నేను నా రాక్షసి అనేది దగ్గుబాటి రానా హీరోగా 2011 లో విడుదలయిన చిత్రం. ఈ సినిమాలో ఇలియానా కథానాయక. ఈ సినిమా షుటింగ్ పూర్తి చేసుకొని 29 ఏప్రిల్ 2011 న విడుదల అయ్యింది. ఈ చలన చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేక పోయింది.

నేను నా రాక్షసి
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం పూరీ జగన్నాధ్
నిర్మాణం నల్లమలపు శ్రీనివాస్
కథ పూరీ జగన్నాధ్
చిత్రానువాదం పూరీ జగన్నాధ్
తారాగణం దగ్గుబాటి రానా, ఇలియానా
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేదీ 29 ఏప్రిల్ 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

అభిమన్యు (రాణా) ప్రొఫెషనల్ కిల్లర్.మీనాక్షి (ఇలియానా)ఆత్మహత్యలు చేసుకునే వారి చివరి మాటలను వీడియో తీసి 'ఇట్స్ మై లైఫ్ బాస్'పేరుతో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.ఇక అభి,మీనాక్షి ఓ రోజు అనుకోని పరిస్ధితుల్లో కలుస్తారు.వెంటనే ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిన అభి ఆమె వెనక రెగ్యులర్ తన పనులన్నీ ప్రక్కన పెట్టి మరీతిరుగుతూంటాడు.మరో ప్రక్క యూ ట్యూబ్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సి.ఐ విక్రమ్ (సుబ్బరాజు)ఎవరు ఈ పని చేస్తున్నారంటూ ఎంక్వైరీ ప్రారంభిస్తాడు.కధ నడుస్తూండగా అంతవరకూ కోమాలో ఉన్న అభి తల్లి చనిపోతుంది. దాంతో జీవితం మీద విరక్తికలిగి ఆత్మ హత్య చేసుకోవాలని తన వీడియో కూడా తీసి యూట్యూబ్ లో పెట్టమని ఆమెనే పిలుస్తాడు.అప్పుడేం జరిగింది.అభి ఆత్మహత్య చేసుకున్నాడా.?సిఐ విక్రమ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు.?అభి ప్రొఫెషనల్ కిల్లర్ గా మారటానికి కారణమేంటి.? అనేది తెలుసుకోవాలని సినిమా చూడాల్సిందే.[1]

తారాగణం మార్చు

  1. రానా దగ్గుబాటి (అభి)
  2. ఇలియానా (మీనాక్షి)
  3. ముమైత్ ఖాన్
  4. అభిమన్యు సింగ్ (గ్యాంగ్ స్టార్ రత్నం)
  5. సుబ్బరాజు (పోలీస్ విక్రమ్)
  6. కోట శ్రీనివాసరావు (విశ్వనాథ్)
  7. కౌశల్
  8. ఆలీ
  9. సూర్య
  10. నాగినీడు
  11. జనార్ధన

పాటలు మార్చు

Track list
సం.పాటపాట రచయితArtist(s)పాట నిడివి
1."మల్లి మల్లి మేరుపుల" (సంగీతం రెహమాన్)Rehmanశంకర్ మహదేవన్04:19
2."పడితినమ్మో" (సంగీతం విశ్వ)Viswaవిశ్వ04:30
3."మీనచ్చి" (సంగీతం విశ్వ)Viswaవిశ్వ, గీతామాధురి, రాహుల్04:10
4."పాపం పుణ్యం" (సంగీతం రెహమాన్)Rehmanపేదల హేమచంద్ర, భార్గవి పిళ్ళై04:27
5."నేను రాక్షసి టైటిల్ సాంగ్" (సంగీతం అనూప్ రూబెన్స్)instrumentalinstrumental01:56
Total length:19:25

మూలాలు మార్చు

  1. Srikanya (2011-04-29). "నేను..నా చావు (నేను నా రాక్షసి రివ్యూ)". telugu.filmibeat.com. Retrieved 2020-07-20.