నోక్‌లాక్ జిల్లా

నాగాలాండ్ రాష్ట్రంలోని ఒక జిల్లా.

నోక్‌లాక్ జిల్లా, నాగాలాండ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. 2017, డిసెంబరు 21న రాష్ట్ర 12వ జిల్లాగా ఏర్పడింది. ఈ జిల్లా ప్రధాన కార్యాలయం నోక్‌లాక్ పట్టణంలో ఉంది.[1] ఇది కొండ ప్రాంతంలో విశాలమైన అడవులతో ఉంది.

నోక్‌లాక్ జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatనోక్‌లాక్
Area
 • Total1,152 km2 (445 sq mi)
Population
 (2011)
 • Total59,300
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

భౌగోళికం మార్చు

రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో ఇది అతిచిన్న జిల్లా. ఇది 1,152 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది.[2] ఇక్కడ వర్షాకాలంలో వాతావరణం ఉప-ఉష్ణమండలంగా ఉంటుంది.[1]

చరిత్ర మార్చు

తుఏన్‌సాంగ్ జిల్లాలో ఉపవిభాగంగా ఉన్న నోక్‌లాక్ ప్రాంతం 2017, డిసెంబరు 21న నాగాలాండ్ 12వ జిల్లాగా ఏర్పడింది.[3] నోక్‌లాక్ ఉపవిభాగంలో నోక్‌లాక్, తోనోక్న్యు, నోఖు, పాన్సో, చింగ్మీ అనే ఐదు పరిపాలన పరిధిలు ఉన్నాయి.[4][5] నోక్‌లాక్, పాన్సో పట్టణాల్లో పోలీస్ స్టేషన్లు, తోనోక్న్యు వద్ద ఒక పోలీసు కేంద్రం ఉన్నాయి.[6] నోక్‌లాక్ జిల్లాలో రెండు గ్రామీణాభివృద్ధి బ్లాక్‌లు (ఆర్‌డి బ్లాక్‌లు) ఉన్నాయి.[1][7]

జనాభా మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నోక్‌లాక్ పట్టణంలో 19,507 జనాభా ఉంది.[1] ఈ మొత్తం జనాభాలో సుమారు 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో 98% మంది షెడ్యూల్డ్ తెగలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 77% గా ఉండగా, ఇందులో 79% మంది పురుషులు, 74% మంది స్త్రీలు ఉన్నారు.[2] ఇక్కడివాళ్ళలో ఎక్కువమంది ఖిమ్నియుంగన్ తెగకు చెందినవారు ఉన్నారు.[8]

మతం మార్చు

ఇక్కడి ప్రజలలో 98.5% మంది క్రైస్తవ మతానికి చెందినవారు ఉన్నారు. ఇతరులలో హిందూమతానికి చెందినవారు 0.7% మంది, ఇస్లాంమతానికి చెందినవారు 0.5% మంది, బౌద్ధమతానికి చెందినవారు 0.2% మంది, మరికొంత మంది సిక్కుమతానికి చెందినవారు ఉన్నారు.

పట్టణాలు, గ్రామాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ ఉపవిభాగం 39 గ్రామాలను కలిగివుండి, నాలుగు అడ్మిన్ పరిధిలో విస్తరించి ఉంది.

పరిధి జనాభా[1] ప్రాంతం
కిమీ 2 [9]
గ్రామాలు మూలం
నోక్‌లాక్ 19,507 164.92 నోక్‌లాక్ పట్టణం (7,674), నోక్‌లాక్ గ్రామం (4,205), కొత్త పాంగ్షా (2,575), నోక్యాన్ (1,542), పాత పాంగ్షా (1,121), వాన్సోయి (924), డాన్ (636), కుసాంగ్ (467), నోక్యాన్ బి (363).
తోనోక్న్యు 18,600 491.36 సాంగ్లావ్ (3,881), పెషు (3,447), చిపూర్ (2,973), తోనోక్న్యు పట్టణం (1,485), పాంగ్ (1,174), కెంజోంగ్ (1,035), తోనోక్న్యూ గ్రామం (923), చిల్లిసో (839), తోక్సూర్ (757), వుయ్ (756), కొత్త సాంగ్లావ్ (331), థాంగ్సోన్యు (296), థాంగ్ట్సౌ (239), జెజికింగ్ (238), పెషు నోక్యా (226).
నోఖు 6,291 218.94 చోక్లాంగన్ (2,027), నోఖు గ్రామం (1,875), లాంగ్నోక్ (1,307), అనియాషు (568), నోఖు పట్టణం (306), కింగ్‌పావ్ (148), కెంకింగ్ (60).
పాన్సో 11,036 148.33 పాత్సో నోకెంగ్ (2,880), పాత్సో (2,117), లెంగ్న్యు (1,255), యోకావో (1,083), పాన్సో హెచ్క్యూ (1,063), కింగ్నియు (1,026), సువావో (901), ఎఖావో (390), త్సాంగ్కోయి (213) ).
చింగ్మీ 3,866 128.79 చింగ్మీ పట్టణం (1,685), చెండాంగ్ సాడిల్ (801), వాషు (512), యింపాంగ్ (387), తక్న్యు (309), చింగ్మీ పట్టణం (172)
మొత్తం 59,300 1,152

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "District Census Handbook, Tuensang" (PDF). Census of India. 16 June 2014. p. 25.
  2. 2.0 2.1 "Noklak Taluk Population Tuensang, Nagaland, List of Villages & Towns in Noklak Taluk". Census of India. 2017.
  3. "Noklak is Nagaland's youngest district". Eastern Mirror. 21 December 2017. Archived from the original on 24 జూలై 2019. Retrieved 3 జనవరి 2021.
  4. "News Press Releases 06 08 2012". Government of Nagaland. 6 August 2012. Noklak Sub-Division which comprises of 37 recognized villages and 8 un-recognized villages and 5 Administrative headquarters namely Noklak ADC, Thonoknyu SDO, EAC Hqs are Panso, Nokhu and Chengmei
  5. "District Disaster Management Plan, Tuensang" (PDF). Nagaland State Disaster Management Authority. November 2011. p. 17. Archived from the original (PDF) on 2017-02-17. Retrieved 2021-01-03.
  6. "Tuensang District Profile". tuensang.nic.in.
  7. "List of Polling Stations" (PDF). Government of Nagaland. pp. 19, 23. Archived from the original (PDF) on 2017-12-23. Retrieved 2021-01-03.
  8. "Nagaland upgrades Noklak sub-division into district". India Today. 21 December 2017.
  9. "Tuensang District Population, Nagaland, List of Taluks in Tuensang". Censusindia2011.com.

ఇతర లంకెలు మార్చు