పశుపతినాథ్ దేవాలయం

పశుపతినాథ్ దేవాలయం, (पशुपतिनाथ मन्दिर) నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు.భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ, జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.

పశుపతినాథ్ దేవాలయం
పశుపతినాథ్ దేవాలయం యొక్క వీక్షణ దృశ్యం
పశుపతినాథ్ దేవాలయం యొక్క వీక్షణ దృశ్యం
పశుపతినాథ్ దేవాలయం is located in Nepal
పశుపతినాథ్ దేవాలయం
పశుపతినాథ్ దేవాలయం
నేపాల్ లో దృశ్యం
భౌగోళికాంశాలు :27°42′35″N 85°20′55″E / 27.70972°N 85.34861°E / 27.70972; 85.34861
పేరు
ప్రధాన పేరు :పశుపతినాథ్ దేవాలయం
దేవనాగరి :पशुपतिनाथ मन्दिर
ప్రదేశం
దేశం:నేపాల్
జిల్లా:కాఠ్మండు జిల్లా
ప్రదేశం:ఖాట్మండు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ముఖ్య_ఉత్సవాలు:శివరాత్రి, తీజ్, బాలచతుర్ధశి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :పగోడా

ఇతిహాసం మార్చు

గోవు ఇతిహాసం

ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది. శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.

మరో ఇతిహాసం

ఇంకో ఇతిహాసం ప్రకారం నేపాల మహత్యం, హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.

ఆలయ చరిత్ర మార్చు

 
పశుపతినాథ్ దేవాలయం
 
పశుపతినాథ్ దేవాలయ పగోడ రాత్రి వెలుగులలో

ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన ఆధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ సా.శ753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని, 1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.

దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి, బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు (తలుపులకు) వెండి తాపడం చేయబడి ఉంటుంది. పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉంది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని, ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ. దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత, ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట (ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉంది.

సన్నిధిలో ఇతర విశేషాలు మార్చు

 
ఆలయ ముఖ ద్వారం నందున్న నంది శివుడి వాహనం
  • బంగారు తాపడం చేసిన దేవతామూర్తుల విగహాలు
  • చతుర్ముఖాలతో ఉన్న విగ్రహం
  • చండకేశ్వరుడు - లిచ్చవి లింగం 7వ శతాబ్దం నుండి
  • బ్రహ్మ దేవాలయం
  • ధర్మ శిల - ఇక్కడ ప్రమాణం (ఒట్టు) పెడతారు.
  • ఆర్య ఘాట్
  • గౌరి ఘాట్
  • పంద్ర శివాలయ
  • గోకర్ణ నాథ్, విశ్వరూప్ దేవాలయాలు
  • గుహ్యేశ్వర దేవాలయం
  • కీర్తకేశ్వర మందిరం
  • సూర్యుఅ ఘాట్

అర్చకులు మార్చు

రావెల్ పద్మనాభ శాస్త్రి అడిగ (1927-2005) ఇక్కడ ప్రఖ్యాతి చెందిన ప్రధాన అర్చకుడు.1955 సంవత్సరంలో అర్చకత్వం ప్రారంభించి 1967 సంవత్సరంలో ప్రధాన అర్చక హోదాకి పదోన్నతి పొందాడు.1993 సంవత్సరంలో అర్చకత్వం నుండి విరామం తీసుకొని తన స్వగ్రామము అయిన ఉడిపి తిరిగి వెళ్ళి పోయాడు. నేపాల్ దేశం పశుపతినాథ్ మీద ఆధారపడి నడుస్తున్నది అని ఇక్కడి ప్రజల నమ్మకం..

శ్మశాన వాటిక మార్చు

నేపాలి ప్రజలకు ఈ దేవాలయం చాలా పవిత్రమైనది. దేవాలయము ప్రక్కనే ఇక్కడ ఉన్న బాగమతి నది ఒడ్డున ఆర్యాఘాట్ అనే ప్రదేశంలో శ్మశాన వాటిక ఉంది.

పండుగలు మార్చు

పశుపతినాథ్ దేవాలయానికి నేపాల్ దేశం నుండి భారతదేశం నుండి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకంటారు. ఏకాదశి, సంక్రాంతి, 1.1 కాగ్ తీహార్ 1.2 కుకుర్ తీహార్ 1.3 గోవుల పండగ 1.4 ఎద్దుల పండుగ 1.5 బాయిటికా 1.6 మశ్చీంద్ర జాతర 1.7 వజ్ర జోగిని జాతర 1.8 సితి జాతర1.9 గాతియా మంగళ్ లేదా ఘంట కర్ణ్ 1.10 పంజరన్ 1.11 జనై పూర్ణిమ 1.12 నాగ పంచమి 1.13 జన్మాష్టమి 1.14 గాయ్ జాతర 1.15 బఘ్ జాతర 1.16 ఇంద్ర జాతర 1.17 దాషైన్ మహా శివరాత్రి, రాఖీ పౌర్ణమి గ్రహణం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేపాల్ దేశంలో పండగలు

గుడి ఇతర విశేషాలు మార్చు

  • హిందు మతస్థులను మాత్రమే ఈ దేవాలయంలోనికి ప్రవేశించనిస్తారు. అన్యమతస్థులు బాగమతి నది ఒడ్డునుండి మాత్రమే దేవాలయం దర్శించే అవకాశం ఉంది.
  • మహాశివరాత్రి రోజు పశుపతి నాథ్ దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు శివరాత్రి రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు.

బయటి లింకులు మార్చు