పన్ను (ఆర్థిక వ్యవస్థ)

పన్ను (tax) అనేది ఆర్థిక వ్యవస్థలో భాగం. ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది.

ఆదాయ పన్ను కాలిక్యులేషన్ - ప్రతీకాత్మక చిత్రం

పన్ను నియమాలు మార్చు

వన్నులు స్థూలంగా రెండు రకాలు: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు.

ప్రత్యక్ష పన్నులు మార్చు

వ్యక్తులు, సంస్థలపై నేరుగా విధించే పన్నులని ప్రత్యక్ష పన్నులని అంటారు. ఉదాహరణకి, ఆదాయపు పన్ను.

పరోక్ష పన్నులు మార్చు

పన్ను చెల్లించాల్సిన వారి వద్ద నుండి కాకుండా మూడోపక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్నులు అంటారు. అయితే, మూడోపక్షం వారికి చెల్లించే విలువలో పన్ను కూడా కలిసివుంటుంది. ఆ కలిసి ఉన్న పన్నుని మూడోపక్షం వారు ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఉదాహరణకి, అమ్మకపు పన్ను.