నీనా గుప్తా (జననం 1959 జూన్ 4) ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత. ఈమె 1994లో వో ఛోక్రీ అనే సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. ఈమె కమర్షియల్ సినిమాలలో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకుంది. ఈమె ది వీకెస్ట్ లింక్, కమ్‌జోర్ కడీ కౌన్ వంటి టి.వి.క్విజ్ ప్రోగ్రాములను నిర్వహించింది.[1]

నీనా గుప్తా
నీనా గుప్తా
నీనా గుప్తా
జననం (1959-06-04) 1959 జూన్ 4 (వయసు 64)
ఇండియా
వృత్తినటి, దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు1982–ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామివివేక్ మెహ్రా (2008–ప్రస్తుతం వరకు)
భాగస్వామివివియన్ రిచర్డ్స్ (?–1989)
పిల్లలుమసాబా గుప్తా

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఈమె ఢిల్లీలో జన్మించింది. తండ్రి పేరు ఆర్.ఎన్.గుప్తా. ఈమె ప్రాథమిక విద్య లారెన్స్ స్కూలులో చదివింది..[2]. ఈమె సంస్కృతంలో స్నాతకోత్తర పట్టాను పొందింది. అనంతరం ఎం.ఫిల్ కూడా సంపాదించుకుంది.

వృత్తి మార్చు

సినిమా రంగం మార్చు

ఈమె గాంధీ, ది డిసీవర్స్, మీర్జా గాలిబ్, ఇన్ కస్టడీ, కాటన్ మేరీ వంటి అంతర్జాతీయ సినిమాలలో నటించింది. గాంధీ సినిమాలో గాంధీ మేనకోడలి పాత్రను పోషించింది. ఈమె మాధురీ దీక్షిత్తో కలిసి ఖల్‌నాయక్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలోని ఛోళీకీ పీఛే క్యాహై అనే జనాకర్షకమైన పాటలో కనిపిస్తుంది. ఈమె లాజ్వంతి, బజార్ సీతారాం వంటి టెలీఫిల్ములను నిర్మించింది. బజార్ సీతారాం సినిమాకు 1993లో ఉత్తమ నాన్-ఫీచర్ విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

టెలివిజన్ రంగం మార్చు

ఈమె ఖాన్‌దాన్, మీర్జా గాలిబ్, భారత్ ఏక్ ఖోజ్, దర్ద్, గుమ్రాహ్, సాస్, సాత్ ఫెరె, చిట్టీ, మేరీ బీవీ కా జవాబ్ నహీ, కితనీ మొహబ్బత్ హై, సిస్కీ, జస్సీ జైసీ కోయీ నహీ, క్యూ హోతా హై ప్యార్, లేడీస్ స్పెషల్, దిల్ సే దియా వచన్, రిష్తే మొదలైన హిందీ టెలివిజన్ సీరియళ్లలో నటించింది. ఈమె నటుడు రాజేంద్ర గుప్తతో కలిసి సహజ్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి కొన్ని సీరియళ్లను, నాటకాలను నిర్మించింది.

వ్యక్తిగత జీవితం మార్చు

ఈమె 1980లలో ప్రముఖ వెస్ట్ ఇండీస్ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ను సంబంధం పెట్టుకుని మసాబ గుప్తా అనే కుమార్తెను కన్నది.[3] ఈమె అలోక్ నాథ్, సారంగ దేవ్‌లతో కూడా వివాహేతర సంబంధాలను కొనసాగించింది.[4] 2008లో ఢిల్లీలో స్థిరపడిన వివేక్ మెహ్రా అనే ఛార్టెడ్ అకౌంటెంట్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది.[5][6][7]

ఫిల్మోగ్రఫీ మార్చు

  • యే నజ్దీకియా (1982)
  • గాంధీ (1982)
  • సాథ్ సాథ్ (1982)
  • జానేభీ దో యారో (1983)
  • మండీ (1983)
  • ఉత్సవ్ (1984)
  • త్రికాల్ (1985)
  • దృష్టి (1990)
  • సుస్మన్ (1987)
  • రిహాయీ (1988)
  • ది డిసీవర్స్ (1988)
  • కారనామా (1990)
  • స్వర్గ్ (1990)
  • వాస్తుహార (1991) (మలయాళం)
  • ఆదిమీమాంస (1991)
  • మట్టి మనుషులు (1991) (తెలుగు)
  • అహం (1992) (మలయాళం)
  • జుల్మ్‌ కీ హుకూమత్ (1992)
  • బల్‌వాన్ (1992)
  • ఖల్‌నాయక్ (1993)
  • సూరజ్‌కీ సాత్వా ఘోడా (1993)
  • వీర్తా (1993)
  • వో ఛోక్రీ (1994)
  • నజర్ (1995)
  • జస్బాత్ (1994)
  • కాటన్ మేరీ (1999)
  • అంబేద్కర్ (2000) - అంబేద్కర్ భార్య రమాబాయి
  • తేరీ సంగ్ (2009)
  • వీర్ (2010)
  • నా ఘర్ నా ఘాట్‌కే (2010)
  • ఛేవన్ దరియా (2010)
  • గుడ్ బై (2022)

అవార్డులు మార్చు

మూలాలు మార్చు

  1. Bold and dutiful Archived 2011-09-25 at the Wayback Machine MALA KUMAR, The Hindu, 16 December 2005.
  2. Nisheeth Sharan’s "Grillopollis" hosts Sanawar’s reunion over its first preview Archived 2013-10-24 at the Wayback Machine dated 23 October 2010 at glamgold.com, accessed 11 March 2012
  3. Tribune
  4. Neena Gupta Interview with Vir Sanghvi on her relationships
  5. DNA newspaper
  6. Neena Gupta thrilled with marriage, but says "Masaba is priority" Archived 2015-06-11 at the Wayback Machine Sify.com, IANS, 29 July 2008.
  7. Neena Gupta opens up... TANVI TRIVEDI , TNN, The Times of India, 22 November 2008.
  8. "41st National Film Awards". International Film Festival of India. Archived from the original on 13 మార్చి 2016. Retrieved 3 March 2012.
  9. "41st National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 3 March 2012.

బయటి లింకులు మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు