పైసా వసూల్

2017 సినిమా

పైసా వసూల్ 2017లో విడుదలైన తెలుగు సినిమా.[3]

పైసా వసూల్[1]
దర్శకత్వంపూరీ జగన్నాథ్
రచనపూరీ జగన్నాథ్
(story /screenplay /dialogues)
నిర్మాతవి. ఆనంద ప్ర‌సాద్‌
తారాగణంనందమూరి బాలకృష్ణ
శ్రియా సరన్
ఛాయాగ్రహణంముకేష్. జి
కూర్పుజునైద్ సిద్దిఖి
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2017 సెప్టెంబరు 1 (2017-09-01)
సినిమా నిడివి
142 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

బాబ్ మార్లే(విక్ర‌మ్ జీత్‌) ఓ పెద్ద అధో జగత్తు నేరగాడు (మాఫియా డాన్‌). పోర్చుగల్లో ఉంటాడు. బాబ్ త‌మ్ముడు స‌న్ని(అమిత్‌)ను భారతీయ నిఘా అధికారి చంపేస్తాడు. దాంతో మనదేశంపై ప‌గబ‌ట్టిన బాబ్ ఇండియాలో మార‌ణ హోమం సృష్టించేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. బాబ్‌కు మనదేశంలో ఓ మంత్రి(కృష్ణ‌కాంత్‌) స‌హా స్థానిక మాఫియా అండ‌గా ఉంటుంది. హైద‌రాబాద్‌లో రెండు, మూడు చోట్ల బాంబు పేలుళ్లు జ‌రుగ‌ుతాయి. అమాయ‌కులైన జ‌నం చ‌నిపోతారు. పోలీస్ అధికారుల‌ను మాఫియా గ్యాంగ్ చంపేస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో రా చీఫ్‌(క‌బీర్ బేడి), ఓ నేరగాడిని ఈ మాఫియాకు వ్య‌తిరేకంగా వాడుకుని అంతమొందించాల‌నుకుంటాడు. అందులో భాగంగా తేడాసింగ్‌(నందమూరి బాలకృష్ణ)తో పోలీస్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటుంది. తేడాసింగ్ త‌ను ఉండే వీధిలో త‌న ప‌క్కింట్లో ఉండే హారిక‌(ముస్కాన్‌) వెంట‌ప‌డుతుంటాడు. హారిక తన అక్క‌య్య సారిక‌(శ్రియా) కోసం వెతుకుతూ ఉంటుంది. పోర్చుగ‌ల్ వెళ్లిన సారిక క‌న‌ప‌డకుండా పోతుంది. అయితే చివ‌ర‌కు హారికకు, త‌న‌ అక్క‌య్య సారిక‌కు, తేడాసింగ్‌కు మ‌ధ్య ఓ సంబంధం ఉంద‌ని తెలుస్తుంది. ఆ సంబంధం ఏంటి? అస‌లు తేడా సింగ్ ఎవ‌రు? సారిక‌, హారిక కుటుంబానికి తేడాసింగ్ ఎందుకు ద‌గ్గ‌ర‌వుతాడు? అస‌లు సారిక ఏమవుతుంది? అనే విష‌యాలలు మిగిలిన కథలో భాగం.

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • పైసా వసూల్ , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. డాలర్ మెహందీ, ఉమా నేహా, అనురాగ్ కులకర్ణి
  • కన్ను కన్ను కలిశాయి, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. అనూప్ రూబెన్స్, జితిన్ రాజ్, శ్రీ కావ్య చందన
  • మామా ఎక్ పెగ్ లా, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. నందమూరి బాలకృష్ణ, దివ్య దివాకర్
  • కంటి చూపు చెబుతుంది, (రీమిక్స్) రచన: ఆరుద్ర, గానం. మనో
  • పదమారి , రచన: పులగం చిన్న నారాయణ, గానం. మనో, గీతా మాధురి
  • తేడా సింగ్ (థీమ్ సాంగ్) ఇన్స్ట్రుమెంటల్, మ్యూజిక్ బిట్

సాంకేతికవర్గం మార్చు

  • బ్యాన‌ర్: భ‌వ్య క్రియేష‌న్స్‌
  • సంగీతం: అనూప్ రూబెన్స్‌
  • సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్‌.జి
  • ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
  • నిర్మాత: వి.ఆనంద ప్ర‌సాద్‌
  • క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరీ జగన్నాథ్

మూలాలు మార్చు

  1. "Paisa Vasool (Movie)". Cinejosh.
  2. "Paisa Vasool (Overview)". The Times of India.
  3. "Paisa Vasool (Direction)". hindustan times.

బయటి లంకెలు మార్చు