ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం. ఇందులో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగివుంటారు.ఆంగ్లంలో Democracy అని అంటారు.గ్రీకు బాషా పదం డిమోక్రటియా నుండి ఉద్బవించింది. dēmos అనగా ప్రజలు, kratos అనగా బలం పరిపాలన అని అర్థం. ప్రజాస్వామ్యానికి, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన (నిర్దిష్టమైన) నిర్వచనం అంటూ ఏది లేదు. కాని రాజనీతి శాస్త్రం వివరణ ప్రకారం ప్రజాస్వామ్యం రెండు ప్రధాన నియమాలను అనుసరిస్తుంది.

  • సమాజం లోని ప్రతి ఒక్కరు సమానం
  • అందరూ స్వతంత్రాన్ని అనుభవించుట
2019 ప్రజాస్వామ్య సూచిక
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. సార్వత్రిక ఎన్నికలు-2014లో విజయవాడలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన వృద్ధ మహిళా ఓటర్లు

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ క్రింది విదముగా నిర్వచించారు.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ క్రింది విధముగా నిర్వచించారు.ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.

ప్రజాస్వామ్య రకాలు మార్చు

ప్రతినిథుల ప్రజాస్వామ్యం మార్చు

ప్రతినిథుల ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిథులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ విధానంలో మిక్కిలి ఎక్కువ ఓట్లు సంపాదించిన వ్యక్తి ఎన్నిక కాబడతాడు.ప్రతినిథిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఒక జిల్లా లేదా నియోజకవర్గం నుండి ఎన్నుకుంటారు. కొన్ని దేశాలలో దౌత్య ప్రతినిథుల (ఇతరులను నొప్పించని వాడు, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి, సంఘటిత కార్మికులు అనగా చేనేత, గీత మొదలైన వారిలోని ఒకరిని సభకు పంపించినట్లు) ను ప్రతినిథుల సభకు పంపిస్తారు. మరి కొన్ని దేశాలలో పై రెండు విధానాల ద్వారా కూడా ఎన్నుకుంటారు. భారతదేశంలో కొన్ని మార్పులతో, ఎగువ (పెద్దల), దిగువ సభలకు ఈ విధానాలను ఉపయోగిస్తారు. కొన్ని ప్రతినిదుల వ్యవస్థలలో ప్రజాభీష్టం (రేఫరేండం) అనబడు పద్ధతిని అనుసరిస్తారు. ఇది ప్రజాస్వామ్య విధానాలలో ముఖ్యమైనది. ప్రజలు తమ తీర్పును అత్యంత కచ్చితంగా, సూటిగా చెప్పుకునే అవకాశం ఇది కల్పిస్తుంది.

విప్లవ పూరిత ప్రజాస్వామ్యం మార్చు

సంపూర్ణ స్వేచ్చాహిత ప్రజాస్వామ్యం మార్చు

ప్రతినిథి రహిత ప్రజాస్వామ్యం మార్చు

సోషలిస్ట్ ప్రజాస్వామ్యం మార్చు

నానా జాతుల మిశ్రమ ప్రజాస్వామ్యం మార్చు

ఎన్నికల రహిత ప్రజాస్వామ్యం మార్చు

న్యాయస్థానాలలో సభ్యులను, స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలు తదితర సంస్థలలో ప్రధానాధికారిని ఎన్నుకోవడానికి కొన్ని దేశాలలో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు లేకుండా కొద్దికాలం ఒకరు మరి కొంత కాలం మరొకరు అలా తరచు సభ్యులను మారుస్తారు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే "ఎన్నుకోబడిన సభ్యులు, రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకొనబడిన సభ్యుల కంటే నిష్పక్షపాతముగా వ్యవహరిస్తారని, ఎక్కువ ప్రజల అభిప్రాయాలు, ఇష్టాలు తెలిసి వుంటారని. ఎన్నికలు లేక పోవుట వలన, దీనిని కొందరు ప్రజాస్వామ్యంగా భావించరు

బల అభిప్రాయ ప్రజాస్వామ్యం మార్చు

ప్రజాభాగస్వామ్య ప్రజాస్వామ్య మార్చు

చరిత్ర మార్చు

ప్రజాస్వామ్యం:ప్రాచీన మూలాలు మార్చు

మధ్య యుగంలో ప్రజాస్వామ్యం మార్చు

18వ, 19వ శతాబ్దం మార్చు

20వ శతాబ్దం మార్చు

ప్రజాస్వామ్య సిద్దాంతం మార్చు

అరిస్టాటిల్ మార్చు

అరిస్టాటిల్ ప్రకారం, ప్రజాస్వామ్యం యొక్క అంతర్గత నియమం స్వేచ్ఛ. కేవలం ప్రజాస్వామ్యం వలనె పౌరులు స్వేచ్ఛను పోందుతారు. స్వేచ్ఛ కొరకే ప్రజాస్వామ్యం వున్నదని వాదిస్తాడు.

  • democracy/polity: ఎక్కువ మంది కోరుకున్న నీయమం
  • oligarchy/aristocracy: కొందరు మాత్రమే కోరుకున్న నీయమం
  • tyranny/monarchy/autocracy: ఒక్కడే విదించిన నీయమం

ప్రజాస్వామ్యం, గణతంత్రం మార్చు

ప్రభుత్వేతర ప్రజాస్వామ్యం మార్చు

ప్రజాస్వామ్య పద్ధతులను ప్రభుత్వేతర సంస్థలలో, కమిటీ లలో పరిపాలనకు ఉపయోగిస్తారు. ఇచ్చట కూడా ఓటింగ్ ద్వారానే పాలసీలను ఆమోదిస్తారు. సాధారణంగా వర్తక సంఘాలు, సహకార సంఘాలు, ఎంటర్ ప్రైజెస్ లలో నాయకత్వాలను కోరుకునేప్పుడు ప్రజాస్వామ్య పద్ధతులలోనే ఎన్నికను జరుపుతారు.

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం మార్చు

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రతి ఏట సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1][2]

ఇవి కూడా చూడండి మార్చు

 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు మార్చు

  1. United Nations General Assembly, Session 62 Resolution 7 (8 November 2007). "Support by the United Nations system of the efforts of Governments to promote and consolidate new or restored democracies". www.un.org. p. 3. Retrieved 15 September 2019.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. సాక్షి, వేదిక-అభిప్రాయం (15 September 2016). "సోదరత్వ భావనే కీలకం". Sakshi. మల్లెపల్లి లక్ష్మయ్య. Archived from the original on 15 సెప్టెంబరు 2019. Retrieved 15 September 2019.