ప్రభుత్వం 1869లో నికోబార్ ద్వీపాలను " బ్రిటిష్ ఇండియా " సామ్రాజ్యంలో భాగం చేసుకున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం మార్చు

రెండవ ప్రపంచ యుద్ధసమయంలో (1942 - 1945) మద్య కాలంలో ఈ ద్వీపాలను జపాన్ ఆక్రమించింది.

భారతీయ రాష్ట్రం మార్చు

1950లో భారతప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతాలలో అండనాన్ నికోబార్ ద్వీపాలు భాగం అయ్యాయి.

భౌగోళిక , జనాభా మార్చు

నికోబార్ దీవుల వైశాల్యం 1,840 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 36.842. నికోబార్ జిల్లా 3 వేరేవరు భాగాలుగా విభజించబడి ఉంది :   ' ఉత్తర గ్రూప్ ' :

  • కార్ నికోబార్ ( 126,9 చ.కి.మీ, 17.800 నివాసితులు)
  • బట్టిమలి ( 2,01 చ.కి.మీ., జనావాసాలు )

' సెంట్రల్ గ్రూప్ :

  • చౌరా లేదా శాన్‌ఎన్యో ( 8,2 చ.కి.మీ )
  • తెరసా ( నికోబార్ దీవులు ) లేదా ల్యూరూ ( 101,4 చ.కి.మీ)
  • బంపుకా లేదా పొయాహట్ ( 13,3 చ.కి.మీ )
  • కట్‌చల్ ద్వీపం ( 174,4 చ.కి.మీ )
  • కమోర్టా ద్వీపం ( 188,2 చ.కి.మీ )
  • నాన్‌కౌరీ ద్వీపం ( 66,9 చ.కి.మీ )
  • ట్రిన్‌కెట్ ద్వీపం ( వరకు 2004 86,3 చ.కి.మీ, సునామి తర్వాత ఉపరితలం తగ్గింది )
  • లౌక్ లేదా " ఐల్ ఆఫ్ మాన్ " ( 0,01 చ.కి.మీ. ) ( జనావాసాలు )
  • టిల్లాంగ్ చాంగ్ ( 16,84 చ.కి.మీ ) ( జనావాసాలు )

' దక్షిణ గ్రూప్ ' ( శాంబిలాంగ్ ):

  • గ్రేట్ నికోబార్ ( 1045,1 చ.కి.మీ., నికోబార్లు అతిపెద్ద దీవి; 2001 లో 9.440 నివాసులు )
  • లిటిల్ నికోబార్ ( 159,1 చ.కి.మీ; 430 నివాసులు )
  • కొండ్లు ( 4,6 చ. కిమీ ²; 2001 లో 150 మంది, 2004 లో ఖాళీ )
  • పులో మీలో ( మిలో ద్వీపం; 1,3 కిమీ ²; 150 నివాసులు )
  • మేరో ( 0,52 ), ట్రాక్ ( 0,26 ), ట్రియీస్ ( 0,26 ), మెంచల్ ( 1,30 ), కబ్రా ( 0,52 ), పావురం, మెగాపాడ్ ( 0,2 ) ( అన్ని జనావాసాలు )

గ్రేట్ నికోబార్ లోని ఇందిరా పాయింట్ ( 6 ° 45'10 " N , 93 ° 49'36 " E ) గ్రేట్ నికోబార్, భారతదేశాలకు దక్షిణ భాగం. ఇది సుమత్రా, ఇండోనేషియాలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

2004 డిసెంబరు 26 టి సునామి మార్చు

2004 డిసెంబరు 26న 10-15 మీటర్ల ఎత్తైన టీ సునామీ అలలు, తరువాత సంభవించిన భూకంపంతో నికోబార్ ద్విపాలు అతలాకుతలం అయ్యాయి. ఈ ప్రకృతి బీభత్సంలో అండమాన్, నికోబార్ ద్వీపాలలో దాదాపు 6,000 మంది ప్రజలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. కట్చ్ ద్వీపంలో మాత్రం సుమారు 4,600 మంది మరణించారు. పలు ద్వీపాలు ఘోరంగా ధ్వంసణ్ అయ్యాయి. కొన్ని ద్వీపాలు రెండు లేక మూడు భాగాలుగా చీలాయి. కోరల్ ఐలాండ్లు నీటిలో కొట్టుకు పోయాయి. తెరెస్సా ద్వీపం రెండుగా విడివడ్డాయి. ఈ ద్వీపాలు 100 మీటర్ల దూరం నెట్టివేయబడ్డాయి కొంతమంది భావించారు. 2004 డిసెంబరు 26న 4.25 నిమిషాలకు టీ సునామీ సంభవించిదని నివేదికలు తెలియజేస్తున్నాయి. లైట్ హౌస్ కూడా ధ్వంసం అయింది. తిరిగి లైట్ హౌస్ పనిచేయడం మొదలైంది. 2005 జూలై 24 నుండి " వికిన్యూస్: మేజర్ ఎర్త్‌క్వేక్ జోల్ట్స్ బంగ్ళాదేశ్ " నికోబార్ కేంద్రంగా ప్రసరించిన వార్తలలో భూకంపం రిక్టర్ స్కేల్ కొలతలో 7.2 ఉంటుందని వివరించింది. అయినప్పటికీ వాస్తవమైన మృతుల సంఖ్య వెలువడలేదు. 2009 నవంబరు 10న రిక్టర్ దేల్ కొలతలో మరొకమారు నికోబార్ ద్వీపాలలో భూకంపం సంభవించింది. 2010 జూన్ 12 న 19:26:50 సెకండ్లకు నికోబార్ ద్వీపాలలో రిక్టర్ స్కేల్ కొలతలో 7.7 పరిమాణంతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.

ప్రకృతి మార్చు

 
ఎ. నికోబార్ పావురం. నికోబార్ దీవుల పేరు పెట్టబడినప్పటికీ, ఇది మలయ్ ద్వీపసమూహంలో కూడా విస్తృతంగా కనిపిస్తాయి.

ఇండో-ఆస్ట్రేలియన్ కొలిషన్‌లో యురేషియాతో ఏర్పడిన " గ్రేట్ ఆఇలాండ్ ఆర్క్ "లో భాగంగా అండమాన్ నికోబార్ ద్వీపాలు ఏర్పడ్డాయి. కొలిషన్ హిమాలయాలను , ఇండోనేషన్ ద్వీపాలను కదిలిస్తూ అత్యంత పొడవైన ద్వీపావళిని ఏర్పరిచింది. అందులో బర్మాలోని ఆర్కన్‌యోమా పర్వతావళి, ది అండమాన్ , నికోబార్ ద్వీపాలు , సుమత్రా పడమటి తీరంలో ఉన్న బన్యాక్ ద్వీపాలు , మెంటవల్ ద్వీపాలు కూడా ఉన్నాయి.

పర్యావరణం మార్చు

నికోబార్ ద్వీపాలలో నులివెచ్చని ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉష్ణోగ్రత 22 నుండి 30°సె ఉంటుంది. ప్రతిసంవత్సరం వర్షాకాలంలో 3,000 - 3,800 మి.మీ వర్షపాతం ఉంటుంది. నికోబార్ సముద్రతీరాలలో సాధారణంగా మాన్‌గ్రోవ్ అరణ్యాలు , లోతట్టు ప్రాంతంలో సతతహరితారణ్యాలు , డెసిడస్ అరణ్యాలు ( వెడల్పైన పెద్ద పత్రాలు కలిగిన వార్షిక ఉష్ణమండల మొక్కలు ) ఉంటాయి. అదనంగా పలు ద్వీపాలలో విస్తారంగా పచ్చిక మైదానాలు ఉన్నాయి. అందువలన ఈ ద్వీపాలలో మనవులు ప్రవేశించడం మొదలైంది. నికోబార్ ద్వీపాలకు " టెర్రెస్ట్రియల్ ఎకోరీజన్ " అని ప్రత్యేక గుర్తింపు ఉంది. నికోబార్ వర్షాధార అరణ్యాలలో అనేక ఎకాలజీ జాతులు ఉన్నాయి. హిమయుగం సమయంలో సముద్రపు మట్టం తక్కూగా ఉన్నకాలంలో అండమాన్ ద్వీపాలు ఆగ్నేయాషియాతో అనుసంధానమై ఉన్నాయని భావిస్తున్నా అందుకు తగిన ఆధారాలు మాత్రం లేవు. నికోబార్ దీవులు ఎప్పుడూ ఖండంతో అనుసంధానించబడి లేవని భావిస్తున్నారు. సముద్రమట్టం తక్కువగా ఉన్న కాలంలో గ్రేటర్ నికోబార్ , లిటిల్ నికోబార్ ద్వీపాలకు ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉన్నాయి. నాన్‌కౌరీ, చౌరా, కట్చల్, ట్రింక, కమోర్టా , సమీపంలో ఉన్న చిన్నచిన్న ద్వీపాలకు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంది.

వరల్డ్ బయోస్ఫెర్ రిజర్వ్ మార్చు

2013 మే 31న యునెస్కో నికోబార్ దీవులను " వరల్డ్ బయోస్ఫేర్ రిజర్వ్ "గా గుర్తించింది. .[6]

ప్రయాణవసతులు మార్చు

  • విమనాశ్రయం: కార్ నికోబార్‌లో " కార్ నికోబార్ ఎయిర్ ఫోర్స్ బేస్ " పేరిట ఒక " ఎయిర్ స్ట్రిప్ " ఉంది. ఇది మలక్కా సమీపంలో ఆగ్నేయ నికోబార్‌లో ఉంది. అయినప్పటికీ ఇక్కడ వాణిజ్య అవసరాలకు ఉపకరించదు. గ్రేటర్ నికోబార్‌లోని తూర్పు సముద్రతీరంలో " కేంప్‌బెల్ బే/టెలెనా " వద్ద ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది.
  • నౌకాశ్రయం:- గ్రేటర్ నికోబార్‌లోని తూర్పు సముద్రతీరంలో " కేంప్‌బెల్ బే/టెలెనా " వద్ద ఒక నౌకాశ్రయం ఉంది. కార్ నిక్బార్ ఉత్తరదిశలో " కీటింగ్ పాయింట్ అండ్ మస్ " వద్ద చిన్న నౌకాశ్రయం ఉంది.

ఫ్లైట్ ఎం.ఎహ్ 370 మార్చు

నికోబార్ దీవులు ప్రపంచంలో దృష్టి నుండి దూరంగా ఉన్నప్పటికీ, మలేషియా ఎయిర్‌లైంస్ ఎం.ఎహ్.370 పడిపోయిన విషయంలో అధికారులు నికోబార్ దీవులలో ఆ విమానం పడిఉండవచ్చని భావిస్తున్నారు.[7][8]

మూలాలు మార్చు

  1. Wilhelm Geiger (Tr) (1912). The Mahavamsa or The Great Chronicle of Ceylon (PDF). Pali Text Society. ISBN 81-206-0218-8. Archived from the original (PDF) on 12 మే 2012. Retrieved 8 July 2013. P54 "The island where the children landed was called Naggadipa..." N: "l That is,'Island of children', from nagga 'naked'..."
  2. C Rasanayagam (1926). Ancient Jaffna. Asian Educational Society (reprint). ISBN 81-206-0210-2. P53 "Naggadipa, where the children are alleged to have landed, is certainly Nicobars, the Nakkavaram of the Tamils, ...
  3. John Keay (2001). India: A History. Grove Press. ISBN 978-0-8021-3797-5. ... and 'Nakkavaram' certainly represents the Nicobar islands ...
  4. The New Encyclopaedia Britannica. Encyclopaedia Britannica. 1998. ISBN 978-0-85229-633-2. Retrieved 2008-11-16. ... The name Nicobar probably is derived from Nakkavaram ("Land of the Naked") ...
  5. 5.0 5.1 Ramerini, Marco. "Chronoly of Danish Colonial Settlements". ColonialVoyage.com. Archived from the original on 2005-04-04.
  6. "Nicobar Islands declared as world biosphere reserve". The Times of India. 2013-05-31. Retrieved 31 May 2013.
  7. http://www.cnn.com/2014/03/14/world/asia/malaysia-airlines-plane/
  8. http://www.washingtonpost.com/blogs/worldviews/wp/2014/03/14/an-introduction-to-the-andaman-and-nicobar-islands-a-remote-indian-archipelago-now-part-of-the-hunt-for-mh370/

వెలుపలి లింకులు మార్చు