నూకల నరోత్తమరెడ్డి

నూకల నరోత్తమరెడ్డి (ఎన్.నరోత్తమరెడ్డి) (1921 మార్చి 23 - 1984 మార్చి 14) ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగానూ, భారత రాజ్యసభ సభ్యునిగానూ తన సేవలనందించాడు. [1]

నూకల నరోత్తమరెడ్డి
నూకల నరోత్తమరెడ్డి

నూకల నరోత్తమరెడ్డి


పార్లెమెంటు సభ్యుడు

వ్యక్తిగత వివరాలు

జననం 23 మార్చి 1921
మానుకొండ, వరంగల్ జిల్లా
మరణం 14 మార్చి 1984
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సులోచనాదేవి
సంతానం 3 కుమారులు
మతం హిందూ

జీవిత విశేషాలు మార్చు

అతను 1921 మార్చి 23న వరంగల్ జిల్లా మానుకొండ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి రంగారెడ్డి. అతను శ్రీమతి సులోచనాదేవిని వివాహమాడాడు. వారికి ముగ్గురు కుమారులు. అతను ఎం.ఎ చేసాడు. అతను గోలకొండ పత్రిక కు సంపాదకునిగా పనిచేసాడు.

అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా చేరాడు. 1956లో హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగానూ, 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యునిగానూ ఉన్నాడు. అతను 1956 ఏప్రిల్ 2 నుండి 1960 మార్చి 15 వరకు, 1962 ఏప్రిల్ 3 నుండి 1968 ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు.

అతను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రెండు దశాబ్దాలుగా సిండికేట్ సభ్యునిగా ఉన్నాడు. 1972 నుండి9 1975 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కూడా పనిచేసాడు.[2]

అతను ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీకి చైర్మన్ గానూ, జాతీయ లలిత కళా అకాడమీకి జనరల్ కౌన్సిల్ సభ్యునిగా కూడా పనిచేసాడు.

అతను 1984 మార్చి 14న మరణించాడు.

మూలాలు మార్చు

  1. Reddy, N. Narotham at Rajya Sabha website.
  2. Narotham Reddy, Nookala, Luminaries of 20th Century, Part I, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp: 280.