పట్నం సుబ్రమణ్య అయ్యరు

పట్నం సుబ్రమణ్య అయ్యరు (జననం 1845, మరణం జూలై 31 1902) దక్షిణ భారత శాస్త్రీయ సంగీత వాగ్గేయకారుడు. ఈయన త్యాగరాజ స్వామి సాంప్రదాయాన్ని అనుసరించారు. దాదాపు ఒక వంద దాకా కీర్తనలను వ్రాసారు[1].

జననం - బాల్యం మార్చు

సుబ్రమణ్య అయ్యరు తమిళనాడుకు చెందిన తంజావూరు జిల్లా తిరువయ్యారులో పుట్టారు. వీరి కుటుంబానికి గొప్ప సంగీత నేపథ్యం ఉంది. వీరి తండ్రి భారతం వైద్యనాథ అయ్యరు సంగీతం-శాస్త్రమూ రెండిటిలో ఉద్దండులు. వీరి పితామహులు పంచానంద శాస్త్రి తంజావూరు సెర్ఫోజీ మహారాజా ఆస్థానంలో ఆస్థాన సంగీతకారుడు. సుబ్రమణ్య అయ్యరు సంగీతాన్ని మొదటి వారి మామయ్య మేలత్తూర్ గణపతి శాస్త్రి వద్ద తదుపరి మనంబుచవాది వేంకటసుబ్బయ్యర్ వద్ద నేర్చుకున్నారు. సుబ్రమణ్య అయ్యరు చాలా యేళ్ళు చెన్నపట్నం(చెన్నై)లో ఉన్నారు. అందువలన ఆయన ఇంటిపేరుగా పట్నం స్థిర పడిపోయి, ఆయన పట్నం సుబ్రమణ్య అయ్యరు గానే పిలవబడ్డారు.

శిష్యులు మార్చు

ఈయన శిష్యులలో ప్రముఖ వాగ్గేయకారులు, గాయకులు ఉన్నారు.

వీరిలో ముఖ్యులు:

  1. మైసూరు వాసుదేవాచార్య
  2. పూచి శ్రీనివాస అయ్యంగార్ (రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్)
  3. భైరవి కెంపెగౌడ,
  4. టైగర్ వరదాచారి
  5. కాకినాడ సి.ఎస్.కృష్ణస్వామి అయ్యర్
  6. జి.నారాయణస్వామి అయ్యర్
  7. గురుస్వామి అయ్యర్
  8. ముత్యాలపేట శేష అయ్యర్
  9. ఎం. ఎస్. రామస్వామి అయ్యర్
  10. ఈనడి లక్ష్మీనారాయణ
  11. సేలం మీనాక్షి కుమార్తెలు (పాప, రాధ)

రచనలు మార్చు

సుబ్రమణ్య అయ్యరు వ్రాసిన కృతులలో కదనకుతూహల రాగంలో రచించిన రఘువంశ సుధా, అభోగి రాగంలో రచించిన ఎవరి బోధన. ఈయన వీరి గురువు మకుటం వేంకటేశ కొద్దిపాటి తేడాతో వాడారు. వీరి కృతులు తెలుగు, సంస్కృతంలో ఉన్నాయి. మైసూరు రాజు చామరాజ వొడెయారు ఈయన సంగీత కచేరీ గాత్రానికి మెచ్చి రెండు వేరు వేరు సందర్భాలలో స్వర్ణ కంకణంతో సత్కరించారు.

వర్ణాలు మార్చు

కృతి రాగం తాళం భాష వివరాలు శ్రవ్యకానికి లంకెలు
ఎవరి బోధన అభోగి ఆది తెలుగు
వలచి వచ్చి నవరాగమాలిక ఆది తెలుగు

కృతులు మార్చు

కృతి రాగం తాళం భాష వివరాలు శ్రవ్యకానికి లంకెలు
మరి వేరే దిక్కెవరయ్యా రామా షణ్ముఖ ప్రియ ఆది తెలుగు

టీ ఎన్ శేషగోపాలన్ - http://www.youtube.com/watch?v=i0zhD86dUW4

మరి వేరే దిక్కెవ్వరు లతాంగి ఖండ చాపు తెలుగు

రమా వర్మ - http://www.youtube.com/watch?v=oXW-Pe0pofk

నిన్ను జెప్ప కారణమేమి మందారి ఖండ చాపు తెలుగు
పంచనాదీశ పాహిమాం పూర్ణ చంద్రిక రూపకం తెలుగు
పరి దానమిచ్చితే పాలింతువేమో బిలహరి ఖండ చాపు తెలుగు

నాగవల్లి నాగరాజ్ - http://www.youtube.com/watch?v=EaliQJkbf0E

రఘువంశ సుధా కదన కుతూహలం దేశ-ఆది తెలుగు
వరములొసగి బ్రోచుట నీకరుదా కీరవాణి రూపకం తెలుగు

మల్లాది సోదరులు - http://www.musicindiaonline.com/album/10-Classical_Carnatic_Vocal/12754-Malladi_Brothers/#/album/10-Classical_Carnatic_Vocal/12754-Malladi_Brothers/ Archived 2011-09-26 at the Wayback Machine

మంవి చే కొనవయ్యా సరసాంగి రూపకం తెలుగు

మూలాలు మార్చు

  1. కోవెల, శాంత. సంగీత సిద్ధాంత సోపానములు. pp. 47–50. Retrieved 10 December 2017.