పంచ్‌కులా

హర్యానా రాష్ట్రం లోని నగరం

పంచకులా హర్యానా రాష్ట్రం లోని నగరం. ఇది అంబాలా రెవెన్యూ విభాగంలో భాగమైన పంచకులా జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం. ఐదు నీటిపారుదల కాలువలు కలిసే ప్రదేశం కావడం వలన దీనికి పంచకులా పేరు వచ్చింది. ఇది చండీగఢ్, మొహాలి, జిరాక్‌పూర్‌లకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉంది. ఇది చండీగఢ్ నుండి సుమారు 4 కి.మీ., సిమ్లా నుండి 105 కి.మీ. అంబాలా నుండి 44 కి.మీ., జాతీయ రాజధాని న్యూ ఢిల్లీ నుండి 259 కి.మీ. దూరంలో ఉంది. ఇది గ్రేటర్ చండీగఢ్ లోని భాగం. చండీగఢ్, మొహాలీ, పంచ్‌కులాలను కలిపి చండీగఢ్ ట్రైసిటీ అంటారు. దీని ఉమ్మడి జనాభా 20 లక్షలకు పైబడి ఉంటుంది.

పంచ్‌కులా
నగరం
మాతా మానసా దేవి ఆలయం లోని యజ్ఞశాల
మాతా మానసా దేవి ఆలయం లోని యజ్ఞశాల
Nickname: 
చండీగఢ్ ట్రైసిటీ
పంచ్‌కులా is located in Haryana
పంచ్‌కులా
పంచ్‌కులా
హర్యానా పటంలో పంచ్‌కులా స్థానం
Coordinates: 30°44′N 76°48′E / 30.74°N 76.80°E / 30.74; 76.80
దేశం India
రాష్ట్రంహర్యాణా
జిల్లాపంచ్‌కులా
Government
 • BodyMunicipal Corporation Panchkula
Area
 • 32.6 km2 (12.6 sq mi)
Elevation
365 మీ (1,198 అ.)
 2011 జనగణన
భాషలు
 • అధికారికహిందీ, పంజాబీ
Time zoneUTC+5:30 (IST)
PIN
134 109 - 134 116
టెలిఫోన్ కోడ్+91-172-XXX-XXXX

ఈ నగరంలో భారత సైన్యపు వెస్ట్రన్ కమాండ్ యొక్క ప్రధాన కార్యాలయమైన చండీమందిర్ కంటోన్మెంట్ ఉంది. 2011 లో పంచకులా నగర జనాభా 2,11,355, ఇందులో పురుషులు 1,11,731, స్త్రీలు 99,624. ఇది చండీగఢ్ లాగా సెక్టార్లుగా అభివృద్ధి చేసిన ప్రణాళికాబద్ధమైన నగరం.

పేరు వ్యుత్పత్తి మార్చు

నగరం పేరు పంచ (సంస్కృతంలో ఐదు), కులా (సంస్కృతంలో కాలువలు ) నుండి వచ్చింది. పంచకులా అంటే "5 కాలువల నగరం". బహుశా ఈ పేరు ఘగ్గర్-హక్రా నది నుండి నీటిని పంపిణీ చేసే ఐదు నీటిపారుదల కాలువలను సూచిస్తుంది.[2]

చరిత్ర మార్చు

అంబాలా-కల్కా రహదారి చండీగఢ్ రహదారితో కలిసే కూడలి వద్ద ఉన్న పంచకులా గ్రామం పేరే ఈ నగరానికి పేరు పెట్టారు. ఈ నగరాన్ని 1970 లలో హర్యానా రాష్ట్రం ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసింది. పంచకులాను హర్యానాకు రాజధానిగా చెయ్యాలని తొలుత భావించారు.

రామ్‌గఢ్ కోట మార్చు

రామ్‌గఢ్ కోటను కహ్లూర్ రాజ్యానికి చెందిన రాజపుత్ర పాలకులు నిర్మించారు. దీని ప్రధాన కార్యాలయం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్. బిలాస్‌పూర్ రాజు 360 సంవత్సరాల క్రితం రామ్‌గఢ్ కోటను నిర్మించాడు.[3] 1687 లో, భంగాని యుద్ధం తరువాత గురు గోవింద్ సింగ్ తన సైన్యాన్ని పావోంటా సాహిబ్ నుండి ఆనందపూర్ సాహిబ్‌కు తరలిస్తున్నపుడు దాని పాలకులు అతనికి గుర్రం, కత్తి, 5,00,000 రూపాయలు ఇచ్చారు. 1750 లలో, ఇది చివరికి సిర్మూర్ రాజ్యానికి సామంత రాజ్యంగా మారిపోయింది. మళ్ళీ 1804 లో స్వతంత్రమైంది. ఇది ప్రస్తుతం బిలాస్‌పూర్ రాజు సంగర్ చంద్ (పాలనా కాలం:1197-1220) చిన్న కుమారుడు కాలే చంద్ వారసుల చేతిలో ఉంది. ఈ కోటలో వారు ఒక వారసత్వ హోటలు నడుపుతున్నారు

భౌగోళికం, వాతావరణం మార్చు

పంచకులా జిల్లాలో ఉప-ఉష్ణమండల ఖండాంతర రుతుపవన శీతోష్ణస్థితి ఉంది. బాగా వేడిగా ఉండే వేసవి, చల్లని శీతాకాలం, మంచి రుతుపవనాల వర్షపాతం ఇక్కడి విశేషం. సంవత్సరంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు -1 °C నుండి 43 °C వరకు మారతాయి. కొన్నిసార్లు డిసెంబరు జనవరిలలో మంచు కురుస్తుంది. కొన్నిసార్లు శీతాకాల వర్షాలు కూడా వస్తాయి. వర్షపాతం ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. మోర్ని కొండలు జిల్లా లోనే కాక, మొత్తం రాష్ట్రం లోనే ఎత్తైన ప్రదేశం. ఘగ్గర్ మాత్రమే జీవ నది. ఇది వర్షాకాలం తప్పించి మిగతా కాలాల్లో చాలా తక్కువ లోతు ఉంటుంది. కసౌలి పర్వతాలు పంచకులా నుండి స్పష్టంగా కనిపిస్తాయి.

జనాభా వివరాలు మార్చు

పంచ్‌కులాలో మతం[4]
మతం శాతం
హిందూ మతం
  
91.30%
సిక్కు మతం
  
5.00%
ఇస్లాం
  
2.30%
ఇతరాలు
  
1.40%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నగర ప్రజలు ప్రధానంగా పంజాబీ హిందువులు, గణనీయమైన సంఖ్యలో సిక్కులు, ముస్లింలు ఉన్నారు.[4] హిందీ మాట్లాడే హర్యానాలో భాగమైనప్పటికీ, నగర జనాభాలో బహుళత్వం వలన ఎక్కువగా పంజాబీయే మొదటి భాషగా మాట్లాడుతారు.[5]

2011 లో పంచకులా నగరంలో 48,772 ఇళ్ళు ఉన్నాయి. జనాభా 2,11,355, వీరిలో పురుషులు 1,11,731 స్త్రీలు 99,624.[6]

పట్టణ ప్రముఖులు మార్చు

  • వేద్ ప్రకాష్ మాలిక్ - భారత సైన్యపు ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ [7]
  • ఆయుష్మాన్ ఖురానా - భారతీయ నటుడు, గాయకుడు టెలివిజన్ వ్యాఖ్యాత

ప్రస్తావనలు మార్చు

  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
  2. "Haryana Review 2013, page 30" (PDF). Archived from the original (PDF) on 8 May 2016. Retrieved 18 April 2016.
  3. Haryana Samvad Archived 29 నవంబరు 2018 at the Wayback Machine, Oct 2018, p38-40.
  4. 4.0 4.1 http://www.census2011.co.in/census/city/29-panchkula.html
  5. The total population of Panchkula as of 2020 is 6.27 lakhs "Badal wants back Punjabi speaking areas of Haryana from new BJP govt - Times of India". The Times of India. Retrieved 2018-11-28.
  6. "Census of India Haryana Town Amenities (Excel Row 5)". Census of India Website. Retrieved 15 September 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Panchkula: 'City of Generals' gets 2 more after 'farewell to arms'". The Times of India. Retrieved 2017-01-17.