ఫౌంటెన్ పెన్ అనేది ఒక పాళీ పెన్, ఇది మునుపటి డిప్ పెన్ లా కాకుండా ద్రవ సిరా యొక్క అంతర్గత రిజర్వాయర్ ను కలిగి ఉంటుంది. ఈ పెన్ను సిరాను ఒక ఫీడ్ ద్వారా రిజర్వాయర్ నుంచి కలం పాళీ గ్రహించేలా, గురుత్వాకర్షణ, కేశనాళిక చర్య యొక్క కలయిక ద్వారా కాగితంపై నిక్షేపమయ్యేలా చేస్తుంది. ఈ పెన్నును లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ కనిపెట్టాడు. ఫౌంటెన్ నుంచి నీరు పైకి చిమ్ముతున్నట్లుగా ఈ పెన్ నిబ్ యొక్క రంధ్రం నుంచి ఇంక్ వెలువడుతుంటుంది కనుక ఈ పెన్నును ఫౌంటెన్ పెన్ అంటారు. ఫౌంటెన్ పెన్నుల యొక్క కొన్ని రిజర్వాయర్లలో ఇంక్ ను నేరుగా పోయవలసి ఉంటుంది, కొన్ని పెన్నులలో ఒత్తివదలడం పద్ధతి ద్వారా పీల్చుకునే రిజర్వాయర్ ఉంటుంది.

ఫౌంటెయిన్ పెన్ ఆవిష్కరణ మార్చు

ఎడ్సన్ తన ఆశయాలను, పర్యాటక అనుభవాలను గ్రంథస్తం చేయాలనే ఆలోచనతో ఒక మంచి కలం తయారు చేయాలనుకున్నాడు. అప్పటి పెన్నులను మాటిమాటికి సిరాలో ముంచి వ్రాయవలసి వచ్చేది. మాటిమాటికి సిరాలో ముంచకుండా వ్రాయడమెలాగ అనే విధంగా ఆలోచించి ఫౌంటెన్ పెన్నును కనిపెట్టాడు. దానిపై పేటెంట్ హక్కులు పొందాడు. పెన్నుల వ్యాపారం మొదలు పెట్టి తన పరిశోధనలతో నాణ్యమైన, సౌకర్యవంతమైన పెన్నులు తయారుచేశారు.

చిత్రాలు. మార్చు