నేతాజీ జయంతి - అధికారికంగా పరాక్రమ్ దివస్ అని పిలుస్తారు.[1] ఇది ఒక ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్[2][3] పుట్టినరోజు సందర్భంగా యావత్ భారతదేశంలో జరుపుకునే జాతీయ కార్యక్రమం. ఇది ఏటా జనవరి 23న జరుపుకుంటారు.[4][5] భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. అతను ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్) అధిపతి.[6][7]

నేతాజీ జయంతి
నేతాజీ జయంతి
అధికారిక పేరుపరాక్రమ్ దివస్
జరుపుకొనేవారుభారతదేశం
రకందేశభక్తి
ప్రాముఖ్యతభారత స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ పాత్ర
జరుపుకొనే రోజు23 జనవరి
వేడుకలుచారిత్రక వేడుకలు
ఆవృత్తిప్రతి ఏటా

1879లో జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో జానకీ నాథ్, ప్రభావతీ బోస్‌లకు నేతాజీగా గుర్తింపు పొందిన సుభాష్ చంద్రబోస్ జన్మించారు. చిన్నతనం నుంచి విద్యలో రాణించాడు. రామకృష్ణ పరమహసం, స్వామి వివేకానందుడి మార్గంలో పయనించి సన్యాసం తీసుకోడానికి తీర్మానించాడు. వారు ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగాడు. జాతీయ కాంగ్రెస్‌లో చేరి దేశ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నాడు. బ్రిటిష్‌ ‌వారిని తరిమికొట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంగ్లాండ్‌ ‌వ్యతిరేకులను కలసి ఒక ఐక్యకార్యాచరణ కార్యక్రమానికి ప్రయత్నం చేసాడు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ సంస్థను స్థాపించి ఆర్మీని ఏర్పాటు చేసాడు. స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటీష్‌ ‌కు వ్యతిరేఖంగా జైళుకు వెళ్లిన బోస్‌, 1936‌లో దేశ బహిష్కరణకు కూడా గురయ్యాడు.

1945లో ఆగ‌స్ట్ 18న తైపీలో జ‌రిగిన విమాన ప్రమాదంలో అనూహ్య రీతిలో సుభాష్ చంద్రబోస్ మ‌ర‌ణించినట్లు భావిస్తున్నారు. నేతాజి అదృశ్యం పై నేటికీ వివాదం కొన‌సాగుతూనే ఉంది.

కార్యక్రమాలు మార్చు

నేతాజీ సుభాస్ చంద్రబోస్ అదృశ్యమైన సుమారు 5 నెలల తర్వాత, నేతాజీ జయంతిని రంగూన్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఇది భారతదేశం అంతటా సాంప్రదాయంగా మారింది. పశ్చిమ బెంగాల్,[8]జార్ఖండ్,[9]త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో ఇది అధికారిక సెలవుదినం. ఈ రోజున భారతావని నేతాజీకి నివాళులర్పిస్తుంది. 2021లో ఆయన 125వ జయంతి సందర్భంగా మొదటిసారిగా నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా జ‌రుపుకోవాలని భార‌త ప్ర‌భుత్వం ప్రకటించింది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Government announces 23rd January to be celebrated as "PARAKRAM DIWAS' every year | DD News". ddnews.gov.in. Retrieved 2021-01-23.
  2. David Gellner (10 September 2009). Ethnic Activism and Civil Society in South Asia. SAGE Publications India. p. 37. ISBN 9788132104223.
  3. Buddhadeb Ghosh; Bidyut Mohanty; Nitya Jacob (2011). Local Governance: Search for New Path. Concept Publishing Company. p. 190. ISBN 9788180697173.
  4. "Netaji Subhas Chandra Bose Jayanti 2020: Famous Quotes by Valiant Leader". News18 (in ఇంగ్లీష్). 23 January 2020. Retrieved 31 October 2020.
  5. "Subhas Chandra Bose Birth Anniversary: India will always remain grateful to Subhas Chandra Bose: PM – The Economic Times". m.economictimes.com. Retrieved 31 October 2020.
  6. Aryya, Manavati (2007). Patriot, the Unique Indian Leader Netaji Subhas Chandra Bose: A New Personalised Biography. Lotus Press. ISBN 9788183821087.
  7. "A biographical sketch of Netaji Subhash Chandra Bose!". www.culturalindia.net (in ఇంగ్లీష్). Retrieved 8 November 2020.
  8. "Jan 23 to be observed as Desh Prem Divas". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 14 January 2021.
  9. "Netaji Subhas Chandra Bose birth anniversary declared public holiday again in Jharkhand". The Statesman. 23 January 2020. Retrieved 5 November 2020.