నృత్యరూపకల్పనను ఆంగ్లంలో కోరియోగ్రఫీ అంటారు. కోరియోగ్రఫీ అనేది సన్నివేశాలకు సంబంధించిన కదలికలను రూపకల్పన చేసే ఒక కళ. ఇది చలనం, రూపం లేదా రెండింటికి సంబంధించిన కళగా పేర్కొనవచ్చు. కోరియోగ్రఫీ స్వయంగా నృత్యాన్ని రూపకల్పన చేసుకోవడాన్ని కూడా సూచిస్తుంది. ఈ కొరియోగ్రఫీ అనే పదం వృత్తాకార నృత్యం, రచన అనే అర్ధాలనిచ్చే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది, సాహిత్యపరంగా దీని అర్థం నృత్య రచన. నృత్య రూపకర్త నృత్యరూపకల్పన యొక్క కళను సాధన చేయుట ద్వారా నృత్యరూపకాలను సృష్టిస్తాడు. ఈ కొరియోగ్రఫీ అనే పదం మొదటిసారి 1950 లో అమెరికన్ ఇంగ్లీష్ నిఘంటువులో కనిపించింది, కొరియోగ్రాఫర్ అనే పదం మొదటిసారి 1936 లో On Your Toes అనే బహిరంగ ప్రదర్శన ఇచ్చిన George Balanchine ని వరించింది. దీనికి ముందు వేదిక, చిత్రాలలో నృత్యరూపకల్పనను సూచించేందుకు పదబంధాలుగా బృంద ప్రదర్శన by, నృత్య ప్రదర్శన by, లేదా సాధారణంగా నృత్యాలు by వంటి పదాలతో కొరియోగ్రాఫర్‍ను సూచించేవారు.

భారతీయ నృత్య రూపకల్పన


ఇవి కూడా చూడండి మార్చు

కొరియోగ్రాఫర్

సమకాలీకరించబడిన ఈత

బయటి లింకులు మార్చు