పాడేరు

ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామం, జిల్లా కేంద్రం

పాడేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలానికి చెందిన గ్రామం, జిల్లా కేంద్రం. జిల్లా విస్తారం ఎక్కువగానున్నందున, జిల్లా కలెక్టరు వారానికి రెండు రోజులు రంపచోడవరంలో బసచేస్తారు. పాడేరు సుందర అటవీ ప్రాంతం. కొన్ని కొండజాతులు తండాలు ఈ అడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే జీలుగ, కుంకుళ్ళు, సీమచింతకాయలు, కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయములో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం.

పాడేరు
గ్రామం
పాడేరు త్రోవలో తూర్పు కనుమలు
పాడేరు త్రోవలో తూర్పు కనుమలు
పాడేరు is located in Andhra Pradesh
పాడేరు
పాడేరు
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
Coordinates: 18°05′00″N 82°40′00″E / 18.0833°N 82.6667°E / 18.0833; 82.6667
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు
Government
 • Typeగ్రామపంచాయితీ
 • Bodyపాడేరు గ్రామ పంచాయితీ
Elevation
904 మీ (2,966 అ.)
Population
 (2011)[1]
 • Total8,787
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్
533 024
వాహన నమోదుAP31 (గతం)
AP39 (30 జనవరి 2019 నుండి)[2]

భౌగోళికం మార్చు

రాష్ట్ర రాజధాని అమరావతికి ఈశాన్యంగా 421కి.మీ దూరంలో ఉంది. సమీప నగరమైన విశాఖపట్నానికి వాయవ్యంలో 97 కి.మీ దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 జనగణన ప్రకారం జనాభా 8787.[1]

పరిపాలన మార్చు

పాడేరు గ్రామ పంచాయితీ గ్రామ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సదుపాయాలు మార్చు

పాడేరు విశాఖపట్నం రహదారి పై ఉంది. పాడేరు -రంపచోడవరం రహదారి జిల్లా కేంద్రాన్ని, కలెక్టరు తాత్కాలిక కార్యాలయం గల రంపచోడవరాన్ని కలుపుతుంది. దగ్గరలోని రైల్వే స్టేషను విశాఖపట్నం.

దర్శనీయ స్థలాలు, దేవాలయాలు మార్చు

  • అరకులోయ
  • శ్రీ మోదకొండమ్మ దేవాలయం. పాడేరు మండలం: నర్సీపట్నం-పాడేరు రోడ్డులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ప్రసిద్ధి. పాడేరు మోదకొండమ్మ ఆలయానికి వెళ్లే ముందు దర్శించుకుంటారు. ఇది పాదాలు మోడపల్లి జంక్షన్ ఏజెన్సీ గ్రామం పడాలలో ఉంది.
  • మత్స్యగుండం: పాడేరు దగ్గరగల లోయ. చిన్న నదీపాయలో విస్తారంగా చేపలుంటాయి. సందర్శకుల ఇచ్చే తినుబండారాలను తింటాయి. గిరిజనులు వీటిని దేవతలుగా భావించి పట్టుకోరు. దగ్గరలోని చిన్న శివాలయంలో శివరాత్రి పండుగ ఆచరిస్తారు. [3]

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Alluri Sitharamaraju District, Chief Planning officer (2022-05-09). District Handbook of Statistics - Alluri Sitharama Raju district (PDF).
  2. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
  3. DHS-2022, p. 14-16.

ఆధార గ్రంథాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పాడేరు&oldid=4015274" నుండి వెలికితీశారు