పెద్దిభొట్ల సుబ్బరామయ్య

భారతీయ తెలుగు రచయిత

పెద్దిభొట్ల సుబ్బరామయ్య (డిసెంబరు 15, 1938 - మే 18, 2018) సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. ఆయన రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి. విజయవాడకు చెందినవారు.[1] ఆయన వ్రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1) 2012 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కు ఎంపిక అయినది.[2][3] 1975 లో నేషనల్ బుక్ ట్రస్ట్ గౌరవం దక్కింది.[4]

పెద్దిభొట్ల సుబ్బరామయ్య
పెద్దిభొట్ల సుబ్బరామయ్య
జననం
పెద్దిభొట్ల సుబ్బరామయ్య

(1938-12-15)1938 డిసెంబరు 15
వల్లూరు, ప్రకాశం జిల్లా
మరణం2018 మే 18(2018-05-18) (వయసు 79)
విద్యస్నాతకోత్తర విద్య
విద్యాసంస్థఎస్. ఆర్. ఆర్ కళాశాల, విజయవాడ
వృత్తితెలుగు అధ్యాపకుడు, కథా రచయిత
ఉద్యోగంఆంధ్ర లయోలా కళాశాల

జీవిత విశేషాలు మార్చు

అతను డిసెంబరు 15 1938 న ప్రకాశం జిల్లా, వల్లూరు లో జన్మించాడు. అతని తండ్రి రేల్వే స్టేషను మాస్టర్ గా పనిచేసేవాడు. సుబ్బరామయ్య ఒంగోలు లో విద్యాభాసం చేశాడు. కళాశాల విద్యను విజయవాడ కళాశాలలో చదివాడు. ఆ కాలంలో రచయిత విశ్వనాథ సత్యనారాయణ కు శిష్యుడైనాడు. ఆంధ్ర లయోలా కళాశాల లో అధ్యాపకునిగా 40 సంవత్సరాల పాటు పనిచేసి డిసెంబరు 1996 లో పదవీవిరమణ చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన సతీమణి తీవ్ర జ్వరంతో కన్ను మూయగా ద్వితీయ వివాహం చేసుకున్నాడు.

అతను 1959 లో తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.[5] చక్రనేమి ఆయన రాసిన మొదటి కథ. అతని రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంటాయని తెలిపాడు. అతను 200 లకు పైగా కథలను వ్రాసాడు. ప్రాథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని అతని నమ్మకం.

సాహిత్యకృషి మార్చు

  • "చక్రనేమి" అనే కథ ఆయన మొదటి రచన. అది ఆంధ్ర పత్రిక (వార పత్రిక) లో ప్రచురింపబడినది. ఆ తర్వాత అనేక రచనలను, రెండు నవలలను "భారతి పత్రిక"కు వ్రాసాడు.
  • పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూమ్‌ - 1)
  • పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు - 2[6]

అవార్డులు మార్చు

పెద్దిబొట్ల కథలు మార్చు

  • పూర్ణాహుతి
  • దుర్దినం
  • శుక్రవారం
  • ఏస్‌ రన్నర్‌
  • వీళ్ళు (కథాసంకలనం)

నవలలు మార్చు

  • ముక్తి
  • చేదుమాత్ర

మరణం మార్చు

గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దిభొట్ల 2018, మే 18న విజయవాడ లో మరణించాడు.[9]

ఇవి కూడా చూడండి మార్చు

సూచికలు మార్చు

  1. "Sahitya Akademi Award for Vijayawada writer". The Hindu. 2012-12-25. Retrieved 2013-08-16.
  2. "Sahitya Akademi Awards for 24". The Hindu. 2012-12-21. Retrieved 2013-08-16.
  3. "Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012" (PDF). Sahitya-akademi.gov.in. Archived from the original (PDF) on 2013-01-24. Retrieved 2013-08-16.
  4. "కన్నీటి సంద్రంలో కథా నావికుడు". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. 1 July 2018. Archived from the original on 1 August 2018. Retrieved 11 September 2018.
  5. "Peddibhotla gets sahitya award for short story". Deccan Chronicle. 2012-12-21. Archived from the original on 2012-12-30. Retrieved 2013-08-16.
  6. "Telugu Book Reviews". Cpbrownacademy.org. Archived from the original on 2013-09-01. Retrieved 2013-08-16.
  7. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (వివిధ) (20 May 2018). "వర్షించే మేఘం పెద్దిభొట్ల". www.andhrajyothy.com. మధురాంతకం నరేంద్ర. Archived from the original on 21 May 2018. Retrieved 4 November 2019.
  8. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
  9. "ప్రముఖ రచయిత పెద్దిభొట్ల కన్నుమూత -". www.andhrajyothy.com. Retrieved 2018-05-19.[permanent dead link]

వెలుపలి లింకులు మార్చు