వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు
ఫిబ్రవరి 29, 2008
  • 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు.
  • నూతన బడెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1,10,000 నుంచి రూ.1,50,000 లకు పెంచబడింది.
ఫిబ్రవరి 28, 2008
  • పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2007-08 అవార్డు లభించింది.
  • మహానది నదీపరీవాహక్షేత్రంలో రిలయెన్స్ ఇండస్ట్రీ చమురు నిక్షేపాలను కనుగొంది.
  • చెన్నై మహానగర పోలీసు శాఖను రెండుగా విభజించాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 27, 2008
ఫిబ్రవరి 26, 2008
ఫిబ్రవరి 25, 2008
ఫిబ్రవరి 24, 2008
  • అసోంలో సోనపూర్ వంతెనపై నుంచి బస్సు పడి 18 ప్రయాణీకుల మృతి.
  • భారత వైమానిక దళంలో శిక్షణ నిమిత్తం బీదర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో బ్రిటన్ తయారుచేసిన అధునాతన జెట్ ట్రైనర్ హక్ శిక్షణ విమానాన్ని ప్రవేశపెట్టారు.
  • ఇరాక్ ఉత్తర ప్రాంతంలో టర్కీ వైమానిక దాడి, 35 కుర్దిష్ తిర్గుబాటుదారుల మృతి.
ఫిబ్రవరి 23, 2008
ఫిబ్రవరి 22, 2008
ఫిబ్రవరి 21, 2008
  • కక్ష్యలో నియంత్రణ కోల్పోయిన కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా పేల్చివేసింది.
  • 2007 సంవత్సరపు సాహిత్య అకాడమీ అవార్డులకు గాను 24 రచయితలు ఎంపికయ్యారు.
  • ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత క్రికెట్ జట్టు రెండో స్థానంలో నిలిచింది.
  • ముంబయి ట్రాన్స్‌హార్బర్ లింక్ ప్రాజెక్టు (22 కిలోమీటర్ల పొడవైన రోడ్డు, రైల్వే బ్రిడ్స్‌ నిర్మాణపు) పనులను రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది.
ఫిబ్రవరి 20, 2008
ఫిబ్రవరి 19, 2008
ఫిబ్రవరి 18, 2008
ఫిబ్రవరి 17, 2008
  • ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరీస్‌లో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్‌లోకి ప్రవేశించింది.
  • అఫ్ఘనిస్తాన్ లోని కాందహార్లో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో 80 మంది మృతి.
  • ఒడిషాలో నక్సలైట్లు జరిపిన దాడితో రాష్ట్రమంతటా హైఅలెర్ట్ ప్రకటించిన ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం.
  • భారత్ టాప్- 3 రియాల్టీ మార్కెట్‌ల్లో ఒకటిగా అవతరించినట్లు అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ నివేదిక వెల్లడించింది.
ఫిబ్రవరి 16, 2008
ఫిబ్రవరి 15, 2008
ఫిబ్రవరి 14, 2008
ఫిబ్రవరి 13, 2008
  • మచిలీపట్నం తీరానికి 50 కి.మీ.దూరంలో కృష్ణా-గోదావరి బేసిన్ లో మొట్ట మొదటి సారిగా గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటన.
  • హైదరాబాదులో 20 ఎకరాల స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న గూగుల్ సంస్థ.
  • పాకిస్తాన్ అన్వాయుధాలు మోసుకెళ్ళగల ఘజ్ఞవీ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. దీని పరిధి 290 కిలోమీటర్లు.
ఫిబ్రవరి 12, 2008
ఫిబ్రవరి 11, 2008
  • ముంబయిలో చెలరేగిన అలర్లకు చర్యగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరేపై, సమాజ్‌వాదీ పార్టీ ముంబయి అధ్యక్షుడు అబూఅజ్మీలపై పోలీసులు కేసులు నమోదు.
  • తొలిగించిన న్యాయమూర్తులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తే పాకిస్తాన్లో న్యాయవాదులు న్యాయస్థానాలను బహిష్కరించారు.
  • భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ ముల్‌ఫోర్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
  • అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున పోటీలో ఉన్న బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌పై ఆధిక్యం.
  • కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) కు ఇ-గవర్నెన్స్ అవార్డు.
  • పారిస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రష్యా అగ్రశ్రేణి క్రీడాకారిణి అన్నా చక్వతడ్జే కైవసం.
  • బాంబే స్టాక్ ఎక్ఛేంజి సూచీ సెన్సెక్స్‌లో మళ్ళీ భారీ పతనం. 834 పాయింట్లు తగ్గి 16631 పాయింట్లకు దిగజారింది. ఇది మొత్తం సుచీలో 4.8% తగ్గుదల.
  • చైనాలో 92% గ్రామాలకు విస్తరించిన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం.
ఫిబ్రవరి 10, 2008
ఫిబ్రవరి 9, 2008
ఫిబ్రవరి 8, 2008
  • ద్రవ్యోల్బణం రేటు 4.11%కి పెరిగింది. గత 6 మాసాలలో ఇదే అత్యధిక పెరుగుదల రేటు.
  • సిండికేట్ బ్యాంకు ఎస్.ఎం.ఎస్. బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఖాతాదారులకు కల్పించింది.
  • అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న టాంజానియా ప్రధానమంత్రి ఎడ్వర్డ్ లోవస్సా రాజీనామా.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 ఫైనల్ మ్యాచ్ ముంబాయిలో జరపాలని నిర్ణయం.
ఫిబ్రవరి 7, 2008
ఫిబ్రవరి 6, 2008
  • పాకిస్తాన్ అణ్వాయుధాలు సురక్షితంగా లేవని అమెరికా నిఘాసంస్థల హెచ్చరిక.
  • 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన తీవ్రవాదులకు సహాయం చేశారనే నేరం నిర్ధారణ కావడంతో ముగ్గురికి జీవిత ఖైదు పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది.
  • పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు సెల్‌ఫోన్ వాడడానికి ప్రభుత్వం నిషేధించింది.
  • అమెరికా అధ్యక్ష పదవిలో నిలబడే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి పదవికై జరిగిన ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఒబామాపై ఆధిక్యం సాధించింది.
ఫిబ్రవరి 5, 2008
  • అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ నాలుగవ స్థానం పొందినది. చైనా, జపాన్, రష్యాలు ఈ విషయంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • వన్డే క్రికెట్లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదివరకే ఇతని పేరిటే ఉంది.
ఫిబ్రవరి 4, 2008
ఫిబ్రవరి 3, 2008
  • ఆఫ్రికా దేశమైన కెన్యాలో శాంతి స్థాపనకు ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య అంగీకారం కుదిరింది.
  • రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) పశ్చిమ బెంగాల్లో గ్రామీణ టెలిఫోన్ పథకాన్ని ప్రారంభించింది.
ఫిబ్రవరి 2, 2008
ఫిబ్రవరి 1, 2008
  • అంతర్జాతీయ స్థాయి ఎయిర్ షో అక్టోబర్ 15 నుంచి మూడు రోజులపాటు హైదరాబాదులో జరపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది.
  • దుబాయి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్‌రషీద్ అల్ మగ్దూం తన కుమారుడు హందన్‌ను యువరాజుగా ప్రకటించాడు.
  • అంతర్జాతీయ స్థాయి ఇంటర్‌నెట్ సంస్థ యాహును 44.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి మైక్రోసాప్ట్ సంసిద్ధత.