ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన

భారత ప్రభుత్వ ఆర్థిక పథకం

పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు ధ్రువీకరించాయి.[1] భారతదేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు. ప్రతి ఇంటిలోనూ కనీసం ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతాతో బ్యాంకింగ్ సేవలను బాటమ్ ఆఫ్ పిరమిడ్ వినియోగదారులు అందుబాటులోకి తీసుకుని రావడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

పథకం వివరాలు మార్చు

ఈ పథకం కింద ప్రతి ఖాతాదారుకు క్రింద పేర్కొన్న సౌకర్యాలు లభిస్తాయి.

  1. ఖాతాదారుకు Rs.5000 యొక్క ఓవర్ డ్రాఫ్ట్
  2. రూ .1,00,000 యొక్క ప్రమాద భీమా
  3. రూ .30,000 జీవిత భీమా
  4. రుపే డెబిట్ కార్డు

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు మిత్రా ద్వారా బ్యాంకు సేవలు చేయబడతాయి.

పురోగతి మార్చు

18 నవంబరు వరకూ పురోగతి [2]

S.no ఖాతాల సంఖ్య (లక్షల లో) రుపే డెబిట్ కార్డుల (లక్షల లో) అకౌంట్స్ బ్యాలన్స్ను (లక్షల లో) జీరో బ్యాలెన్స్ తో ఖాతాలకు సంఖ్య (లక్షల లో)
1. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 604.92 410.26 480963.28 453.51
2. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 126.2 14.26 71864.99 99.21
3.

ప్రైవేట్ బ్యాంకులు

20.54 8.65 37566.26 13.68
4. మొత్తం 751.66 433.17 590394.53 566.40

ఇతర వివరాలు మార్చు

  • సేవింగ్స్ ఖాతాదారులకు ఈ నిభందనలు వర్తించవు. కేవలం సున్నా నిల్వగల ఖాతాగా ప్రారంభించే వారికి మాత్రమే వర్తిస్తాయి.
  • వారి ఆధార్, లేదా రేషన్ కార్డుల ఆధారంగా వారిని పేద, మధ్య తరగతుల వారిగా గుర్తిసారు.
  • ఈ పథకం క్రింద బ్యాంకులో ఖాతా తీసుకున్న వారు నెలకు 10 వేలకు మాత్రమే బదిలీ సౌకర్యం కలిగి ఉంటారు.
  • సంవత్సరానికి మొత్తం ఒక లక్ష రూపాయలు మాత్రమే మార్పిడి, లేదా బదిలీలకు, దాచడానికి అవకాశం కలిగి ఉంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Banking for Billions November 4, 2014". Archived from the original on 2013-10-11. Retrieved 2014-11-18.
  2. "ప్రత్యక్ష నవీకరణ". Archived from the original on 2014-11-02. Retrieved 2014-11-18.