ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది.తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20 [ఆధారం చూపాలి] చిత్రాలలో నటించింది. రావణ్ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమ లోకి అడుగు పెట్టింది.[1] ఎవరే అతగాడు ప్రియమణికి మొదటి సినిమా.[2]

ప్రియమణి

జన్మ నామంప్రియ వాసుదేవ్ మణి అయ్యర్
జననం (1994-06-04) 1994 జూన్ 4 (వయసు 29)
Indiaపాలక్కడ్, కేరళ, భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 2004 - ఇప్పటి వరకు

నేపధ్యము మార్చు

ప్రియమణి జూన్ 4న 1994కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్. ఆమె అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే పొట్టిగా ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది.

నటజీవితము మార్చు

  • బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది.
  • తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ 'పెళ్ళైనకొత్తలో..' అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి.
  • ఆ తర్వాత 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియ ద్రోణాతో గ్లామర్ డాల్ అవతారమెత్తింది.
  • అలా నటిగా బాగా బిజీ అయ్యింది. అప్పట్నుంచి మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర.. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది.
  • కేవలం హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు దృష్టి సారించింది. ఒక రకంగా చెప్తే ప్రయోగాలు చేసిందనే చెప్పాలి. అలా వచ్చినవే క్షేత్రం, చారులత, చండి.
  • ఈ రెండు సినిమాల్లోనూ చక్కటి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. విమర్శకులు సైతం వహ్వా అనేలా చేసింది. అందుకు ఉదాహరణ చారులతకు వచ్చిన అవార్డులే.
  • తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది.
  • ప్రియకి నార్త్ ఇండియన్ వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రవ్వదోశ. తీరిక సమయంలో సంగీతం వినడం, నృత్యం చేయడం ఈమె హాబీలు! ఇంకా చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్, కుక్కపిల్లలు, పిల్లి పిల్లలంటే ఈ కేరళ కుట్టికి చాలా ఇష్టం.
  • కేవలం హీరోయిన్‌గానే కాకుండా రగడ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది. కలెక్షన్ల వర్షంతో రికార్డులు సృష్టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో కూడా గెస్ట్‌గా ఒక పాటలో ఓ వెలుగు వెలిగింది.మలయాళంలో ఓ డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది.

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2003 ఎవరే అతగాడు రేఖ తెలుగు ప్రియగా ఘనత పొందింది [3]
2004 కంగలాల్ కైధు సెయి విద్యా తమిళం
సత్యం సోనా మలయాళం
2005 అదు ఒరు కన కాలం తులసి తమిళం
ఒట్ట నానయం రేష్మా మలయాళం
2006 పెళ్ళైన కొత్తలో లక్ష్మి తెలుగు
మధు దయ తమిళం
2007 పరుత్తివీరన్ ముత్తఝగు తమిళం ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు (2006)
టాసు నైనా తెలుగు
యమదొంగ మహేశ్వరి తెలుగు
నవ వసంతం అంజలి తెలుగు
మలైకోట్టై మలార్ తమిళం
2008 తొట్ట నళినా తమిళం
తిరక్కత మాళవిక మలయాళం
హరే రామ్ అంజలి తెలుగు
కింగ్ నర్తకి తెలుగు ప్రత్యేక ప్రదర్శన (నువ్వు రెడీ నేను రెడీ పాట)
2009 ద్రోణ ఇంధు తెలుగు
మిత్రుడు ఇందు తెలుగు
పుతియా ముఖం అంజన మలయాళం
ఆరుముగం యామిని తమిళం
నినైతలే ఇనిక్కుమ్ మీరా తమిళం
ప్రవరాఖ్యుడు శైలజ తెలుగు
రామ్ పూజ కన్నడ
2010 శంభో శివ శంభో మునిమ్మ తెలుగు
సాధ్యం సుహాని తెలుగు
గోలీమార్ పవిత్ర తెలుగు
రావణుడు జముని హిందీ
రావణన్ వెన్నిలా తమిళం
ప్రాంచియెట్టన్ మరియు సెయింట్ పద్మశ్రీ మలయాళం
ఎనో ఒంటారా మధుమతి కన్నడ
రక్త చరిత్ర II భవానీ హిందీ

తెలుగు

ద్విభాషా చిత్రం (తమిళంలో కూడా పాక్షికంగా రీషాట్ చేయబడింది)
రగడ ప్రియ/అష్టలక్ష్మి తెలుగు
2011 రాజ్ మైథిలి తెలుగు
క్షేత్రం నాగ పెంచలమ్మ/

సోహిని అగర్వాల్

తెలుగు
విష్ణువర్ధనుడు మీరా కన్నడ
2012 కో కో కావేరి కన్నడ
అన్నా బాండ్ మీరా కన్నడ
గ్రాండ్ మాస్టర్ దీప్తి మలయాళం
చారులత చారు \ లత కన్నడ

తమిళం

ద్విభాషా చిత్రం
2013 లక్ష్మి ప్రియా కన్నడ
చెన్నై ఎక్స్‌ప్రెస్ నర్తకి హిందీ ప్రత్యేక ప్రదర్శన (పాట 1-2-3-4 గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్)
చండీ గంగ/చండీ తెలుగు
2014 ఆలిస్: ఎ ట్రూ స్టోరీ ఆలిస్/ఉమా మలయాళం
నంజలుడే వీట్టిలే అతిధికల్ భావన మలయాళం
అంబరీష స్మిత కన్నడ
2015 రాన్నా నర్తకి కన్నడ ప్రత్యేక ప్రదర్శన (పాట ఏమి చేయాలి)
2016 కథే చిత్రకథే నిర్దేశనా పుట్టన్న గీతాంజలి కన్నడ
కల్పన 2 కల్పన కన్నడ
దాన కాయోను జగదాంబ (ఝుమ్మీ) కన్నడ
ఈడోల్లే రామాయణం

మనఊరి రామాయణం

సుశీల కన్నడ

తెలుగు

ద్విభాషా చిత్రం
2017 చౌకా మరియా డి సౌజా కన్నడ
2018 ధ్వజ రమ్య కన్నడ
ఆషిక్ వన్నా దివాసం శైని మలయాళం
2019 పతినెట్టం పాడి గౌరీ వాసుదేవ్ మలయాళం అతిధి పాత్ర
నాన్న ప్రకార డా. అమృత కన్నడ [4]
2020 అటీట్ జాన్వీ హిందీ జీ5 చిత్రం [5]
2021 నారప్ప సుందరమ్మ తెలుగు అమెజాన్ ప్రైమ్ ఫిల్మ్ [6]
2022 భామాకలాపం అనుపమ మోహన్ తెలుగు ఆహా సినిమా [7]
విరాట పర్వం కామ్రేడ్ భరతక్క తెలుగు [8]
సలామ్ వెంకీ అడ్వా. నంద కుమార్ హిందీ అతిధి పాత్ర
డాక్టర్ 56 ప్రియా కృష్ణ కన్నడ

తమిళం

ద్విభాషా చిత్రం [9]
2023 కస్టడీ ముఖ్యమంత్రి దాక్షాయణి తెలుగు

తమిళం

ద్విభాషా చిత్రం [10]
జవాన్ లక్ష్మి హిందీ [11]
నేరు పూర్ణిమ మలయాళం [12]
2024 భామా కలాపం 2 అనుపమ మోహన్ తెలుగు [13]
ఆర్టికల్ 370 రాజేశ్వరి స్వామినాథన్ హిందీ [14]
కొటేషన్ గ్యాంగ్ TBA తమిళం పూర్తయింది [15]
ఖైమారా TBA కన్నడ చిత్రీకరణ [16]
మైదాన్ TBA హిందీ పూర్తయింది [17]

సిరివెన్నెల (2021)

టెలివిజన్ మార్చు

వెబ్ సిరీస్ ప్రదర్శనల జాబితా
సంవత్సరం పేరు పాత్ర భాష నెట్‌వర్క్ గమనికలు
2019–ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ సుచిత్ర తివారీ హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో
2021 హిస్ స్టోరీ సాక్షి హిందీ ఆల్ట్ బాలాజీ, జీ5
2023 సర్వం శక్తి మయం ప్రియా హిందీ జీ5

హోస్ట్ మార్చు

సంవత్సరం కార్యక్రమం భాష ఛానెల్ గమనికలు
2014 D 4 డాన్స్ మలయాళం మజావిల్ మనోరమ
2015 D 2 - D 4 డాన్స్
డ్యాన్సింగ్ స్టార్ 2 కన్నడ ETV కన్నడ
2016 డ్యాన్సింగ్ స్టార్ జూనియర్స్
డాన్స్ రాజులు తమిళం స్టార్ విజయ్
D 3 - D 4 డాన్స్ మలయాళం మజావిల్ మనోరమ ఉత్తమ సెలబ్రిటీ జడ్జికి ఆసియావిజన్ టెలివిజన్ అవార్డు
డ్యాన్సింగ్ స్టార్ 3 కన్నడ కన్నడ రంగులు
2017 D4 జూనియర్ v/s సీనియర్స్ మలయాళం మజావిల్ మనోరమ
డాన్స్ జోడి డ్యాన్స్ 2 తమిళం జీ తమిళం
ఢీ 10 తెలుగు ఈటీవీ తెలుగు
2018–2019 ఢీ 11 ఈటీవీ తెలుగు
2018–2019 డాన్స్ కేరళ డాన్స్ మలయాళం జీ కేరళం
2019 టీస్ బెస్ట్ పార్టనర్ మజావిల్ మనోరమ
కేరళ డ్యాన్స్ లీగ్ అమృత టీవీ ప్రముఖ న్యాయమూర్తి
D5 జూనియర్ మజావిల్ మనోరమ గ్రాండ్ ఫినాలే జ్యూరీ
ఫేమస్ ఫిల్మ్ ఫేర్ మలయాళం

కన్నడ

MX ప్లేయర్ హోస్ట్
2019–2020 కామెడీ  స్టార్స్ మలయాళం ఏషియానెట్ పునరావృత న్యాయమూర్తి
2019–2020 కామెడీ స్టార్స్ వీకెండ్ ఛాలెంజ్ ఏషియానెట్
డాన్స్ జోడి డ్యాన్స్ 3.0 తమిళం జీ తమిళ్
2020 ఢీ ఛాంపియన్స్ తెలుగు ఈటీవీ తెలుగు
2021 ఢీ 13
2022 ఢీ 14 డ్యాన్స్ ఐకాన్

లఘు చిత్రాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష ఛానెల్ గమనికలు
2017 హ్యాండ్ అఫ్ గాడ్ ఎలీనా మలయాళం మజావిల్ మనోరమ
2019 వైట్ బ్లైండ్ లేడీ ఆంగ్ల యూట్యూబ్

అవార్డులు, నామినేషన్లు మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Women actors must be treated more fairly: Priya Mani". The New Indian Express. Retrieved 2021-11-23.
  2. "Evare Athagadu (2003) | Evare Athagadu Telugu Movie | Evare Athagadu Review, Cast & Crew, Release Date, Photos, Videos – Filmibeat". FilmiBeat (in ఇంగ్లీష్).
  3. Srihari, Gudipoodi (14 January 2003). "Triangular match". The Hindu. Archived from the original on 28 September 2007.
  4. Joy, Prathibha. "Priya Mani joins Kishore in Kannada crime thriller". The Times of India. Retrieved 1 July 2022.
  5. "I don't want to rush into projects: 'Ateet' actress Priyamani". The New Indian Express. Retrieved 5 October 2020.
  6. "Priyamani in asuran Telugu remake". The New Indian Express. Retrieved 3 January 2020.
  7. Correspondent, Special (19 January 2022). "Priyamani in 'Bhamakalapam'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 January 2022.
  8. Vyas (1 May 2019). "Priyamani Roped in for Rana's Next". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 3 January 2020.
  9. "Priya Mani's next film Dr 56 is her 56th film". The Times of India. 2 June 2020.
  10. "Arvind Swami, Priyamani, Vennela Kishore and others join Naga Chaitanya's NC22". 14 October 2022.
  11. "Nayanthara, Priya Mani, Yogi Babu in Shah Rukh Khan's film with Atlee". The Times of India.
  12. "After Shah Rukh Khan's Jawan, Priyamani bags her next with a big superstar; Details inside". PINKVILLA (in ఇంగ్లీష్). 2023-09-13. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-05.
  13. [1]
  14. "Article 370 Teaser: Yami Gautam and Priyamani promise powerful performances. Watch:". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-22.
  15. "Priyamani's Quotation Gang goes on floors". The Times of India (in ఇంగ్లీష్). 7 December 2020. Retrieved 30 September 2021.
  16. Lokesh, Vinay. "Priya Mani joins Priyanka Upendra and Chaya Singh for horror thriller". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 10 November 2020.
  17. India Today (19 January 2020). "The Family Man's Priyamani replaces Keerthy Suresh in Ajay Devgn's Maidaan" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రియమణి&oldid=4155219" నుండి వెలికితీశారు