పంజాబీ వంటకాలు

పంజాబీ ప్రాంతాల సంప్రదాయక ఆహారం

పంజాబీ వంటకాలు  భారత్పాకిస్థాన్ దేశాల్లో విస్తరించిన  పంజాబీ ప్రాంతాల సంప్రదాయక ఆహారం. తందూరీ తరహా వంట తయారీ ఈ వంటకాల్లోని  ప్రత్యేక  విధానం. ఈ విధానం ప్రస్తుతం భారత్ లోని మిగిలిన ప్రదేశాల్లోనే కాక, యుకె, కెనెడా వంటి ఇతర దేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. పురాతన సింధూ లోయ నాగరికతలోని జీవినవిధానం, వ్యవసాయ ప్రభావం ఈ ప్రాంతపు వంటకల్లో చాలా ఉంటుంది. ఈ వంటకాల్లో  ప్రాంతీయ  ప్రధాన  పంటలు  కీలకపాత్ర  పోషిస్తాయి.  శాకాహారమైనా, మాంసాహారమైనా  వెన్న  ఎక్కువగా  వాడటంతో  ఈ వంటలు  చాలా  రుచికరమైనవిగా  ప్రసిద్ధి చెందాయి.  సర్సాన్ డా సాగ్,  మక్కీ డీ రోటీ  వంటకాలు వీరి ప్రధాన వంటలు.

పంజాబీ మాంసాహార వంటల్లో చికెన్ టిక్కా ప్రసిద్ధమైన వంటకం.
పాకిస్థానీ పంజాబీ వంటకాలు; ఎడమ నుంచి కుడి:ఆలూ గోబీ, సీఖ్ కబాబ్, బీఫ్ కరాహీ
మింట్ పరాటా
పంజాబీ లస్సీ

పంజాబీ వంటకాల్లో బాస్మతీ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తాయి.  అన్నంతో చేసే  వంటల్లో  ఎక్కువగా  బాస్మతీ బియ్యాన్నే  వాడతారు  ఈ ప్రాంతం  వారు. పంజాబీలో వండిన బియ్యాన్ని "చోల్" అంటారు. చాలా శాకాహార, మాంసాహార వంటల్లో ఈ బియ్యం రుచి పెంచుతుందని చెప్తుంటారు పంజాబీలు. అందుకే ఈ బియ్యాన్ని ఎక్కువగా వాడుతుంటారు.[1][2][3]

వండే శైలి మార్చు

పంజాబీ వంటకాల తయారీలో చాలా శైలులున్నాయి. పంజాబ్ పల్లెటూర్లలో ఇప్పటికీ సంప్రదాయ వంట వస్తువులనే ఉపయోగిస్తారు. చెక్క, రాతి పొయ్యిల్లోనే చాలా వంటలు చేస్తుంటారు. చాలా వంటకాలను తందూరీ పద్ధతిలో తయారు చేస్తుంటారు. ఇదే ఇప్పుడు తందూర్గా ప్రసిద్ధి చెందింది.[4] తందూరీ తయారీ పద్ధతి పంజాబ్ నుండే దేశంలోనే ఇతర ప్రాంతాలకు తరలింది.[5] మిగిలిన ప్రాంతాల్లోనూ నేరుగా మంటపై కూరగాయలను కాల్చి వంటలు తయారు చేసినా పూర్తిస్థాయిలో తందూరీ పద్ధతిని వాడేది మాత్రం పంజాబీ వంటకాల్లోనే.[6] 1947 తరువాత దేశం విడిపోయినప్పుడు పంజాబీలు ఢిల్లీ వంటి  ఇతర  ప్రాంతాలలో  స్థిరపడినప్పుడు  వీరి తయారీ  విధానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.[7] పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక తందూర్లు ఉంటాయి.[8][9] వీటిని పంజాబీ భాషలో "కఠ్ తందూర్" అంటారు.[10]

ప్రధాన పంటలు మార్చు

గోధుమలు, బియ్యం, పాల ఉత్పత్తులకు పంజాబ్ ప్రధాన ఉత్పత్తిదారు. ఈ పంటల ఉత్పత్తులే పంజాబీలకు ప్రధాన ఆహారం. పంజాబ్ రాష్ట్రం పాల ఉత్పత్తుల వాడకంలో మొదట నిలుస్తుంది.[11] అందువల్లే పంజాబీ వంటకాల్లో పాల ఉత్పత్తులకు పెద్ద పీట వేస్తారు.

పాల ఉత్పత్తులు మార్చు

పంజాబీ వంటకాల్లో  నెయ్యి, పొద్దుతిరుగుడు నూనెపనీర్వెన్న  ఎక్కువగా వాడతారు. పంజాబ్ లోని ఉత్తర గ్రామీణ ప్రాంతాల్లో పనీర్ వంటి మరో పాల పదార్థం ధాగ్ ను తయారు చేస్తుంటారు. కానీ ఈ రకమైన చీజ్ పదార్ధాన్ని తయారు చేయడం ఇప్పుడు బాగా తగ్గిపోయింది.

మసాలాలు మార్చు

సాధారణంగా ఆహారంలో రుచి పెంచడానికి మసాలాలను, పోపులను వాడతారు. పాశ్చాత్య వంటకాల్లో వెనిగర్ ప్రధాన అదనపు పదార్థం. స్వీట్లలో ఫుడ్ కలర్ అదనపు పదార్థంగా ఎక్కువ వాడతారు. సాధారణంగా నల్ల మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతి ఆకులను మసాలాలుగా వాడుతుంటారు. దక్షిణ ఆసియా వంటకల్లో పచ్చళ్ళను, రకరకాల మసాలా గుజ్జులను ఎక్కువగా వాడుతుంటారు.

సాధారణ వంటలు మార్చు

అల్పాహారం మార్చు

 
వెన్నతో ఆలూ పరాటా

పంజాబ్ లో ప్రాంతాలను బట్టీ అల్పాహారాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా చనా మసాలా, చోలే, పరాటా/ఆలూ పరాటా, హల్వా పూరీ,[12] భటూరా, ఫలూదా, మఖనీ దూద్, అమృత్ సరీ లస్సీ, మసాలా చాయ్, టీ, అమృత్ సరీ కల్చస్, ఫానీస్, దహీ వడా, దహీ, ఖోయా, పాయా వంటి వంటకాలు ఎక్కువగా ఫలహారంగా తీసుకుంటుంటారు. 

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలో లాహోరీ కట్లమా అనే ఫలహారం చాలా ప్రఖ్యాతం.[13]

మాంసం మార్చు

కోడి, గొర్రె, మేక మాంసాలు ఎక్కువగా తింటుంటారు పంజాబీలు. పంది, గొడ్డు మాంసాలు తినడం తక్కువే. భారత్ లోని పంజాబ్ ప్రాంతాల్లో మత నిషేధాలు, నమ్మకాల దృష్ట్యా ఆవు మాంసం అసలు తినరు. పాకిస్థాన్ పంజాబ్ లోనూ మత నిషేధాలతో పంది మాంసం స్వీకరించరు. పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఆవు మాంసం కన్నా గేదె మాంసం ఎక్కువగా దొరుకుతుంది. కొన్ని మాంసం వంటకాలు:

 
Tandoori Chicken
  • బిర్యానిగొర్రెకోడి, గొడ్డు మాంసాల రకాలు.
  • కబాబ్: గొర్రె మంసపు ముక్కలు, గొడ్డు మాంసం, నాన్ తో ఎక్కువగా తింటారు.
  • ఖీమా: గొర్రె మాంసపు ముక్కలు, గొడ్డు మాంసం.
  • గొర్ర్రె: రోగన్ గోస్ట్, భునా గోస్ట్,[14] కడాయ్ గోస్ట్, రాన్ గోస్ట్, దాల్ గోస్ట్, సాగ్ గోస్ట్, నిహారీ గోస్ట్, పాయే డా షోర్బా
  • షామీ కబాబ్, చికెన్ కర్హి, అమృత్ సరీ తందూరీ చికెన్,[14] పంజాబీ కర్హీ(చికెన్ పెరుగు కర్రీ),[15]  బటర్  చికెన్ చికెన్ టిక్కా, పాయే.
  • కున్నా వంటపాత్ర(మట్టి పాత్ర)లో తయారు చేసే కున్నా గోస్ట్ మీట్.

పంజాబ్ అంటే అయిదు నదుల కలయిక అని అర్ధం. ఈ ప్రాంతంలో చాలా తాజా మంచినీటి సరస్సులు, చెరువులు ఎక్కువగా ఉండటంతో మంచినీటి చేపలు బాగా దొరుకుతాయి. పంజాబీ వంటకాల్లో ఈ చేపల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఉప్పునీటి చేపలు మాత్రం పంజాబీలు వాడరు. ఎందుకంటే పంజాబ్ కు సముద్రం దగ్గరగా ఉండదు కాబట్టి.[16] కోర్ప్, రోహు, వాలుగ చేప(కాట్ ఫిష్) వంటివి ఎక్కువగా వాడే చేపల రకాలు. తేలా, మచి, తిలపియా వంటి రకాలను కూడా వాడతారు. ఈ మధ్య రొయ్యలను కూడా వాడుతున్నారు.[17] ఫిష్ టిక్కా అమృత్ సర్ స్పెషల్ వంటకం.[14] 

శాకాహారం మార్చు

 
కుల్చా అమృత్ సరీ

పాల ఉత్పత్తులు మార్చు

 
పంజారీ
  • అమృత్ సరీ దాల్ మఖనీ (క్రీం, వెన్న, పప్పులతో చేసే వంటకం), రాజ్మా రైస్, రోగీ (అలసందలు), చోలే(నాన్, కుల్చాలలోకి ఎక్కువగా నంచుకోవడానికి వాడతారు), ఆలూ పూరీ.
  • కిచిడి:[18] పంజాబ్ లో ఎక్కువగా జొన్నపిండి, పెసలు, చిమ్మెట్లతో కిచిడీలు తయారు చేస్తారు. బియ్యం, పప్పులతో చేసే కిచిడీలు కూడా ఎక్కువ తింటారు.
  • షాహీ పనీర్, ఖొయా పనీర్, పనీర్ కోఫ్తా, అమృత్ సరీ పనీర్, మటర్ పనీర్, పనీర్ పరాటా వంటి పనీర్ వంటకాలు ఎక్కువగా చేస్తుంటారు.[19]
  • పంజిరీ: ఇది ఒక సంప్రదాయపు పంజాబీ వంటకం.[20] బాదం, అక్రూట్, పిస్తా, ఖర్జూరాలు, జీడిపప్పు, గోధుమపిండి, పంచదార, నూనె, గసగసాలు, సోంపులతో తయారు చేస్తారు ఈ వంటను. దీనిని దబ్రా అని కూడా అంటారు.
  • సాగ్, బైంగన్ భరాటా వంటలు పప్పులు, బీన్స్ లతో కలిపి చేస్తారు.[21]
  • అయిదు పప్పులతో కలిపి చేసే పంజ్(పంచ్) రతనీ దాల్.
  • పంజాబీ ఖడీ పకోరా(పకోడీలతో కూర). మజ్జిగ, పెరుగులతో శెనగపిండితో చేసిన గుజ్జులోకి పకోడీ ముక్కలు వేసి ఉప్పు, కారం వేసి చేస్తారీ కూర.
  • పంజాబీ లస్సీ పనీర్. లస్సీ పంజాబ్ సంప్రదాయ వంట. మజ్జిగలో పనీర్ తురుము, నీళ్ళు, ఉప్పు, పచ్చిమిర్చి కలిపి చేస్తారు. ఈ లస్సీని బంగాళాదుంప, మసాలాలలో కలిపి కూడా ఒక కూరగా చేస్తుంటారు.
  • సర్సాన్ డా సాగ్(ఆవాల ఆకులతో చేసే కూర) మక్కీ డీ రోటీ(మొక్కజొన్న పిండి, అర్వితో చేసే చపాతీ) కలిపి తింటుంటారు. ఈ కూర పుట్టగొడుగులు, బీన్స్  మసాలాలతో చేస్తుంటారు.

స్నాక్స్ మార్చు

  • కాల్చిన ధాన్యాలు: పంజాబీ భాటీలోకి మొక్కజొన్న, గోధుమ గింజల్ని కాల్చి చేయడం సంప్రదాయ పద్ధతి. కొన్ని చోట్ల ఈ కాల్చిన గింజల్ని బెల్లంలో కలిపి కూడా తింటారు.[18]
  • పుదీనా పచ్చడితో (గ్రీన్ చట్నీ) పకోడాలు.
  • సమోసాలు.
  • సట్టు:బార్లీ గింజల్లో ఉప్పు, పసుపు వేసి ఉండలుగా చుట్టి వండుతుంటారు. ఈ లడ్డూలకు జొన్నలు, మొక్కజొన్నలు కూడా వాడుతుంటారు.[18] 

పప్పు మార్చు

 
తరకా దాల్ అంబర్సరీ

పంజాబ్ లో పప్పు వంటకాలు చాలా ప్రముఖం. సాధారణంగా వీటిని దాల్ అని అంటుంటారు.[22][23][24][25]

తరకా మార్చు

తరకాను తెలుగులో పోపు అంటారు. పంజాబీలు కూరలకు కాక పప్పులకు ఎక్కువగా పోపు పెడుతుంటారు.[26] ఎక్కువగా ఉల్లిపాయలు,  జీలకర్ర,[27] ఆవాలుమెంతులు, పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లిలతో పోపు పెడతారు.

రైతా, పచ్చళ్ళు మార్చు

అన్ని రకాల వంటలతో రైతాలు, పచ్చళ్ళు వడ్డిస్తారు. చింతపండు, పుదీనా, దానిమ్మ, మామిడి, ధనియాలు వంటి వాటితో రకరకాల పచ్చళ్ళు చేస్తుంటారు.

స్వీట్లు, మిఠాయిలు మార్చు

 
పాకిస్థాన్, భారత్ లలో తయారు చేసే  సేవియన్(సేమియా) స్వీట్.
 
గాజర్ కా హల్వా(క్యారట్ తో చేసే స్వీట్)
 
జిలేబి

పంజాబీ వంటల్లో స్వీట్లకు, మిఠాయిలకు చాలా పాత్ర ఉంది:

  • అమృత్ సరీ జిలేబి[14][14]
  • బర్ఫీ
  • గుర్హ్: చెరకురసంతో చేసే స్వీట్.
  • ఖీర్ (పాయసం) [28]
  • ఖోయా
  • కుల్ఫీ, ఐస్ క్రీం లాంటి స్వీట్
  • లడ్డు
  • మల్పు[14]
  • రబ్రీ[14] 
  • నువ్వులతో చేసే స్వీట్:[29] హల్వా[14] 
  • షీర్ కోర్మా

రోటీలు మార్చు

పంజాబీలు చాలా రకాల రోటీలు తింటుంటారు. మామూలు చపాతీలు, పొంగే రోటీలు వంటివి రోజూ తింటుంటారక్కడ. పొంగే రోటీలను ఖమిరి రోటీ అంటారు. సందర్భానుసారంగా పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, అవిసె గింజల్ని రోటీలపై తయారీ సమయంలో జల్లుతుంటారు. రకరకాల పిండ్లతో రకరకాల రోటీలు తయారు చేస్తుంటారు:

  • తందూర్ లో కాల్చే నాన్ రోటీ,[14] తందూరీ రోటీ,[14] కుల్చా,[14] లచ్చా పరాటా[14]
  • నూనె లేకుండా కాల్చే పుల్కాలు, చపాతీలు, జోవర్ కీ రోటీ, బాజ్రేకీ రోటీ, మక్కీకీ రోటీ(సాధారణంగా పంజాబీలు ప్రతీ రోటీ పైనా నెయ్యి రాసుకుని తింటుంటారు.)
  • నూనె వేసి కాల్చేవి: పరాటా, కీమా పరాటా, ఆలూ పరాటా, మూలీ పరాటా(ముల్లంగితో చేసేది), పనీర్ పరాటా, పాలక్ పరాటా, ఆలూ పనీర్ పరాటా.
  • నూనెలో వేపే పూరీ,[14] భాటూరా[14] 
  • సాల్ట్ రిజింగ్ రోటీ: సాల్ట్ రిజింగ్ రోటీ పాకిస్థాన్ లోని పంజాబ్ లో సాల్ట్ రేంజ్ ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ రోటీలను పొంగేలా  చేసేందుకు సాధారణంగా వాడే ఈస్ట్ కు బదులుగా కళ్ళు ఉప్పు వాడతారు. ఇలా కళ్ళు ఉప్పు  ఉపయోగించడం, ఆ ప్రాంతం పేరు  సాల్ట్ రేంజ్ కావడంతో ఈ వంటకానికి ఈ పేరు వచ్చింది.
  • పాపడ్(అప్పడం)

సుగంధ ద్రవ్యాలు, మూలికల వాడకం మార్చు

భారత ఉపఖండంలో వాడే అన్ని రకాల సుగంధ ద్రవ్యాలనూ పంజాబీ వంటకాల్లో వాడుతుంటారు. కసూరీ మేథీ(ఎండు మెంతి ఆకులు) మాత్రం ఆ ప్రాంతానికి, ఆ వంటకాలకు చాలా ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యం. భారత్ లోని చాలా ప్రాంతాల్లోలానే పంజాబ్ లో కూడా మసాలలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలను నూరడానికి, దంచడానికి ఘూట్నా(రోలు), అమందస్తా వంటి సంప్రదాయ పరికరాలు వాడుతుంటారు.

 
ఘూట్నా(చిన్న రోలు/అమందస్తా)

పానీయాలు మార్చు

పంజాబీ వంటకాల్లో పానీయాలది ప్రత్యేక స్థానం. వీరు చాలా రకాల పానీయాలు తయారు చేస్తుంటారు. లస్సీ, మజ్జిగ వంటి పాల పదార్ధాలతో వివిధ రకాలైన పానీయాలు చేస్తారు. గేదె పాల పదార్ధాలతో చేసే వంటకాలు పంజాబ్ లో చాలా ప్రఖ్యాతం.[30] మామిడి లస్సీ,[31] [32] మామిడి మిల్క్ షేక్,[33][34][35] చాస్ వంటివి పంజాబీ వంటకాల్లో ప్రసిద్ధమైన పానీయాలుగా చెప్పొచ్చు. కూరలు, పండ్ల నుంచి తయారు చేసే పుచ్చకాయ షేక్[36] క్యారట్ జ్యూస్, చింతపండు జ్యూస్(లిమ్లీ కా పానీ) వంటి పానీయాలు ఎక్కువగా తాగుతారు పంజాబీలు. వేసవి కాలంలో షిఖంజ్వీ, నింబూ పానీ(నిమ్మరసం) ఎక్కువగా తాగుతారు. జల్ జీరా(జీలకర్ర రసం) కూడా చాలా ప్రఖ్యాత పంజాబీ పానీయం.

ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పానీయం సత్తు కూడా పంజాబ్ లో చాలా ప్రఖ్యాతం. బార్లీ గింజల్ని వేయించి, పొడి చేసి, పసుపు, నీళ్ళు కలిపి చేసే పానీయం సత్తు.[18] 

పాకిస్థాన్ పంజాబ్ లో దూద్ సోడా(పాల సోడా), బంటే(ఒక రకమైన సోడా) కూడా చాలా ప్రసిద్ధి చెందిన పంజాబీ పానీయాలు.

నిలవ పచ్చళ్ళు/నిలవ వంటలు మార్చు

 
అచర్ గోస్త్(కోడి మాంసంతో చేసే నిలవ పచ్చడి)

పంజాబీ వంటకాల్లో నిలవ పచ్చళ్లు ఎక్కువే. ఈ నిలవ పచ్చళ్ళని చాలా వంటల్లో కూడా వాడుతుంటారు.[37]  పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో మామిడికాయ నిలవ పచ్చడి చాలా ప్రసిద్ధి.[38][39]

ఆహారం నిల్వ చేసుకునే పద్ధతి మార్చు

 
రకరకాల డబ్బాల్లో నిల్వ చేసిన వస్తువులు

ఆహార పదార్ధాలను దాచుకోవడానికి సాధారణంగా ఇళ్ళల్లో చాలా రకాల పద్ధుతుల్లో నిల్వ చేస్తుంటారు. ముఖ్యంగా గాజు సీసాల్లో, పెద్ద డబ్బాల్లో దాస్తుంటారు. పంజాబ్ లో కూడా ఇలాంటి పద్ధతులే వాడతారు. స్మోక్ హొజెస్(వంటింటికి దగ్గరలో పదార్ధాలు నిల్వ చేసుకునే గదులు. ఒక రకంగా స్టోర్ గదులు)లో మాంసాన్ని కాల్చి ప్రత్యేక వస్తువుల్లో నిల్వ చేస్తుంటారు. ఈ పద్ధతుల వల్ల మాంసం ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాక, రుచి కూడా పెరుగుతుందిట. కాల్చిన మాంసాన్ని పంజాబీలు భాపీ గోస్త్ అని పిలుస్తారు.

వంట పద్ధతులు మార్చు

పంజాబీలు ఆధునిక, సంప్రదాయ పద్ధతుల్లోనూ వంటలు చేస్తుంటారు. పంజాబీ వంటకాల్లో వాడే సంప్రదాయక పొయ్యిలు:

  • ప్రెజర్ కుక్కర్ వాడతారు.
  • పంజాబీ భాఠీ (పంజాబీలు వాడే రాతి పొయ్యి)
  • తందూర్ (కాల్చి వండే వంటలు చేసేందుకు వాడతారు).
  • తవా (రోటీలు కాల్చడానికి వాడే పెనం).

చుల్లా, పంజాబీ భట్టీ మార్చు

 
సంప్రదాయకమైన పంజాబీ పొయ్యి(చుల్లా, భరోలీ).

పంజాబీ భాషలో పొయ్యిలను చుల్లా అంటారు. ఈ పొయ్యిలు చాలా ప్రాచీనమైనవి. రాతి పొయ్యిలను భట్టీలు అని అంటారు. ఆరు బయట వంట వండటానికి పూర్వకాలం వీటిని వాడేవారు. ఇప్పటికీ కొన్ని సంప్రదాయక పంజాబీ ఇళ్లలో ఇటుకులు, రాళ్ళు, కొన్ని చోట్ల మట్టితో తయారు చేసే పొయ్యిలను వాడుతుంటారు. వీటిని వడ్డా చుల్లా, బంద్ చుల్లా అని పిలుస్తారు. కొన్ని ఇళ్ళల్లో అయితే గాడి పొయ్యిల మాదిరిగా నేలలో పొయ్యిలు ఉంటాయి. కానీ ఈ రకమైన పొయ్యిలను ఇప్పుడు వాడటం తక్కువే.

 
సంప్రదాయ ప్రెజర్ కుక్కర్

పంజాబీల వడ్డనల్లో మర్యాదలు మార్చు

పంజాబీలు వడ్డనల్లో చాలా మర్యాదలు పాటిస్తారు. ప్రతీ పంజాబీ ఇంటిలోనూ ప్రాంతీయ మర్యాదలు, పట్టింపులు ఉంటాయి. ప్రాంతాలతో మర్యాదలు మారినా, కుటుంబం అంతా కలసి భోజనం చేయడం అనేది మాత్రం వారి సంప్రదాయంలో భాగం.

పండ్లు, మిఠాయిలు, ఆహార పదార్ధాలు, వంటకాలు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకోవడం పంజాబీ కుటుంబాల్లో సర్వ సాధారణం. ముఖ్యంగా వసంత కాలంలో తప్పకుండా ఈ మర్యాదలు పాటిస్తారు. పండుగల్లోనూ, ప్రత్యేక సందర్భాల్లోనూ చుట్టుపక్కల వారికి భోజన పదార్ధాలు పంచి పెట్టడం వీరి ఆచారాల్లో ఒకటి. పంజాబ్ ప్రాంతంలో మామిడి పండ్లు విరివిగా పండుతాయి.[40] కాబట్టీ పంట కోత సమయంలో మామిడి పళ్ల విందులు జరుగుతుంటాయి. పుచ్చకాయ, మసాలాలు కలిపిన ముల్లంగి(డైకన్)లను కూడా బంధువులకు, స్నేహితులకు పంచి పెట్టడం వీరి సంప్రదాయం.

విందుల్లో వారు పాటించే ప్రధాన మర్యాదలు మార్చు

విందుకు ఆహ్వానించే సమయంలో.. మార్చు

  • భోజన విందుకు గానీ, అల్పాహార విందుకుగానీ కొన్ని రోజుల ముందే స్వయంగా వచ్చి పిలుస్తారు.
  • చిన్న చిన్న కారణాలకు విందును నిరాకరించడమనేది వారిని మనం అవమానించినట్టుగా, మర్యాద ఇవ్వనట్టుగా భావిస్తారు.

భోజన సమయంలో... మార్చు

  • పిలిచిన అతిధినిగానీ, అక్కడ ఉండే పెద్దవారిని గానీ ఎక్కువగా గౌరవిస్తారు వారి విందుల్లో.
  • అతిధే ముందు విందుని మొదలుపెట్టాలి. అందరు అతిధులు మొదలుపెట్టాకానే విందు ఇచ్చేవారు తినడం మొదలు పెట్టాలి. లేకపోతే అది చాలా పెద్ద అమర్యాదగా భావిస్తారు.
  • అతిధులు విందు ప్రదేశానికి రాకముందే అన్ని ఏర్పాట్లూ జరిగిపోవాలి.
  • కుటుంబంలో ఉన్నవారందరూ కనీసం రాత్రి భోజనమైనా కలిసి  చేయాలి.
  • తమ దగ్గర్లో తెలిసినవారుంటే ముందు వారిని తినమని అడిగాకే వాళ్ళూ తింటారు. ఇది వారికొక మర్యాద.
  • నోరు తెరుచుకుని తినడం, నమలడం లేదా గట్టిగా త్రేన్చడం వంటివి విందు సమయంలో అమర్యాదకరమైన పనులు.
  • పాకిస్థానీ పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో తినే సమయంలో ఒక ఖాళీ పళ్ళాన్ని ఉంచుతారు. తినేసిన మాంసం ముక్కలు, మిరపకాయ ముక్కలు వంటివి నేల మీద పాడేయడం మంచి పద్ధతి కాదు. అలాంటివాటిని ఆ పళ్ళెంలోనే వేస్తారు.
  • రోటీ, కూర చేత్తోనే తిన్నా, అన్నం, సూప్, మిఠాయిలు మాత్రం స్పూన్లను ఉపయోగించే తినాలి.

తినేటప్పుడు వాడే పరికరాలు మార్చు

  • పంజాబీ కుటుంబాలు దక్షిణ ఆసియా, ఐరోపా రెండు రకాల తినే పరికరాలనూ ఉపయోగిస్తారు. భారత్ లోని మిగిలిన ప్రాంతాల్లో లాగానే చేత్తో రోటీలను తిన్నా, అన్నం, స్వీట్లు, సూపు తినడానికి పాశ్చాత్య పద్ధతిలో స్పూన్లను వాడతారు. 

పంజాబీ ధాబా మార్చు

పంజాబీ ధాబాలు సాధారణంగా రోడ్ల పక్కన కనపడుతుంటాయి. సామూహికంగా కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా ఈ ధాబాలను ఉపయోగిస్తారు. చౌకగా భోజనం అమ్మడంలో ధాబాలు చాలా ప్రసిద్ధం.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "JEERA RICE RECIPE". indianfoodforever.com.
  2. "KADHI CHAWAL RECIPE". www.indianfoodforever.com.
  3. "Punjabi Pulao Biryani". khanapakana.com. Archived from the original on 2020-11-28.
  4. "Metro Plus Delhi / Food : A plateful of grain". Chennai, India: The Hindu. 2008-11-24. Archived from the original on 2011-06-29. Retrieved 2009-05-07.
  5. [1] The Rough Guide to Rajasthan, Delhi and Agra By Daniel Jacobs, Gavin Thomas
  6. "What is Mughalai Cuisine?". Archived from the original on 2013-10-10. Retrieved 2016-07-05.
  7. New York Times STEVEN RAICHLEN 10 05 2011
  8. "Alop Ho Reha Punjabi Virsa Harkesh Singh Kehal".
  9. Pind Diyan Gallian PTC Channel - Bilga (Jalandhar)
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-14. Retrieved 2016-07-05.
  11. Times of India 30 06 2014 "Punjab records highest per capita milk availability: Report". Times of India. 30 June 2014. Retrieved 29 August 2014.
  12. Khana Pakana : Halwa Puri Archived 2020-11-28 at the Wayback Machine
  13. "Lahori Katlama Recipe". kfoods.com.
  14. 14.00 14.01 14.02 14.03 14.04 14.05 14.06 14.07 14.08 14.09 14.10 14.11 14.12 Know your state Punjab by gurkirat Singh and Anil Mittal Airhunt Publications ISBN 978-9350947555
  15. :Yogurt curry
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-05-19. Retrieved 2016-07-05.
  17. Vijay C Roy (30 July 2014). "New tech gives a boost to shrimp farming in Punjab & Haryana". Retrieved 21 December 2014.
  18. 18.0 18.1 18.2 18.3 Alop ho riha Punjabi virsa by Harkesh Singh Kehal Pub Lokgeet Parkashan ISBN 81-7142-869-X
  19. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-08. Retrieved 2016-07-05.
  20. Rani Devalla. "Traditional Punjabi dish for pregnant women". The Hindu. Retrieved 21 December 2014.
  21. Petrina Verma Sarkar. "Baingan Ka Bharta - Seasoned Roast Eggplant". About. Archived from the original on 28 నవంబరు 2020. Retrieved 21 December 2014.
  22. "Punjabi Dal Tadka recipe - Tarka Daal Fry with Masoor Recipe - Chef In You". Archived from the original on 16 డిసెంబర్ 2014. Retrieved 21 December 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  23. :Moong Daal
  24. :Masoor Daal Recipe
  25. Maah Daal : Maah Daal
  26. "Tarka Daal". .bbc.co.uk. bbc.co.uk.
  27. "tarladalal". tarladalal.com. tarladalal.com.
  28. "BBC - Food - Recipes : Indian rice pudding (kheer)". Retrieved 21 December 2014.
  29. "Suji Ka Halwa". food.ndtv.com. Retrieved 21 December 2014.
  30. : Lassi recipe
  31. "Mango Lassi". Simply Recipes. 10 November 2006. Retrieved 21 December 2014.
  32. "BBC - Food - Recipes : Mango lassi". Retrieved 21 December 2014.
  33. Mango Milkshake :Mango Milkshake
  34. Mango Milkshake :Mango Milkshake Archived 2018-07-16 at the Wayback Machine
  35. Mango Milkshake : Mango Milkshake
  36. http://www.vegrecipesofindia.com/watermelon-juice-fresh-watermelon-juice/ : Water Melon Shake
  37. Gobhi achar : Punjabi Mix Vegetable Pickle Recipe Archived 2015-04-27 at the Wayback Machine
  38. Mango pickle :Mango Pickle Recipe
  39. Mango Pickle recipe : Mango Pickle Recipe Archived 2020-01-11 at the Wayback Machine
  40. http://trtapakistan.org/sector-products/horticulture/mangoes/ :Mango Production in Punjab Pakistan