పోవై సరస్సు (ఆంగ్లం: Powai Lake) ముంబై, నగరంలో పోవై లోయలోని ఒక కృత్రిమమైన సరస్సు. ఒకప్పుడు ఇక్కడ పోవై గ్రామం ఉండేదని భావిస్తారు. భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఈ సరస్సుకు తూర్పుతీరంలోనున్నది.[1] మరొక ప్రసిద్ధిచెందిన సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (NITIE) కూడా ఇక్కడికి సమీపంలోనే ఉన్నది. ఈ సరస్సు పరిసరప్రాంతాలలో చాలా నివాసప్రాంతాలు అభివృద్ధి చెంది గత కొద్దికాలంగా జనాభా పెరిగింది.

పోవై సరస్సు
Powai Lake
ప్రదేశంముంబై
అక్షాంశ,రేఖాంశాలు19°08′N 72°55′E / 19.13°N 72.91°E / 19.13; 72.91
పరీవాహక విస్తీర్ణం6.61 km2 (2.55 sq mi)
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట లోతు12 m (39 ft)
ఉపరితల ఎత్తు58.5 m (191.93 ft)
ప్రాంతాలుపోవై
Powai Lake is located downstream of the Vihar Lake on the Mithi River

ఈ సరస్సు బ్రిటిష్ కాలంలో తవ్వించినప్పుడు సుమారు 2.1 square kilometres (520 acres) విస్తీర్ణం, 3 metres (9.8 ft) (చివరగా) నుండి 12 metres (39 ft) (మధ్యలో) లోతు కలిగివుండేది.[2]

ఒకప్పుడు బొంబాయి నగరానికి త్రాగునీటిని అందించే ఈ సరస్సు, క్రమేపీ కలుషితమై చివరికి ఒక పర్యాటక ప్రదేశంగా మిగిలింది.[3]

మూలాలు మార్చు

  1. "Powai lake". Mumbainet.com. Archived from the original on 2012-02-16. Retrieved 2012-08-30.
  2. "History Of Powai Lake". Members.tripod.com. Retrieved 2013-10-24.
  3. "Mumbai Hotels: Mumbai Tourist Attractions: Powai Lake". Bombay-mumbai-hotels.com. Archived from the original on 2012-02-10. Retrieved 2012-08-30.

బయటి లింకులు మార్చు