పితృహత్య (Patricide) అనగా (i) ఒకరి తండ్రిని చంపే చర్య, లేదా (ii) తండ్రిని చంపిన వ్యక్తి. పితృ లేదా మాతృ హంతకులను దేవుడు పిడుగుపాటుతో చంపుతాడని చైనీయుల నమ్మక.

జోసెఫ్ బ్లాంక్ రాసిన లే మెర్ట్రే డి లాయుస్ పార్ ఓడిపే అతని కుమారుడు ఈడిపస్ చేత హత్య చేయబడినట్లు అభివర్ణించాడు

పురాణాలలో పితృహత్య మార్చు

పితృహత్య ప్రపంచంలోని చాలా మతాలలో కనిపించినా, గ్రీకు సంస్కృతిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

  • మహాభారతం లో, బభ్రువాహనుడు తండ్రి అయిన అర్జునున్ని సంహరిస్తాడు. అయితే అర్జునున్ని తర్వాత అతని భార్య ఉలూచి బ్రతికిస్తుంది.
  • గ్రీకు సంస్కృతిలో క్రోనస్ (Cronus) తన తండ్రి యైన యురేనస్ ను ప్రపంచాధిపత్యం కోసం చంపేస్తాడు.
  • ఈడిపస్ తండ్రిని చంపి; అతని తల్లిని వివాహం చేసుకోవాలనుకొంటాడు. అతని తల్లిదండ్రులు దీనిని నిరోధించడాని కోనలకావల వదిలేస్తారు. పశువుల కాపరి ద్వారా పెంచబడతాడు. పెరిగి, పెద్దయిన తర్వాత అతడు తండ్రిని సంహరిస్తాడు. చివరికి అతనికి తెలియకుండానే తల్లిని వివాహం చేసుకొని మహారాజు పదవిని పొందుతాడు.

చరిత్రలో పితృహత్య మార్చు

  • అజాతశతృడు, మగధ రాజైన బింబిసారుడు (r. 543–491 B.C.E.) ని ఉరితీయిస్తాడు. అనంతర కాలంలో అదే అజాతశత్రువును ఉదయభద్రుడు (అతని కుమారుడే) హతమారుస్తాడు.
  • ప్రాచీన శ్రీలంకలో కస్సపుడు (473-495 CE) అతని తండ్రి ధాతుసేనుని సింహాసనం కోసం సంహరిస్తాడు.
  • చైనా రాజు జు యూగీ (888?-913 CE) తన తండ్రి జు వెన్ (852–912 CE) ను చంపేస్తాడు.
  • ఇంగ్లండుకు చెందిన చిత్రకారుడు రిచర్డ్ డాడ్ (1817-1886) మానసిక వికల్యం మూలంగా అతని తండ్రిని 1843లో చంపేస్తాడు.
  • జపాన్ కు చెందిన చియో ఐజావా 15 సంవత్సరాలుగా తనను లైంగికంగా హింసిస్తున్న స్వంత తండ్రిని 1968లో చంపుతుంది.
  • నేపాల్ రాజవంశానికి చెందిన దీపేంద్ర (1971–2001) 2001 సంవత్సరం అతని తండ్రి రాజు బీరేంద్ర తో సహా భోజనం చేస్తున్న కుటుంబ సభ్యులందరినీ కాల్చి చంపేస్తాడు.
"https://te.wikipedia.org/w/index.php?title=పితృహత్య&oldid=3273910" నుండి వెలికితీశారు