ప్రేమ ఖైదీ

1990 సినిమా

ప్రేమ ఖైదీ 1991 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[2] ఇందులో హరీష్, మాలాశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమాను నిర్మాత డి. రామానాయుడు ప్రేమ్ ఖైదీ పేరుతో హిందీలో పునర్నిర్మాణం చేశాడు. తెలుగులో కథానాయకుడిగా నటించిన హరీశ్ నే హిందీ సినిమాకు కూడా పరిచయం చేశాడు. కరిష్మా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.[3][4] హిందీలో కూడా ఈ చిత్రం విజయం సాధించింది.[5] ఈ సినిమాలో నటనకు మాలశ్రీకి 1990లో ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది.[6]

ప్రేమ ఖైదీ
దర్శకత్వంఇ.వి.వి.సత్యనారాయణ
రచనపరుచూరి సోదరులు (కథ, మాటలు),
గజ్జల వినాయక శర్మ (మాటలు),
ఇ. వి. వి. సత్యనారాయణ (చిత్రానువాదం)
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంహరీష్,
మాలాశ్రీ
ఛాయాగ్రహణంకె. రవీంద్ర బాబు
కూర్పుకృష్ణారెడ్డి, మాధవ్
సంగీతంరాజన్ - నాగేంద్ర[1]
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1991
భాషతెలుగు

కథ మార్చు

చంద్రం అనే 21 ఏళ్ళ యువకుణ్ణి తండ్రిని హత్య చేసిన నేరం కింద జైలుకి తీసుకురావడంతో కథ ప్రారంభమవుతుంది. వచ్చీ రాగానే తోటి ఖైదీలు అతనితో గొడవ పెట్టుకుంటారు. జైలు గోడమీద చంద్రం ఓ అమ్మాయి బొమ్మ వేస్తాడు. దాన్ని గురించి జైలరు నీచంగా మాట్లాడితే అతన్ని కూడా కొడతాడు. జైలరు జైలులో ఉన్న ఖైదీలను అక్రమంగా బయటకు పంపించి దారి దోపిడీలు చేయిస్తుంటాడు. ప్రభావతి అనే లేడీ ఆఫీసరు బోస్టన్ స్కూలుకి సూపరింటెండెంటు గా వస్తుంది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న చంద్రాన్ని ఆసుపత్రికి తరలించమంటుంది. ఈ లోపున నీలిమ అనే అమ్మాయి చంద్రాన్ని చూడటానికి జైలుకి వస్తుంది కానీ పోలీసులు అనుమతించరు. ఈ లోపున ఆమె తండ్రి పంపించిన మనుషులు ఆమెను బలవంతంగా తీసుకెళ్ళబోతే చంద్రం వారి వెంట పడతాడు కానీ మళ్ళీ పోలీసులకు చిక్కి ఆసుపత్రిలో చేరతాడు. కానీ కొంతమంది గూండాలు వచ్చి అతన్ని చంపబోతే ప్రభావతి వచ్చి వారిని అడ్డుకుంటుంది. ప్రభావతి చంద్రం గురించి ఆరా తీయగా తన కథ గురించి చెబుతాడు.

బాపినీడు అనే వ్యక్తి చేపలు వ్యాపారం చేస్తుంటాడు. చంద్రం తండ్రి అతని దగ్గర పనిచేస్తూ ప్రమాదవశాత్తూ రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు. కుటుంబం గడవడం కోసం చంద్రం వారింట్లో గుమాస్తాగా చేరతాడు. అక్కడే అతనికి బాపినీడు కూతురు నీలిమ పరిచయం అవుతుంది. నీలిమ మొదట్లో స్నేహితురాళ్ళతో పందెం కాసి చంద్రాన్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. కానీ తర్వాత అతని మంచితనం గురించి తెలుసుకుని నిజంగా ప్రేమించడం మొదలుపెడుతుంది. కానీ బాపినీడు వారి ప్రేమను అంగీకరించడు. చంద్రాన్ని చంపమని గూండాలని పురమాయిస్తాడు. కానీ వాళ్ళు పొరపాటున చంద్రం తండ్రిని చంపేసి ఆ నేరాన్ని చంద్రం మీద వేస్తారు. ఈ కథంతా విన్న ప్రభావతికి చంద్రం మీద జాలి కలిగి వారిద్దరి పెళ్ళి తాను చేస్తానని మాట ఇస్తుంది. నేరుగా బాపినీడు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయమని చెబుతుంది. బాపినీడు ఆమె హద్దుల్లో ఆమెను ఉండమని, అవమానించి పంపించేస్తాడు. ప్రభావతి బాపినీడుకు తెలియకుండా జైల్లో ఉన్న చంద్రం, నీలిమ కలిసే ఏర్పాటు చేస్తుంది. బాపినీడు నీలిమను ఓ వ్యాపారవేత్త కొడుక్కిచ్చి పెళ్ళి చేయబోతే ఆమె మైనర్ అని నిరూపించి ఆ పెళ్ళిని ఆపుచేయిస్తుంది ప్రభావతి. ఆమె మీద కక్షతో ప్రభావతి కొడుకుని అన్యాయంగా జైలుకి పంపిస్తాడు బాపినీడు. మైనారిటీ తీరగానే చంద్రానికి, నీలిమకి పెళ్ళి చేస్తానని ప్రభావతి బాపినీడుతో చాలెంజ్ చేస్తుంది. బాపినీడు తన పలుకుబడి ఉపయోగించి ఆమెను వేరే చోటికి బదిలీ చేయిస్తాడు. ఈ లోపు నీలిమ ఇంటి నుంచి తప్పించుకుని జైలులో ఉన్న సూరి బాబు అనే ఖైదీ స్థానంలో చేరుతుంది. బాపినీడు సూరిబాబును బయట చూసి తన కూతురు జాడ చెప్పమని అడుగుతాడు. అతను చెప్పకపోతే చంపేస్తాడు.

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

విడుదల, ఫలితం మార్చు

ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ సందర్భంగా నిర్మాత రామానాయుడు ఖరీదైన వాహనాలను బహుకరించాడు.[7]

పాటలు మార్చు

రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు వేటూరు సుందరరామమూర్తి రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, చిత్ర, ఎస్. పి. శైలజ, రమోల పాటలు పాడారు.

  • ఐ లవ్ ఫర్ యూ అన్నది ప్రేమ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • నీ నవ్వులో స్నేహము , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఓ న మహా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • వల్లభా దుర్లబా , గానం. ఎస్ పి శైలజ , రమోల
  • జోడీకడితే బేడీల , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఓప్రియా ప్రియా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .

మూలాలు మార్చు

  1. "Prema Khaidi". cineradham.com. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 19 August 2016.
  2. "యూట్యూబులో ప్రేమ ఖైదీ సినిమా". YouTube. Suresh Productions. 8 August 2013. Retrieved 19 April 2018.
  3. "Prema Khaidi (1990) Telugu film". spicyonion.com. Retrieved 19 August 2016.
  4. Venkata Satyanarayana, Vutukuri (10 February 2012). Telugu Movie Database (1935-1990) (2 ed.). Self. p. 1229. Retrieved 19 August 2016.
  5. వినాయకరావు, యు. మూవీమొఘల్. హైదరాబాదు. p. 311.[permanent dead link]
  6. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)
  7. "Alitho Saradaga: 25 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన నటి". EENADU. Retrieved 2022-03-16.

బయటి లంకెలు మార్చు