ఫజల్-ఇ-హక్ ఖైరాబాదీ

సూఫీ విద్యావంతుడు

ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ (1796/1797 - 19 ఆగస్టు 1861) ఒక హనాఫీ న్యాయవాది, హేతువాద పండితుడు, మాటురిడి వేదాంతవేత్త, తత్వవేత్త, కవి. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమ యోధుడు. బ్రిటిషు వారి దురాక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. అతను 1857 సమయంలో బ్రిటీష్ వలసవాదానికి వ్యతిరేకంగా సైనిక జిహాద్ చేయడానికి అనుకూలంగా ఫత్వా జారీ చేసాడు. 1857 తిరుగుబాటులో పాల్గొనేందుకు ఇతరులను ప్రేరేపించాడు. అతను షా ఇస్మాయిల్ దెహ్ల్వి యొక్క తక్వియత్ అల్-ఇమాన్‌ను ఖండిస్తూ తఖీకుల్ఫత్వా ఫి ఇబ్తాల్ అల్-తౌఘ్వా రాశాడు. అల్-సౌరహ్ అల్-హిందీయా వంటి పుస్తకాలను రచించాడు.

ఫజల్-ఇ-హక్ ఖైరాబాదీ
వ్యక్తిగతం
జననం1796 / 1797
ఖైరాబాద్, అవధ్
మరణం1861 ఆగస్టు 19(1861-08-19) (వయసు 64–65)
అండమాన్ దీవుల్లో, కారగారంలో
మతంఇస్లాం
ప్రముఖ కృషిసవ్రతుల్ హిందియా
వృత్తికవి, పండితుడు

జీవిత విశేషాలు మార్చు

ఫజల్-ఎ-హక్ భారతీయ ముస్లింల కుటుంబంలో జన్మించాడు. అతను 1796 లేదా 1797లో ఖైరాబాద్, సీతాపూర్‌ జిల్లాలో జన్మించాడు. [1] [2] అతని తండ్రి సదర్-ఉల్-సదర్, మతపరమైన విషయాలకు సంబంధించి మొఘల్‌లకు ముఖ్య సలహాదారు. అతను 13 సంవత్సరాల వయస్సులో ఉపాధ్యాయుడు అయ్యాడు. 1828లో, అతను ఖాజా విభాగంలో ముఫ్తీగా నియమితుడయ్యాడు. [2]

ఇస్లామిక్ అధ్యయనాలు, ఆధ్యాత్మికశాస్త్రంలో పండితుడే కాకుండా, అతను సాహితీ కారుడు కూడా. ముఖ్యంగా ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషల్లో రచనలు చేసాడు. అరబిక్‌లో 400 కంటే ఎక్కువ ద్విపదలు రాసాడు. మీర్జా గాలిబ్ అభ్యర్థనపై అతడి మొదటి దివాన్‌ను సవరించాడు.  తరువాత హనాఫీ ఆలోచనా శైలిని అనుసరించాడు. మాటూరిడీ శాఖకు చెందిన పండితుడు. కవి కూడా. [3] [4]

అతని లోతైన జ్ఞానం పాండిత్యం కారణంగా, అతన్ని "అల్లామా" అని పిలిచేవారు. గొప్ప సూఫీగా అతన్ని గౌరవించేవారు. అతనికి ఇమామ్ హిక్మత్, కలామ్ (తర్కం, తత్వశాస్త్రం సాహిత్యం యొక్క ఇమామ్) అనే బిరుదు కూడా ఇచ్చారు. ఫత్వాలు జారీ చేసే అంతిమ అధికారం అతనిదేనని పండితులు పరిగణించేవారు. [5]

అతను చాలా చమత్కారంగా మాట్లాడేవాడు. మీర్జా గాలిబ్ ఇతర సమకాలీన ప్రముఖ కవులు, రచయితలు, మేధావులతో అతని ఛలోక్తుల గురించి చాలా కథలు ఉన్నాయి. అతను, అతని కుమారుడు అబ్దుల్ అల్-హక్ ఖైరాబాదీ ఉత్తర భారతదేశంలో మదరసా ఖైరాబాద్‌ను స్థాపించారు. అక్కడ చాలా మంది పండితులు చదువుకున్నారు. అతను అరబిక్ భాషలో రిసాలా-ఎ-సౌరతుల్ హిందీయా రాశాడు. అస్-సౌరత్ అల్ హిందీయా అనే పేరుతో తిరుగుబాటు గురించి వ్రాసాడు. [2]

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జిహాద్ మార్చు

బ్రిటీష్ ఆక్రమణకు వ్యతిరేకంగా భారతీయులు పోరాడటం ప్రారంభించడంతో, ఖైరాబాదీ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌తో అనేక వ్యక్తిగత సమావేశాలను నిర్వహించాడు. ఇవి 1857 మే వరకు కొనసాగాయి. 1857 జూన్ 26 న, జనరల్ బఖ్త్ ఖాన్ తన 14,000 మంది సైన్యంతో సహా బరేలీ నుండి ఢిల్లీకి చేరుకున్నప్పుడు, ఖైరాబాదీ శుక్రవారం ఉపన్యాసం ఇచ్చాడు. అనేక మంది ముస్లిం పండితులతో పాటు, వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిహాద్‌కు పిలుపునిస్తూ ఫత్వా జారీ చేశాడు ఆ ఫత్వాపై సద్రుద్దీన్ ఆజూర్దా, అబ్దుల్ కదీర్, ఫైజుల్లా దెహెల్వీ, ఫైజ్ అహ్మద్ బాదాయూనీ, వజీర్ ఖాన్, సయ్యద్ ముబారక్ షా రాంపురీలు సంతకం చేసారు. ఈ ఫత్వాలో అతను 1857 తిరుగుబాటులో పాల్గొనడానికి ప్రజలను ప్రేరేపించాడు. [6] [7] తదనంతరం బ్రిటీషర్లు తమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి, జిహాద్ వ్యాప్తిని అరికట్టడానికీ ఢిల్లీ చుట్టూ 90,000 మంది సైన్యాన్ని మోహరించారు. [8] [9] [10] [11] [12] [13]

హింసను ప్రేరేపించినందుకు బ్రిటీష్ అధికారులు అతన్ని 1859 జనవరి 30న ఖైరాబాద్‌లో అరెస్టు చేశారు. [14] 'జిహాద్' లో అతని పాత్రకు గాను, హత్యలను ప్రోత్సహించినందుకు గాను అతన్ని విచారించి, దోషిగా నిర్ధారించారు. [14] అధికారులు అతనిని "అసాధారణ తెలివితేటలు, చతురత కలిగిన వ్యక్తిగా పరిగణించారు. అతన్ని భారతదేశంలో బ్రిటిష్ ఉనికికి అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా పరిగణించారు. అందువల్ల భారతదేశ ప్రధాన భూభాగం నుండి తరిమివేయాలి. అతను తిరుగుబాటు వెనుక ప్రధాన శక్తిగా ఉన్నాడు, కంపెనీ అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ప్రజలను ఒప్పించడం, ప్రచారం చేయడం, స్వాతంత్ర్య యుద్ధానికి పిలవడం ద్వారా తిరుగుబాటులో చేరడానికి ప్రజలను ప్రేరేపించడం వంటి అనేక ఆరోపణలు అతనిపై చేసారు. ఫత్వాలు జారీ చేయడం, హింసను ప్రేరేపించడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వంటి అభియోగాలు కూడా మోపారు. [8] [9]

ఖైరాబాదీ తన కేసును తానే స్వయంగా వాదించుకున్నాడు. తాను అబద్ధాలు చెప్పలేనని ప్రకటించి, తాను ఫత్వా ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతన్ని అండమాన్ ద్వీపానికి ద్వీపాంతరవాస శిక్ష విధించారు. అతని ఆస్తిని అవధ్ కోర్టు జ్యుడీషియల్ కమిషనర్ జప్తు చేశాడు. 1859 అక్టోబరు 8న "ఫైర్ క్వీన్" అనే ఆవిరి నౌకలో ప్రయాణించి అండమాన్ ద్వీపానికి చేరుకున్నాడు. 1861 లో చనిపోయే వరకు అతను అక్కడే జైలులో ఉన్నాడు. క్రైస్తవ బ్రిటిషు ప్రభుత్వం తమ మతాన్ని నాశనం చేసి భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చబోతోందనే భయం కూడా యుద్ధం చెలరేగడానికి ప్రధాన కారణం. [8]

దేవ్‌బందీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఫత్వాలు మార్చు

ఖైరాబాదీ దేవుడు అబద్ధం చెప్పగలడంటూ (ఇమ్కాన్-ఎ-కిజ్బ్) చెప్పే వహాబీ-దేవబందీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేశాడు. [15] దేవుడికి అబద్ధం చెప్పే సామర్థ్యం ఉందని దారుల్ ఉలూమ్ దేవబంద్ వ్యవస్థాపకుడు రషీద్ అహ్మద్ గంగోహి చెప్పాడు. ఈ సిద్ధాంతాన్ని ఇమ్కాన్-ఐ కిజ్బ్ అంటారు . [16] [17] ఈ సిద్ధాంతం ప్రకారం, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, దేవుడు అబద్ధం చెప్పగలడు. ముహమ్మద్ (ఇమ్కాన్-ఇ నజీర్ ) అనంతరం, ముహమ్మద్‌తో సమానమైన ఇతర ప్రవక్తలను దేవుడు సృష్టించగలడు అనే సిద్ధాంతానికి గంగోహి మద్దతు ఇచ్చాడు. [16] [17]

అల్లామా ఫజల్ హక్ ఖైరాబాదీ ఈ సిద్ధాంతాలను ఖండించాడు. ఖురాన్, హదీసుల ప్రకారం ముహమ్మద్ ప్రవక్తే చివరి ప్రవక్త అనీ, అతని తర్వాత మరొక ప్రవక్త లేదా "దూత" లేడనీ రాశాడు. మరొక ముహమ్మద్ ఉండగలడని విశ్వసించాలంటే, అల్లా ఖురాన్‌లో పేర్కొన్న దానికి విరుద్ధంగా చేసినట్లే. అంటే అల్లాహ్ అబద్ధం చెప్పినట్లే. అబద్ధం చెప్పడమంటే దోషమున్నట్లే, అల్లాహ్‌కు దోషం ఉండటం అసాధ్యం. [13]

రచనలు మార్చు

షా ఇస్మాయిల్ దెహ్ల్వీ యొక్క తఖ్వియత్ అల్-ఇమాన్‌ను ఖండిస్తూ ఖైరాబాదీ, తఖీకుల్ఫాత్వా ఫి ఇబ్తాల్ అల్-తౌఘ్వా రాశాడు . [18]

అండమాన్‌లో 22 నెలలు బందిఖానాలో ఉండగా. అల్లమా 1857 నాటి యుద్ధ సంఘటనల యొక్క విమర్శనాత్మక విశ్లేషణ అయిన అల్సోరత్-ఉల్-హిందీయా పుస్తకమే కాకుండా, అరబిక్ (ఖసీదా)లో పద్యాల రూపంలో ఈ తిరుగుబటు గురించి అనేక ప్రత్యక్ష సాక్షుల కథనాలను కూడా రాశాడు. 1857 సంఘటనలపై ఇది మొట్టమొదటి పుస్తకం కూడా. [8]

అతని ఇతర రచనలు: [18]

  • అల్-హదియత్ అల్-సదీయా
  • అల్రోజ్ అల్-మజూద్ : మస్ʼలాహ్-యి వహదత్ అల్-వజూద్ కి బులంద్ పాయా తఖ్లిక్
  • అల్-హాషియా లిల్-మవ్లావీ ఫల్‌హాక్ అల్-ఖైరాబాదీ ʻఅలా షార్హ్ అల్-సల్లం లిల్-ఖాదీ ముబారక్
  • అల్-సౌరహ్ అల్-హిందీయా

వ్యక్తిగత జీవితం మార్చు

అతనొక ఫరూకీ . అతని తండ్రి ఇమామ్ ఫజల్-ఎ-ఇమాన్. అతని కుమారులలో ఒకరైన అబ్దుల్ హక్ కూడా ఒక గౌరవనీయమైన పండితుడు. అతడు షంసుల్ ఉలేమా అనే బిరుదును పొందారు. అతని మనవడు ముజ్తర్ ఖైరాబాదీ. జాన్ నిసార్ అక్తర్ అతని మునిమనవడు. [19]

అతని కుమారులలో, అబ్దుల్ హక్ ఖైరాబాదీ హేతువాద పండితుడు. మాజిద్ అలీ జాన్‌పురీకి ఉపాధ్యాయుడు. [20] [21]

మరణం మార్చు

ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ 1861 ఆగస్టు 19న అండమాన్ దీవులలో ప్రవాసంలో ఉండగా మరణించాడు. [1] 

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Asir Adrawi (April 2016). "Mawlāna Fazl-e-Haq Khairabadi". Tazkirah Mashāhīr-e-Hind: Karwān-e-Rafta (in Urdu) (2nd ed.). Deoband: Darul Moallifeen. pp. 210–211.{{cite book}}: CS1 maint: unrecognized language (link) ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "asir" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 2.2 HUSAIN, IQBAL (1987). "Fazle Haq of Khairabad—A Scholarly Rebel of 1857". Proceedings of the Indian History Congress. 48: 355–365. ISSN 2249-1937. JSTOR 44141709.
  3. Khairabadi, Fazl-e-Haq. Al-Rawdh al-Mucawwad. Mufeed Al Islam. p. 3.
  4. Khan, Siddiq Hasan (2002). Abjad Al-Ulum. Dar Ibn Hazm. p. 714.
  5. Anil Sehgal (2001). Ali Sardar Jafri. Bharatiya Jnanpith. pp. 213–. ISBN 978-81-263-0671-8.
  6. Sircar, Jawhar (8 May 2017). "Andaman's Cellular jail holds lessons for the current Indian polity". DNA India.
  7. Ali Sardar Jafri. Bharatiya Jnanpith. 2001. ISBN 9788126306718.
  8. 8.0 8.1 8.2 8.3 "Allama Fazle Haq Khairabadi – the scholarly rebel of 1857". The Nation. 23 January 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "auto" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  9. 9.0 9.1 "Independence Day Special: अल्लामा फजले हक को फातवा देने पर मिली थी काला पानी की सजा Lucknow News". Dainik Jagran. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "auto2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  10. "Seminar on Allama Fazle Haq Khairabadi held in Bhiwandi". TwoCircles.net. 1 February 2012. Retrieved 14 July 2020.
  11. Sher, Ali (5 November 2014). The role of muslims in the pre independence politics in India: a historical study (PDF). Jhunjhunu, Rajasthan: Faculty of Fine Arts, Shri Jagdishprasad Jhabarmal Tibarewala University. p. 125. Retrieved 14 July 2020.
  12. "The Role of Popular Muslim Movements". The American Journal of Islamic Social Sciences (in ఇంగ్లీష్). Indiana University: Jointly published by the Association of Muslim Social Scientists; International Institute of Islamic Thought. 25 (1–3): 150. 2008. Retrieved 14 July 2020.
  13. 13.0 13.1 Vivek Iyer (2012). Ghalib, Gandhi and the Gita. Polyglot Publications London. pp. 43–. ISBN 978-0-9550628-3-4.
  14. 14.0 14.1 Anderson, C (2007) The Indian Uprising of 1857–8: prisons, prisoners, and 'Jihad', Anthem Press, London P17
  15. Khair Abadi, Fazl e Haq (1825). Tahqeeq Ul Fatwa Fe Abtal It Taghwa. Shaikh Abdul Haq Muhaddis e Dehlvi Academy.
  16. 16.0 16.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; kizb అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  17. 17.0 17.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; rag అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  18. 18.0 18.1 "Faz̤l Ḥaq K̲h̲airābādī 1797-1861". WorldCat. Retrieved 31 August 2021.
  19. "Farhan Akhtar wants to trace his roots, back to Uttar Pradesh". Hindustan Times. 10 January 2017.
  20. Syed Mehboob Rizwi. Tarikh Darul Uloom Deoband [History of The Dar al-Ulum (Volume 2)]. Translated by Murtaz Husain F Quraishi. Idara-e-Ehtemam, Dar al-Ulum Deoband. p. 55.
  21. Asir Adrawi. "Mawlāna Abdul Haq Khairabadi". Tazkirah Mashāhīr-e-Hind: Karwān-e-Rafta (in ఉర్దూ) (2 April 2016 ed.). Deoband: Darul Moallifeen. p. 157.