బండి గుర్విన లేక బండి గురివెంద వృక్ష శాస్త్రీయ నామం Adenanthera pavonina.

బండి గురివింద
Adenanthera pavonina with the red seeds, India.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. pavonina
Binomial name
Adenanthera pavonina
Seeds

ఇతర భాషల పేర్లు మార్చు

సంస్కృతం : కుచందన, తామ్రకః, హిందీ : బారాజ్ఞచి, కన్నడ : మంజట్టి, మలయాళం : మనాకాటి, తమిళం : యానైకుంటామాని, ఆంగ్లము : కొరల్ ఉడ్ ట్రి, రెడ్ ఉడ్ ట్రి

వ్యాప్తి మార్చు

భారతదేశమంతటా ఆకురాల్చు అడవులలో పెరుగుతుంది. భవనాల ముందు స్థలాలలో కూడా పెంచుతారు.

వర్ణన మార్చు

పెద్ద పెద్ద కొమ్మలు లేకుండా అందంగా ఉండే ఈ చెట్టు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. 6 మీటర్ల నున్నని దీని కాండము బెరడు ముదురు గోధుమ రంగులో ఉండి నిలుపు పగుళ్ళు కలిగి ఉంటుంది. పెద్ద తమ్మెలకు 3 లేక 6 చిన్నతమ్మెలు ఎదురెదురుగా ఉంటాయి. చిన్న తమ్మెలకు ఇరువైపులా దళాలు ఒకదాని తరువాత ఒకటి ఉంటాయి. దళాలు కొలగా పొడవుగా, నున్నగా, ముదురాకు పచ్చరంగులో ఉంటాయి. పూవులు లేత పసుపు పచ్చరంగులో సన్నని కాడ చుట్టూ సమాన దూరంలో గుత్తులుగా పూస్తాయి. కాయలు సన్నని బద్ధలులాగా వంకర తిరిగి ఉంటాయి. ఎండిన కాయలు పగిలి వంకర్లు తిరుగుతాయి. గింజలు గుండ్రంగా టాబ్లెట్లలాగా ఎర్రగా మెరుస్తుంటాయి.

గుణాలు, ఔషధీ ఉపయోగాలు మార్చు

ఈ చెట్టు బెరడు రక్తస్రావమును నిలుపు చేయుట, గాయములు మాన్పుట, వీర్యవర్థకముగా పనిచేస్తుంది. పెద్ద పేగుల నుండి బంకపడుట, మూత్రములో రక్తము పడుట, వ్రణములను మాన్పుటకు, వాత రోగములకు మంచి ఔషధము. దీని గింజలు రక్తస్రావము అరికట్టుట, కామోద్దీపనము, చలన చేయుట, చీము పట్టుటను అరికట్టుట, వాంతులను నివారించుట, జ్వరములను తగ్గించుటకు ఇది మంచి ఔషధము. వాత, పిత్త, రోగాలకు, శరీరపు మంటలను, అమిత దాహము, తలదిమ్మను తగ్గిస్తుంది. దీని కాండములోని గట్టి భాగము రక్తస్రావము అరికట్టుట, కామోద్దీపనము, బంక విరేచనములు అరి కట్టుట, రక్తస్రావము, వాత రోగములకు పనిచేస్తుంది.

ఉపయోగపడు భాగాలు మార్చు

బెరడు, ఆకులు, విత్తనాలు, కాండము గట్టి భాగము.

మూలాలు మార్చు

వనమూలికా వైద్యము

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు